సికింద్రాబాద్ బోయగూడలోని కళారంగ్ కాలనీలో స్థానికంగా భయాందోళనలు అలుముకున్నాయి. కళారంగ్ కాలనీలో నివసించే సయ్యద్ సమీర్‌ను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అతను నివసించే ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. సయ్యద్ సమీర్.. తన తల్లి సబెరా, చెల్లెలు అలియాతో కలిసి కొంత కాలంగా కళారంగ్ కాలనీలో నివసిస్తున్నాడు. సయ్యద్ సమీర్ కాలనీ వాసులతో ఎప్పుడూ గొడవ పెట్టుకునే వాడని కళారంగ్ కాలనీ బస్తివాసులు చెబుతున్నారు. అంతేకాదు.. తరచూ ఓల్డ్ సిటీ నుంచి ఎవరెవరో వచ్చేవాళ్లని, రాత్రి వేళల్లో వాళ్లతో ఇంట్లో రహస్యంగా మాట్లాడుకునే వాడని అంటున్నారు. ఇన్నాళ్లుగా ఓ ఐసిస్ స్లీపర్ సెల్‌గా పనిచేస్తున్న వ్యక్తి తమ మధ్య తిరిగాడంటేనే భయం పుడుతోందంటున్నారు. వెంటనే సమీర్ కుటుంబాన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని బస్తీ వాసులు పోలీసులను కోరుతున్నారు. ఇక్కడే ఉంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెప్పడం తమను ఎంతగానో బాధ పెడుతోందని అంటున్నారు.
అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా.?
కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపట్ల లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు తమ ప్రభుత్వం అద్బుతమైన ఆతిథ్యమిచ్చిందని, కాళేశ్వరం పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి సరైన ఆతిథ్యం ఇవ్వలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.
ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏం చేస్తోందని మాట్లాడతారని మండిపడ్డారు. అన్నీ కేంద్రమే చేస్తే ఇక మీరున్నది ఎందుకు? కేవలం ఒక ఏరియాకే పుష్కరాలను పరిమితం చేయడం సరికాదన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులందరి కోర్కెలు తొలగిపోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.
కాళేశ్వరం చాలా పవర్ ఫుల్ ప్లేస్. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మనకు చాలా చెడ్డ పేరొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం ఆలయానికి రూ.వంద కోట్లు ఇస్తానని మొండి చేయి చూపిందని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం కూడా 200 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. గతంలో వేములవాడకు కూడా ఇట్లనే హామీ ఇచ్చారు. కానీ ఎన్ని నిధులిచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఇకనైనా ఒట్టి హామీలను పక్కనపెట్టి కాళేశ్వరంను అద్బుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బండి సంజేయ్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో మందు బాబులకు సర్కారు షాక్
తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇటీవలే సమ్మర్ ప్రారంభంలో బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు లిక్కర్ రేట్లు కూడా పెంచేసింది. విస్కీ, బ్రాందీ క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ జారీ చేసింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే, చీప్ లిక్కర్ మద్యం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది.
మరోవైపు.. లిక్కర్ రేట్లు పెంచడంపై మద్యం ప్రియులు మండి పడుతున్నారు. అయితే, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం మద్యం ధరలను సవరించినట్లు తెలుస్తోంది. వేసవి కాలానికి ముందే ఫిబ్రవరిలో బీర్ల ధరలు ఒకేసారి 15శాతం పెంచింది ప్రభుత్వం. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు ఎక్సైజ్‌శాఖ ధరల పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం బీర్ల ధరలను సవరించింది.
దేశవ్యాప్తంగా నైరుతి ఎఫెక్ట్
ఈ యేడాది మండుతున్న ఎండల నుంచి ముందుగానే రిలీఫ్ దొరక బోతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దేశమంతటా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోందని ఐఎండీ ప్రకటించింది. వీటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం సూచించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే కోస్తాలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, చెదురు మదురుగా భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. ఒంగోలు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు, కూలీలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాల అధికారులు హెచ్చరించారు.
అమృత్ భారత్ నిధులతో రైల్వేస్టేషన్లకు అత్యాధునిక హంగులు (ఫోటోలు)
అమృత్ భారత్ పథకం నిధులతో నిర్మాణం పూర్తయిన మూడు రైల్వేస్టేషన్లను ఈనెల 22వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొత్త రూపు సంతరించుకున్న ఆ రైల్వేస్టేషన్ల ఆకట్టుకునే ఫోటోలను సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు భాస్కర న్యూస్ ప్రేక్షకుల కోసం…
పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ చిక్కులు
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై కచ్చితమైన దాడులు జరపడంతో, భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాకిస్తాన్‌పై కొత్త ఆర్థిక షరతులను విధించి, ఆ దేశ ఆర్థిక విధానాలపై తీవ్ర దృష్టి సారించింది. మొత్తం 50 షరతులతో, ఐఎంఎఫ్ కఠినమైన ఆర్థిక సంస్కరణ షరతులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాయి.
ఈ కొత్త షరతులు, పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ పెరుగుదల, ఆర్థిక అస్థిరతల నడుమ వచ్చాయి. దీనితో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత లోనవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎఫ్ ఇటీవల పాకిస్తాన్‌కు 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద 1.023 బిలియన్ డాలర్లు రెండవ విడత విడుదల చేసింది. ఈ నిధులతో పాటు 11 కొత్త షరతులను విధించింది. దీంతో మొత్తం షరతుల సంఖ్య 50కి చేరింది.
ఈ షరతులు పాకిస్తాన్ ఆర్థిక విధానాలను కఠినంగా నియంత్రించడమే కాకుండా, దేశ బడ్జెట్, పన్ను సంస్కరణలు, మరియు రక్షణ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. IMF సిబ్బంది నివేదికలో,
భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఈ సంస్కరణ లక్ష్యాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని హెచ్చరించింది, ఇది పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతుంది. పాకిస్తాన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్లుగా నిర్ణయించింది.
ఇది గత సంవత్సరం కంటే 12% (రూ.252 బిలియన్లు) అధికం. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాక్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌ను రూ.2.5 ట్రిలియన్లకుపైగా పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 18% పెరుగుదలను సూచిస్తుంది. ఈ రక్షణ ఖర్చుల పెరుగుదల IMF ఆర్థిక సంస్కరణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని, ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
2026 బడ్జెట్ ఆమోదం: జూన్ 2025 నాటికి, పాకిస్తాన్ పార్లమెంట్ రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌ను, IMF లక్ష్యాలకు అనుగుణంగా ఆమోదించాలి. ఈ బడ్జెట్ 1.6% ఎఈ్క ప్రాథమిక బడ్జెట్ సర్ప్లస్‌ను సాధించాలి. దీనికి రూ.2 ట్రిలియన్ల అదనపు ఆదాయం అవసరం: జూన్ 2025 నాటికి, నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీనికోసం రిజిస్ట్రేషన్, పన్ను వసూలు, ప్రచార కార్యక్రమాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఈ చర్య వ్యవసాయరంగంలో పన్ను వసూళ్లను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చారిత్రాత్మకంగా పన్ను ఆదాయంలో తక్కువ వాటాను కలిగి ఉంది.: ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలి, మే 2026 నాటికి ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలి. ఇది ఇంధన రంగంలో సబ్సిడీలను తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
విద్యుత్ సర్‌చార్జ్ : విద్యుత్ బిల్లులపై అధిక రుణ సేవా సర్‌చార్జ్‌లను విధించాలి, దీనితో విద్యుత్ రంగంలో సర్క్యులర్ డెట్‌ను తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్ యొక్క ఇంధన విధానాలను సర్క్యులర్ డెట్‌కు ప్రధాన కారణంగా గుర్తించాయి.
ఇతర సంస్కరణలు ప్రత్యేక జోన్ రాయితీల తొలగింపు: 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్‌లు, ఇండస్ట్రియల్ పార్క్‌లకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాలి, దీనికోసం 2025 చివరి నాటికి ఒక రోడ్‌మ్యాప్ సమర్పించాలి.
వాడిన కార్ల దిగుమతి: జూలై 2025 నాటికి, ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతిని అనుమతించే చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించాలి, ఇది ప్రస్తుత మూడు సంవత్సరాల పరిమితిని సడలించడం ద్వారా వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తుంది.
గవర్నెన్స్ సంస్కరణలు: IMF గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్‌మెంట్ ఆధారంగా, అవినీతి బహిర్గతాలను గుర్తించి, సంస్కరణల కోసం ఒక గవర్నెన్స్ యాక్షన్ ప్లాన్‌ను ప్రచురించాలి. అదనంగా, 2027 తర్వాత ఆర్థిక రంగ
నియంత్రణ కోసం ఒక ప్రణాళిక రూపొందించి, 2028 నుంచి సంస్థాగత వాతావరణాన్ని బలోపేతం చేయాలి. రక్షణ ఖర్చులు, ఆర్థిక అస్థిరత
పాకిస్తాన్ GDP కేవలం 236 బిలియన్ డాలర్లు్ల కాగా, రక్షణ రంగానికి 7 బిలియన్ డాలర్లకుపైఆ కేటాయించడం ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఐఎంఎఫ్ నిధులు ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్దేశించినప్పటికీ,
వీటిని రక్షణ ఖర్చులకు మళ్లించే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. భారత్, IMF బోర్డ్ సమావేశంలో ఈ నిధుల విడుదలకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా నిష్క్రియంగా ఉండటం, పాకిస్తాన్ గత
రికార్డు, ఉగ్రవాదానికి నిధుల సాధ్యతపై ఆందోళనలను వ్యక్తం చేసిందిపాకిస్తాన్ వేగంగా పెరుగుతున్న జనాభా విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై భారీ ఒత్తిడిని కలిగిస్తోంది, దీనితో ఆర్థిక సంక్షోభం మరింత
తీవ్రమవుతోంది. షరతులు, ముఖ్యంగా ఇంధన సబ్సిడీల తొలగింపు, పన్ను వసూళ్ల పెంపు, ద్రవ్యోల్బణాన్ని పెంచి, ప్రజలలో అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. ఈ షరతులను అమలు చేయడంలో విఫలమైతే,
IMF నిధుల విడుదల ఆగిపోవచ్చు, దీనితో పాకిస్తాన్ ఆర్థిక పతనం అంచులకు చేరుకునే ప్రమాదం ఉంది.మే 7, 2025న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది
మరణించిన ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగింది. ఈ దాడుల తర్వాత, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, IMF నిధులు పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు పరోక్షంగా సహాయపడతాయని హెచ్చరించారు.
IMF సిబ్బ – భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఆర్థిక సంస్కరణలను దెబ్బతీస్తాయని, ఈ ఉద్రిక్తతలు కొనసాగితే పాకిస్తాన్ ఆర్థిక లక్ష్యాలు ప్రమాదంలో పడతాయని తన నివేదికలో పేర్కొంది.ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్
ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి, 2025 చివరి నాటికి 2.1% GDP లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతున్నాయి. అయితే, కొత్త షరతులు, ముఖ్యంగా ఇంధన సబ్సిడీల
తొలగింపు, పన్ను పెంపు, ద్రవ్యోల్బణాన్ని పెంచి, ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతాయి. ఈ షరతులను అమలు చేయడంలో విఫలమైతే, IMF నిధులు నిలిపివేయబడవచ్చు, దీనితో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.
ప్రారంభానికి సిద్ధమైన మూడు రైల్వేస్టేషన్లు
22న స్విచ్ నొక్కనున్న ప్రధాని నరేంద్ర మోదీ
బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ప్రారంభం
మరో 12 స్టేషన్లలో శరవేగంగా ఆధునీకరణ పనులు
అత్యద్భుతంగా మారిపోతున్న రైల్వేస్టేషన్లు
తెలంగాణ లోని మూడు రైల్వే స్టేషన్లు పాత రూపు రేఖలు మారిపోయాయి. సరికొత్త రూపు సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని బేగంపేటతో పాటు.. ఉత్తర తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీన ప్రారంభించనున్నాయి. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీట నొక్కి ఈ స్టేషన్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ స్టేషన్లలో నిర్మాణాలు పూర్తయ్యాక కొత్త ఫోటోలను సోషల్ మీడియా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) నిధుల ద్వారా చేపట్టిన పనులతో ఈ స్టేషన్లు విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. స్టేషన్ల బయట, లోపల కూడా ప్రయాణికుల సౌకర్యం కోసం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో దాదాపు రూ.26.64 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ స్టేషన్‌ను పూర్తిగా పునర్నిర్మించారు. ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరొక ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కే శ్రమను తగ్గించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంతాలు విశాలంగా నిర్మించారు. పరిశుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు, ఆధునిక మరుగుదొడ్లు, మెరుగైన లైటింగ్, టికెట్ కౌంటర్లు, లాకర్ గదులు, తాగునీటి సౌకర్యం, ఏటీఎంలు, డిజిటల్ డిస్‌ప్లేలు, సీసీటీవీ కెమెరాలు వంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.
ఇటు.. వరంగల్ రైల్వేస్టేషన్, హైదరాబాద్‌లోని బేగంగపేట రైల్వేస్టేషన్ కూడా ఎయిర్‌పోర్టులను తలపిస్తున్నాయి. ప్రయాణీకులు ప్రవేశించే మార్గాలు, లిఫ్టుల ప్రాంతాలు ఇంతకుముందు ఇరుగ్గా ఉండేవి. ఇప్పుడు విశాలంగా పునర్నిర్మించారు. ఇక, ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి రూపొందించిన గదులు ఎయిర్‌పోర్టుల్లో లాంజ్‌లను తలపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను ఆధునీకరించడం వంటి పనులు చేపడుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఉచిత వై-ఫై సదుపాయం కల్పించడం. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం, స్టేషన్లలో ప్రయాణికుల సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూలమైన పద్ధతులను అవలంబించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటివి వీటిలో భాగంగా పునర్నిర్మిస్తున్నారు. తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో ముఖ్యంగా.. సికింద్రాబాద్, బేగంపేట్, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండం, నల్గొండ, మిర్యాలగూడ, జనగాం, భువనగిరి, మధిర, యాదాద్రి వంటి స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 1309 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.
టీటీడీపై మహబూబ్ నగర్ భక్తుల న్యాయ పోరాటం…
వినియోగదారుల కమిషన్ తీర్పుతో దిగొచ్చిన టీటీడీ
తిరుమల వేంకటేశ్వరుడి సేవలో పాల్గొనడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రెండు జంటలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురయ్యింది. వినయోగదారలు న్యాయస్ధానం కలగచేసుకుని భక్తులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరుమల తిరుపతి దేశస్ధానం ట్రస్ట్ బోర్డు దిగొచ్చి భక్తులు కోరిన స్వామివారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త శెట్టి చంద్రశేఖర్ ఆయన సతీమణి సుమిత్ర శెట్టి కుమారుడు హరీష్ శెట్టి అతని సతీమణి కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగిఏ మేట్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనడానికి 2008వ సంవత్సరం నవంబర్ 26న 21వేల 250 రూపాయల డీడీని తిరుమలలోని పేష్కార్ కార్యాలయానికి పంపించారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా తాము కోరుకున్న సేవను దర్శించుకునే అవకాశం దొరకకపోవడంతో చంద్రశేఖర్ శెట్టి టీటీడీకి అనేక లేఖలు రాశారు. ఎట్టకేలకు 2021 సెప్టెంబర్ 10 వ తేదీన మేల్ చాట్‌సేవలో పాల్గొనడానికి స్లాట్ బుకింగ్ అయ్యిందని కరోనా కారణంగా క్యాన్సిల్ చేశామని దాని బదులుగా బ్రేక్ దర్శనం ఇస్తామని చంద్రశేఖర్ కి సమాచారం అందించారు. అయితే మేట్ చాట్ వస్త్ర సేవ బదులు బ్రేక్ దర్శనం వినియోగించుకోవడనికి చంద్రశేఖర్ కుటుంబం అంగీకరించకుండా తమకు ముందుగా అనుకున్న సేవే కాలవాలని టీటీడీ ని కోరారు. అయితే దీనికి టీటీడీ అధికారులు అంగీకరించకపోవడంతో న్యాయం కోసం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. చంద్రశేఖర్ శెట్టి పిటీషన్ని పరిశీలించిన వినియోగదారుల కమిషన్ నాలుగు రోజుల లోపల మేల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనే అవకాశం చంద్రశేఖర్ శెట్టి కుటుంబానికి కల్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో 20 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని జడ్జి ఎం.అనురాధ తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ టీటీడీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. ఈ వివాదాన్ని జిల్లా కమిషన్ లోనే పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పడంతో తిరిగి జిల్లా కమిషన్ లో రివిజన్ వేశారు. జిల్లా కమిషణలో అంతకు ముందు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి చంద్రశేఖర్ శెట్టి కుటుంబానికి శ్రీవారి మేల్ చాట్ సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారా లేక జరిమానలో యాభైశాతం పదిలక్షలు ప్రస్తుతం డిపాజిట్ చేస్తారా లేకపోతే జైలుకు వెళతారా అని జడ్జి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఆగస్టు 14, 15 తేదీల్లో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ అందుకు సంబంధించిన టిక్కెట్లను కూడా కోర్టు ద్వారా భక్తులకు అందజేశారు.
హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర – ఐసిస్ స్లీపర్లు అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు సంబంధించిన కుట్రను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ఈ కుట్ర వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వ్యూహం ఉందని ప్రాథమికంగా నిర్ధారించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కుట్రను ముందుగానే గుర్తించి భగ్నం చేసింది. విజయనగరంలో ఒక అనుమానాస్పద వ్యక్తి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు, అతని ఇంటిపై దాడి చేసి, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సేకరించి పెట్టుకున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేశారు.
సిరాజ్ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. సౌదీలో ఉన్న ఐసిస్ నేతల నుంచి వస్తున్న ఆదేశాల మేరకు స్థానికంగా కుట్రలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని గుర్తించారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, హైదరాబాద్‌లో ఉన్న లింకులు కూడా బయటపడ్డాయి. బోయిగూడకు చెందిన లిఫ్ట్ ఆపరేటర్ సయ్యద్ సమీర్‌తో సిరాజ్‌కు నేరుగా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సమీర్-సిరాజ్‌కు ఆదేశాలు ఇచ్చింది. బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంతో పేలుళ్ల ముప్పు తప్పింది. వీరి మధ్య జరిగిన చాటింగ్, ఆన్‌లైన్ కొనుగోళ్లు, రసాయనాల సేకరణ వంటి అంశాలన్నీ నిఘా సంస్థలకు కీలక ఆధారాలుగా మారాయి.
ఇటీవల పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” పేరుతో పీవోకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు, ఆయా దేశాల్లోని వారి అనుబంధ నెట్‌వర్క్‌లు ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. యువతను మభ్యపెట్టి ఉగ్రవాదంలోకి నెట్టేందుకు ప్రలోభాలు, ప్రేరణలు ఇస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్రలో నిందితులు ఉపయోగించిన పద్ధతులు, చాటింగ్ డేటా, టెక్నికల్ ఆధారాలను అన్నింటినీ ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఈ అరెస్టులు హైదరాబాద్ నగరం భద్రత విషయంలో మరోసారి అప్రమత్తం అయ్యేలా చేస్తున్నాయి.
లవ్ జిహాద్ – ఆపై గూఢచర్యం
పాకిస్తాన్‌కు సైనిక రహస్యాలు చేరవేసిందన్న ఆరోపణలపై ఆరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ హై కమిషన్‌లో పనిచేసే ఉద్యోగితో పరిచయమైనప్పటినుంచీ ఆమె జీవితం, ఆలోచనలు మలుపు తిరిగాయని విచారణాధికారులు గుర్తించారు. లవ్ జిహాద్‌కు చిక్కి ఆపై గూఢచర్యానికి పాల్పడిందని అంచనాకు వచ్చారు.
హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా, ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి. 2018లో ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ విశేషాలను తనదైన ప్రత్యేక శైలిలో వీడియోలుగా ప్రజలకి అందించింది. ఆమెకి ఉన్న ఆకర్షణీయమైన వ్యాఖ్యాన శైలి, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో రూపొందించిన కంటెంట్ యూత్‌లో విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టింది. కానీ, 2023లో పాకిస్తాన్‌కి వెళ్లిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్ ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం బలమైన సంబంధంగా మారి, జ్యోతి అతడి వలలో చిక్కింది.
డానిష్ మాయలో పడి జ్యోతి గూఢచర్యానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాట్సప్, ఇతర ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ అప్లికేషన్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప ప్రాంతాల సమాచారం, ఆయుధ నిల్వల వివరాలను పంపినట్లు నిర్ధారణ అయ్యింది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను స్పైయింగ్ కోసం ఆమె ఉపయోగించిన తీరు భద్రతా సంస్థలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన ఒక ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్న వీడియోలతో పాటు, పాక్ జాతీయ దినోత్సవంపై ఆమె చేసిన సంభాషణలు బయటపడ్డాయి. జ్యోతి పహల్గామ్ ప్రాంతాన్ని గతంలో సందర్శించిన విషయం దర్యాప్తులో కీలకంగా మారింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆమెకి సంబంధం ఉందా? అన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారించారు.
జ్యోతి తన యూట్యూబ్ వీడియోల ద్వారా సైనిక స్థావరాలకు సమీప ప్రాంతాలను చిత్రీకరించి, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి పంపినట్లు విచారణలో వెల్లడైంది. హర్యానా–పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో 2024 చివరలో భారత సైనిక కదలికలపై కూడా ఆమె సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమెపై అనుమానం వ్యక్తం చేసి నిఘా పెంచాయి. ఆమె ఫోన్, మెసేజ్‌లను పసిగట్టి, వీడియోలలో కనిపించిన దృశ్యాలు ఉద్దేశపూర్వక మైనవని నిర్ధారించాయి.
ప్రస్తుతం జ్యోతిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ల్లో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల ఫోటోలు దొరికాయి. ఈ కేసులో మరో ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆధారాలతో జ్యోతిపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఓ యూట్యూబర్ ఈ విధంగా గూఢచర్యానికి పాల్పడటం దేశ భద్రతకు తీవ్ర హెచ్చరికగా మారింది.