తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇటీవలే సమ్మర్ ప్రారంభంలో బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు లిక్కర్ రేట్లు కూడా పెంచేసింది. విస్కీ, బ్రాందీ క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ జారీ చేసింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే, చీప్ లిక్కర్ మద్యం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది.
మరోవైపు.. లిక్కర్ రేట్లు పెంచడంపై మద్యం ప్రియులు మండి పడుతున్నారు. అయితే, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం మద్యం ధరలను సవరించినట్లు తెలుస్తోంది. వేసవి కాలానికి ముందే ఫిబ్రవరిలో బీర్ల ధరలు ఒకేసారి 15శాతం పెంచింది ప్రభుత్వం. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు ఎక్సైజ్‌శాఖ ధరల పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం బీర్ల ధరలను సవరించింది.