26.4 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img
Home Blog Page 3

పాతబస్తీ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశం

ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ నియమించిన ప్రభుత్వం

గుల్జార్‌ హౌజ్ సమీపంలో మొన్న ఆదివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గానూ ఆరుగురు ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు – హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈనెల 18 వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్‌ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ , ఫైర్ డీజీ నాగిరెడ్డి , హైడ్రా కమిషనర్ రంగనాథ్ ,టీఎస్ఎస్పీడీసీఎల్‌ సిఎండి ముషారఫ్ లు సభ్యులగా ఉంటారు. ఈ కమిటీ 18వ తేదీ జరిగిన గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల  కారణాలు ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలు, ఆగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య శాఖలు స్పందించిన తీరుల పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సమగ్ర నివేదిక ఇస్తుంది. అలాగే భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేస్తూ ప్రతిపాదనలు కూడా కమిటీ సీయంకు అందజేయనుంది. కమిటీ నివేదిక సమర్పించిన  అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి తగు చర్యలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అజర్ బైజాన్, టర్కీలకు కట్… వియత్నాంకు పర్యాటకులు

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తుర్కియే పాకిస్తాన్‌కు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేయడం, అజర్‌బైజాన్‌ భారత దాడులను ఖండిస్తూ పాక్‌కు సంఘీభావం తెలపడంతో ఈ రెండు దేశాలపై బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది. హెదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల పర్యాటకులు తమ వేసవి సెలవు ప్రణాళికలను రద్దు చేసుకునే ఉద్యమంలో పాల్గొంటున్నారు. వేసవి సెలవుల సీజన్‌లో తుర్కియే, అజర్‌బైజాన్‌లు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఆకర్షణీయ గమ్యస్థానాలుగా ఉంటాయి. ఈ ఏడాది దాదాపు లక్ష మందికి పైగా పర్యాటకులు ఈ దేశాలను సందర్శించేందుకు ప్రణాళికలు రూపొందించారని అంచనా.

రెండు దేశాలు పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడంతో హైదరాబాద్‌లో కేవలం రెండు మూడు రోజుల్లోనే 10 వేల మందికి పైగా పర్యాటకులు బుకింగ్‌లను రద్దు చేసుకున్నారని వాల్మీకి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వ్యవస్థాపకుడు హరికిషన్‌ వెల్లడించారు. ట్రావెల్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా తుర్కియే, అజర్‌బైజాన్‌లకు కొత్త బుకింగ్‌లను నిలిపివేయాలని సూచించింది. టూర్‌ ఆపరేటర్లు ఈ దేశాలకు సంబంధించిన ప్రమోషనల్‌ ఆఫర్‌లను ఉపసంహరించారు.

రద్దుల ఇదే కారణం..
హైదరాబాద్‌: గత వారంలో తుర్కియేకు 22%, అజర్‌బైజాన్‌కు 30% బుకింగ్‌లు రద్దయ్యాయి.

తెలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ తుర్కియే, అజర్‌బైజాన్‌లకు పర్యాటకులను పంపడం పూర్తిగా నిలిపివేసింది. ఏటా ఈ రెండు దేశాలకు 8 వేల మంది పర్యాటకులు వెళ్లేవారని అంచనా.

జాతీయ స్థాయి: మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్‌ వంటి ప్రముఖ ట్రావెల్‌ సంస్థలు తుర్కియే, అజర్‌బైజాన్‌లకు బుకింగ్‌లు 60% తగ్గినట్లు, రద్దులు 250% పెరిగినట్లు నివేదించాయి.

బాయ్‌కాట్‌ ప్రభావం
2024లో దాదాపు 3.3 లక్షల మంది భారతీయులు తుర్కియే, 2.4 లక్షల మంది అజర్‌బైజాన్‌ను సందర్శించారు. రెండు దేశాలకు రూ. 6,900 కోట్లకు పైగా ఆదాయాన్ని అందించారు. ప్రస్తుత బహిష్కరణ ఉద్యమంతో టూరిజం ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత వాణిజ్య సంస్థ CAIT తుర్కియే, అజర్‌బైజాన్‌లతో వాణిజ్య సంబంధాలను రద్దు చేయాలని 24 రాష్ట్రాల నాయకుల సమావేశంలో నిర్ణయించింది. దీంతో ఈ దేశాల ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

తుర్కియే, అజర్‌బైజాన్‌ ప్రతిస్పందన
బహిష్కరణ ఉద్యమం నేపథ్యంలో తుర్కియే టూరిజం శాఖ భారతీయ పర్యాటకుల భద్రత, సంతృప్తికి కట్టుబడి ఉన్నామని, హోటళ్లు, రెస్టారెంట్లు ఎప్పటిలాగే ఆతిథ్యం అందిస్తాయని ప్రకటించింది. అయితే, ఈ హామీలు పర్యాటకుల నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. అజర్‌బైజాన్‌ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రతిస్పందన లేదు, కానీ టూరిజం రంగంలో నష్టం స్పష్టంగా కనిపిస్తోంది.

తుర్కియే, అజర్‌బైజాన్‌ టూర్లను రద్దు చేసుకుంటున్న తెలుగు పర్యాటకులు ప్రత్యామ్నాయంగా ఆసియా దేశాలను ఎంచుకుంటున్నారు. వీటిలో వియత్నాం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇతర గమ్యస్థానాల్లో దుబాయ్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా ఉన్నాయి. భారత పర్యాటకులకు వీసా ఫ్రీ అవకాశం ఇచ్చేందుకు వియత్నాం ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వియత్నాం బడ్జెట్‌ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, హనోయ్, హా లాంగ్‌ బే, హో చి మిన్‌ సిటీ వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

కుదేలవుతున్న బంగ్లాదేశ్ వస్త్రపరిశ్రమ

భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగుదేశాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా, ఆర్థిక పరంగా గట్టిగా బుద్ధి చెబుతోంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలు.. భారత్ అంటే అక్కసు వెళ్లగక్కుతున్నాయి. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నంతవరకు భారత్‌కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్.. ఆమె గద్దె దిగిపోవడంతో శత్రుదేశంగా మారిపోయింది. బంగ్లాదేశ్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ చర్యలు చేపట్టింది.

భూమార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే వస్త్రాలను ఆంక్షలు విధించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో దేశీయ వస్త్ర పరిశ్రమకు రూ.వెయ్యి 1000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల మేర కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని భారత్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దేశీయ,అంతర్జాతీయ బ్రాండ్‌ దుస్తుల సప్లై చైన్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల చలికాలంలో టీ-షర్ట్‌లు, డెనిమ్స్ దుస్తుల ధరలు 2-3 శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బంగ్లాదేశ్ నుంచి భూ సరిహద్దుల ద్వారా దుస్తులు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను భారత్ నిషేధించింది.

కోల్‌కతా, నవసేవా పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అనుమతి ఉంది. భారత్‌లోకి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకం లేని కారణంగా బంగ్లాదేశ్ నుంచి పన్ను లేకుండానే దిగుమతి అయ్యే వస్త్రాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా దేశీయంగా టెక్స్‌టైల్స్ పరిశ్రమను ప్రోత్సహించి.. విదేశీ దుస్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో చైనా నుంచి రహస్యంగా బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి మళ్లించబడుతున్న వస్తువులను కూడా అరికట్టవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

చైనా నుంచి భారత్‌లోకి నేరుగా రవాణా చేస్తే ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు.భారత్ నుంచి ఎగుమతి అయ్యే నూలుపై ఏప్రిల్ నెలలోనే బంగ్లాదేశ్ పరిమితులు విధించిందని.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) ఛైర్మన్ రాకేష్ మెహ్రా తెలిపారు. ఇది సాంప్రదాయకంగా భారత్ మొత్తం నూలు ఎగుమతిలో దాదాపు 45 శాతం ఉంటుంది. బంగ్లాదేశ్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మకంగా భారత్ తీసుకున్న బలమైన ప్రతిస్పందనగా కనిపిస్తోందని రాకేష్ మెహ్రా వెల్లడించారు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ దుస్తుల దిగుమతి వ్యయాన్ని పెంచుతుందని.. దీని వల్ల దేశీయ రెడీమేడ్ గార్మెంట్ ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. భారత్ నుంచి నూలు ఎగుమతి చేసేవారు తమ సరఫరాను దేశీయ మార్కెట్‌కు మళ్లించడానికి వీలు కలుగుతుందని.. తద్వారా డిమాండ్ గ్యా్ప్‌ను పూరించవచ్చని పేర్కొన్నారు.క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఏఐ) అధ్యక్షుడు సంతోష్ కటారియా.. తక్కువ ధర కలిగిన బట్టలు భారతీయ రిటైల్ మార్కెట్‌లోకి అడ్డగోలుగా ప్రవేశిస్తున్నాయనే పరిశ్రమ దీర్ఘకాలిక ఆందోళనను ఈ చర్య పరిష్కరిస్తుందని.. ఇది దేశీయ తయారీదారులపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

వంద రోజులుగా జైల్లోనే వల్లభనేని వంశీ

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • తీవ్ర అనారోగ్యం పాలైన వంశీ
  • రాజీకాయాలకు దూరంగా ఉండాలనే యోచనలో వంశీ

వైఎస్‌ఆర్‌సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఒకదాని వెనకాల ఒకటిగా ఆయనపై వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే.. మరో కేసు నమోదు చేస్తున్నారు. దీనిలో కూడా బెయిల్ దొరికితే ఇంకో కేసులో పీటీ వారెంట్‌ తో వస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ కి రిమాండ్ ఖైదీగానే వంద రోజులు గడిచిపోయింది. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ పరిస్థితిని తలచుకొని ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను తలచుకొని వంశీ తీవ్రంగా కలత చెందినట్లు సమాచారం. ముఖ్యంగా రాజకీయాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బెయిల్ లభించిన వెంటనే ఈవిషయంపై ఆయన ఓ ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

 ఆ కామెంట్స్ పై పశ్చాత్తాపం..

వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండు సార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ నుంచే విజవాడ ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో అప్పటికి అయిదు సార్లు శాసనసభ్యునిగా గెలిచిన దాసరి బాలవర్ధనరావుని కాదని గన్నవరం టిక్కెట్‌ వల్లభనేని వంశీకి ఇచ్చారు చంద్రబాబు. ఆతరువాత 2019లో కూడా వంశీకే టిక్కెట్‌ ఇచ్చారు. ఈ రెండు సార్లు శాసనసభ్యునిగా గెలిచిన వంశీ 2019లో అధికార వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. అయితే వంశీ వైసీపీలో చేరడానికి ముందు నుంచే ఐటీడీపీ కార్యకర్తలు వల్లభనేని వంశీ వెంట పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో వైసీపీలో చేరిన తరువాత వంశీ కూడా చంద్రబాబు మీద ఆయన తనయుడు నారాలోకేష్‌ మీద తరచు విమర్శలు చేస్తూ ఉండేవారు. ఒక దశలో ఈ విమర్శలు శృతి మించుతూ ఉండేవి. వంశీ తనపైనా తన తల్లిదండ్రులపైనా చేసిన విమర్శలపై లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేవారు. తాము అధికారంలోకి వచ్చాక వంశీని కడ్రాయర్‌ తో నడి రోడ్డు మీద నిలబెతానని బహిరంగ వేదికలపై శపథం చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీపై అంతకన్నా ఎక్కువగా పగ తీర్చుకుంటున్నారు. దాదాపు రోజులుగా వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా జైల్లో మగ్గిపోతున్నారు. మానసికంగా అంతులేని వేదన అనుభవిస్తున్న వంశీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆయన ఆహార్యం కూడా దారుణంగా మరిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో న్యాయ సాహాయం అందడం లేదనే ఆవేదనతో వంశీ ఉన్నట్లు సమాచారం.

గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి, అక్కడ పనిచేస్తున్న సత్య వర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ వంటి కేసులు వల్లభనేని వంశీపై ఏపీ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలోనే ఫిబ్రవరి 13న హైదరాబాదులో వల్లభనేని వంశీ మోహన్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి కేసు మీద కేసులు పెడుతూనే ఉన్నారు. మొత్తం ఆరు కేసులు పెట్టారు. అందులో ఐదు కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఇంతలో నకిలీ ఇళ్లపట్టాలకు సంబంధించి కేసు నమోదు చేశారు. దీంతో ఆయన రిమాండ్ మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో గన్నవరం నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దుట్టా రామచంద్ర రావు కుమార్తెకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వల్లభనేని వంశీ మోహన్ లో మరింత మనస్థాపం పెరిగినట్లు సమాచారం. ఇంత జరిగాక బెయిల్‌ పై విడుదలయ్యాక వల్లభనేని వంశీ ఊహగానాలు నిజం చేస్తూ రాజకీయాలకు దూరం అవుతారా లేక రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్‌ అవుతారో వేచి చూడాలి.

మహానాడుకు జూనియర్ ఎన్టిఆర్..!

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీ మనుగడ సాధించేలా కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులను మహానాడులో భాగస్వామ్యం చేయనున్నారు.

నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ దిశగా నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. పార్టీ కార్యక్రమాలతో పాటు మహానాడులోనూ పాల్గొన్నారు. 2014లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

తరువాత క్రమేపి పార్టీతో పాటు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచూ పార్టీలో వినిపించేది. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకోవాలని కేడర్ కోరేది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండడం… వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలపై టిడిపి అంచనాలకు తగ్గట్టు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆగ్రహానికి కారణమైంది.

2024 ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించడంపై జూనియర్ ఎన్టీఆర్ను అందరూ అభినందించారు. ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు పిలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం జూనియర్ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. రాజకీయ ప్రకటనలు కూడా చేయడం లేదు. ఈ తరుణంలో జూనియర్ ఎన్టిఆర్ మహానాడుకు పిలుపు వచ్చినా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ముద్ద మందారం మహీరా శర్మ

గ్లామరస్ హీరోయిన్ మహీరా శర్మ. పంజాబీ, హిందీల్లో సినిమాలు చేసిన మహీరా సోషల్ మీడియాలో మామూలుగా ఉండదు. ముద్ద మందారంలా ఆకట్టుకుంటున్న మహీరా ఫోటోలకు కుర్రకారు వెండపడతారు.

మహీరా శర్మ 1997లో జమ్ములో జన్మించింది

ముంబైలో విద్యాబ్యాసం చేసిన మహీరా కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ వైపు మళ్లింది

మహిరా శర్మ 2015లో సబ్ టీవీ స్టార్ లో మెహతా కా ఊల్తా చష్మాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా కెరీర్‌ ప్రారంభించింది.

మహీరా చేసిన పంజాబీ మ్యూజిక్ అల్బమ్ లెహెంగా యూట్యూబ్లో బిలియన్ కన్నా ఎక్కువ వ్యూవర్ షిప్ దక్కించుకుంది

మహిరా శర్మ 2022లో చేసిన పంజాబీ సినిమా లెహంబర్గిని సినిమాలో క్యారెక్టర్ కు ప్రశంసలు అందుకుంది

అందాల భామపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

క్రికెటర్ సిరాజ్ తో మహీరా ప్రేమాయణం సాగిస్తోందని చర్చోపచర్చలు జరిగాయి. దీనిపి ఇద్దరు కామెంట్ చేయకపోవడం లేదు

దక్షిణాదిలో అవకాశాలు వస్తే అందాల విందు చేస్తానంటోంది కశ్మీరీ మహీరా

courtesy: instagram

నల్లమల్ల డిక్లరేషన్

నల్లమల బిడ్డగా మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాం. మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ ప్రకటించారు. నల్లమల డిక్లరేషన్‌  ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో వారి అభివృద్ధి, సాధికారత కోసం పనులు చేపడతామని తెలిపారు.

నల్లమల డిక్లరేషన్‌ ఆంశాలు.
1. తెలంగాణ ప్రభుత్వం 2006 ఆర్వోఎఫ్ ఆర్ చట్టం ప్రకారం 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 2 లక్షల 30 వేల 7 వందల 35 షెడ్యూల్డ్ తెగలకు (ST) అటవీ హక్కులను గుర్తించి, హక్కులు కల్పించింది.
2. ఆర్వోఎఫ్ ఆర్ రైతులు తమ భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సీఎం రేవంత్ రెడ్డి జనవరి 10న జరిగిన సమావేశంలో RoFR భూములు కలిగి ఉన్న ST రైతులకు సోలార్ పంపుసెట్ల ఆధారిత నీటిపారుదలని అందించడంపై చర్యలకు ఆదేశించారు. ప్రత్యేక పథకం కింద 100% గ్రాంట్‌తో బిందు సేద్యం & ఉద్యానవన తోటల పెంపకం.
3. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గిరిజన కుటుంబాల జీవనోపాధి, ఆదాయాన్ని పెంపొందించడానికి “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని రూపొందించింది.
4. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ భూములకు నీటిపారుదల సౌకర్యాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది.
5. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ భూముల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా “ఇందిర సౌర గిరి జల వికాసం” అనే పథకానికి శ్రీకారం చుట్టింది.
6. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మే 19న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ప్రారంభించారు, ఇది 27 ST ఆర్వోఎఫ్ ఆర్ రైతులకు చెందిన 44.5 ఎకరాల ఆర్వోఎఫ్ ఆర్ భూమికి సంబంధించింది.
7. ఈ పథకంలో సమగ్ర భూ అభివృద్ధి, ఆఫ్-గ్రిడ్ సోలార్ పంప్ ఇరిగేషన్ వ్యవస్థల సంస్థాపన చర్యలు. బిందు సేద్యంతో ఉద్యానవన తోటల పెంపకం.
8. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం 2025-26 నుండి 2029-30 వరకు 5 ఏళ్ల పాటు అమలవుతోంది. అటవీ, ఇంధనం, ప్రజారోగ్యం, ప్రజారోగ్యం & అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, ఉద్యానవన శాఖల రంగాలలో వారికి చేయూత అందించనున్నారు.
9. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన గిరిజన సమూహాల  కుటుంబాలకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల మంజూరు.
10. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం రూ.1000 కోట్ల సబ్సిడీతో 1 లక్ష మంది ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని నల్లమల డిక్లరేషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆ స్పై నెట్ వర్క్ లో జ్యోతి పాత్రధారా?

  • పాకిస్థాన్ కు ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్న జ్యోతి
  • ఈమధ్య కాలంలో అనేక సార్లు పాక్ సందర్శన
  • అక్కడ పార్టీలు, ఫంక్షన్లలో బిజీ బిజీ
  • భారత రక్షణ రంగ సమాచారం కోసం యత్నాలు
  • పాక్ లో నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో కీలక పాత్ర
  • కేక్ డెలివరీ బోయ్ తో వీడియో.. ఫోటో
  • తాజా సాక్ష్యంతో బిగుస్తున్న ఉచ్చు
  • పూరీని కూడా సందర్శించిన జ్యోతి
  • ఆలయాల సమాచారం, ఫోటోలు షేర్ చేస్తోందా?
  • ఇప్పటికే కొంత సమాచారం ఇచ్చిన జ్యోతి
  • ఆపరేషన్ సిందూర్ గురించి ఉప్పందించిన జ్యోతి

యుద్ధరీతులు మారిపోతున్నాయి. ఆయుధాలతో యుద్ధం చేయడం ఓల్డ్ స్ట్రాటజీ.ఇప్పుడు స్పైయింగ్ వార్ మొదలైంది. మైండ్ గేమ్ వార్ షురూ అయింది. ఆ కోవలోకే వస్తుంది జ్యోతీ మల్హోత్రా కేసు. నేటి తరహా యుద్ధరీతుల్లో ఒకటైన ఈ పద్ధతిలో తమకనుకూలంగా పాజిటివ్ కథనాలతో ప్రజల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవడం ద్వారా శతృవును దెబ్బ కొట్టడం ఒక పద్ధతి. యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా పాకిస్థాన్ అనుకూల కథనాలు సృష్టించుకోడానికి ఆ దేశానికి ఇక్కడ మూడ్ ని బట్టి కొన్ని ఐడియాలు, కథనాలు ఇచ్చిందని అర్ధమవుతోంది.యూట్యూబర్లు, ఇన్‌ ఫ్లుయెన్సర్లను పాక్ ఆర్మీ ఇలాగే ముగ్గులోకి దించి ఆయుధంగా వాడుకుంటోందని స్పష్టమవుతోంది.

జ్యోతి ఏం చేసింది?

ట్రావెల్ వ్లోగర్ అయిన జ్యోతిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు తమకి సమాచారమిచ్చే అక్షయ పాత్రలా తయారు చేసుకున్నారు. భారత, పాకిస్థాన్ ల మధ్య ఇటీవల కాలంలో రేగిన ఉద్రిక్తతలు, ఘర్షణలపై కీలక సమాచారం జ్యోతి పాక్ ఐఎస్ ఐ అధికార్లకు ఎప్పటికప్పుడు చేరవేసింది.అయితే అదృష్టమేమంటే రక్షణ పరమైన కీలక సమాచారమేదీ ఆమెకు నేరుగా యాక్సిస్ లేకపోవడం.పాకిస్థాన్ ఐఎస్ ఐ సోషల్మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్లను వాడుకుని తమకు అనుకూలమైన కథనాలను సృష్టించి ప్రజలకు వదులుతున్నారని మన దర్యాప్తు బృందాలు అంచనా వేస్తున్నాయి. మల్హోత్రా ఇందులో ఒక పావు మాత్రమే. భారత, పాకిస్థాన్ యుద్ధం సమయంలో కూడా ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్ లో ఉన్నట్లు తేలింది. మే 6న ఆపరేషన్ సిందూర్ కు ఒక రోజు ముందు ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ హై కమిషన్ సిబ్బందిలో ఒకరైన డానిష్‌ను కలిసిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

దాడికి మూడు నెలల ముందు పెహల్గాంకు

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం జ్యోతి ఈమధ్య కాలంలో అనేక సార్లు స్పాన్సర్డ్ ట్రిప్పులకు వెళ్లింది.పెహల్గాం దాడులకు ముందు వరకూ జ్యోతి చాలాసార్లు పాకిస్థాన్ వెళ్లినట్లు సాక్ష్యాలున్నాయి. గూఢచర్యంలో ఇది లేటెస్ట్ ట్రెండ్.. అందుకే పోలీసులు ఇప్పుడు జ్యోతి బ్యాంకు లావాదేవీలపైనా, ఆమె యూ ట్యూబర్ పేరుతో వినియోగించిన పరికరాలపైనా దృష్టిపెట్టారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఈ గూఢచర్యం వివరాలు బయటకొస్తాయి. బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత ఆమె ఆర్థిక స్థితి, ఎన్నిసార్లు పాక్ ప్రయాణించింది, మొత్తం ఆదాయం ఎంత అన్నది అర్ధమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిపిన దర్యాప్తు ప్రకారం ఉగ్రదాడికి మూడు నెలల ముందు ఆమె పెహల్గాం సందర్శించింది.

పాకిస్థానీ హై కమిషన్ ఉద్యోగి డానిష్‌ ఈ ఏడాది జనవరిలో పెహల్గాం సందర్శించాడు. డానిష్‌ వలపు వల విసిరి ఆమెను ట్రాప్ చేశాడని, వీరిద్దరూ ఒకేసారి పెహల్గాం వెళ్లడం కాకతాళీయమా? లేక పథకమా అన్నది తేలాల్సి ఉందని అధికారులు అంటున్నారు.మన వ్యతిరేక దేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ లను పదే పదే ఎవరైనా సందర్శిస్తుంటే వారిపైనా వారి కదలికలపైనా సాధారణంగా ఇంటెలిజెన్స్ సర్వీసులు నిఘా పెడతాయి.

కేక్ డెలివరీ బోయ్ తో జ్యోతి!!

మరోవైపు పాకిస్థాన్ ఐఎస్ ఐతో జ్యోతికి సంబంధాలున్నాయనడానికి రోజుకొక ఆధారం బయటపడుతోంది. పాకిస్థానీ పౌరుడు డానిష్‌ తో ఆమె నిరంతర సన్నిహిత సంబంధాలు మరిన్నివెలుగులోకి వచ్చాయి.పెహల్గాం దాడిలో 26 మంది అమాయకులు మరణించిన రెండు రోజుల తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కు కేక్ డెలివరీ చేసిన ఒక బోయ్ తో ఆమె ఓ ఫోటో లో కనిపించింది.ఆ కేక్ డెలివరీ చేసిన వ్యక్తిని ఈమధ్యే అరెస్టు చేశారు.అదీకాక పాకిస్థాన్ వెళ్లినప్పుడు జ్యోతి అక్కడ ఒక పార్టీలో పాల్గొంది. అందులో ఒక వీడియోను కూడా రికార్డు చేసింది. ఆ వీడియోలో ఈ కేక్ డెలివరీ బోయ్ తో ఆమె మంతనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బోయ్ ని అక్కడే ఉన్న విలేకరులు కేక్ దేనికి తెచ్చారు? సంబరాలు చేసుకోడానికి కారణమేంటి అని అడగ్గా అతను సమాధానమిచ్చేందుకు నిరాకరిస్తూ వెంటనే అక్కడనుంచి తప్పుకున్నాడు.

ఆలయాలు టార్గట్ చేశారా?

ఇదిలా ఉంటే జ్యోతీ మల్హోత్రా 2024లో పూరి జగన్నాథ్ ఆలయం కూడా సందర్శించింది.అక్కడ ఆమె స్థానిక తీర ప్రాంత పట్టణానికి చెందిన మరో యూ ట్యూబర్ ను కలిసిందని పూరీకి చెందిన వినీత్ అగర్వాల్ అనే పోలీసు అధికారి చెబుతున్నారు. పూరీకి చెందిన ఈ మహిళ కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా ను కూడా సందర్శించింది. మన దేశంపై గూఢచర్యం చేసినందుకు మల్హోత్రాతో సహా అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.మనం చేపట్టబోయే ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్థాన్ ఐఎస్ ఐకి ఈమె ముందుగానే సమాచారం అందించిందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు.మన ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలు, ఎయిర్ బేస్ ల గురించి కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ ఐకి అందించారన్న కారణంగా పంజాబ్ కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

ఈ గూఢచర్యం నెట్ వర్క్ అంతా ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారి ఆధ్వర్యంలో నడిచింది.ఈనెల 13న అతడిని మనదేశం బహిష్కరించింది.నిన్న ఇదే నెట్ వర్క్ కు చెందిన మరో యూపీ వాణిజ్యవేత్తను అరెస్టు చేశారు.స్మగ్లింగ్,గూఢచర్యం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై షాజాద్ ను మొరాదాబాద్ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఇదే స్పై నెట్ వర్క్ కు చెందిన వాడా కాదా అన్నది తేలాల్సి ఉంది.

కలిసి చదివారు… కలిసే బ్లాస్టులు ప్లాన్ చేస్తున్నారు

హైదరాబాద్‌‌లో పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విజయనగరంలో ఉగ్రమూలాలు ఉండటం కలకలం రేపుతోంది. నిందితులు సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్‌, సమీర్‌తోపాటు టీమ్‌లో మహారాష్ట్ర యువకులు ఉన్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు టీంలో ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. నిందితులు ఆరుగురు గ్యాంగ్‌ హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్నారు. ఐసిస్‌ (ISIS) హ్యాండ్లర్‌ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై సమావేశమై చర్చించేవారు.

టిఫిన్‌ బాక్స్‌ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు సైతం వచ్చాయని గుర్తించారు. ఆ గ్రూపులోని మిగతా నలుగురికి బాంబ్‌లు పెట్టే ప్రాంతాల గుర్తింపును టార్గెట్‌ ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తమకు ఆదేశాలు రావడంతో  వాటి తయారీ కోసం టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు సిరాజ్‌. ఈ క్రమంలో విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్‌లో సమీర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం కోర్టు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సిరాజ్ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్ సీజ్ చేసినట్లు తెలిపారు.

ఎన్ఐఏ అధికారులు ఈ కేసు వివరాల కోసం విజయనగరం టూ టైన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కేసు విచారణలో వారికి లభ్యమైన ఆధారాలు, వివరాలను ఎన్ఐఏ అధికారులు విజయనగరం పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాదు బోయగూడలో ఉండే సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ అనే యువకులు 2018లో హైదరాబాద్ సిటీలో కలిసి చదివారు. ఈ క్రమంలో వారు  తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. వీరు “ఆల్ హింద్ ఇత్తయ్ హాదుల్ ముస్లిమీన్” అనే సంస్థను నడుపుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయని గుర్తించారు.

పహల్గాంలో ఉగ్రదాడి తరువాత దేశంలో పలుచోట్ల ఉగ్ర కదలికలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అనే హర్యానాకు చెందిన ఫేమస్ యూట్యూబర్ అరెస్ట్ అయింది. ఆమె పలుమార్లు పాకిస్తాన్ వెళ్లి హైకమిషన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. దాడులకు ముందు పహాల్గాంలోనూ జ్యోతి వీడియోలు చేసి పోస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉగ్ర కదలికలపై నిఘాపెట్టిన పోలీసులు పాక్ ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులకు సమాచారం చేరవేస్తున్న వారిపై చర్యలు చేపట్టారు.

శరణార్థులకు ఆశ్రయంపై సంచలన తీర్పు

శరణార్థులకు ఆశ్రయంపై సోమవారం(మే19) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత్‌ ధర్మశాల కాదు.. వివిధ దేశాల శరణార్థులకు భారత్‌ ఆశ్రయం ఇవ్వలేదు.. తక్షణం శరణార్థులు దేశాన్ని వీడాలి అంటూ.. సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్‌ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వగల ధర్మశాల కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా? మనం 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము. ఇది మనం అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులకు వినోదం అందించగల ధర్మశాల కాదు” అని ధర్మాసనం అధ్యక్షత వహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. యుఎపిఎ కేసులో విధించిన 7 సంవత్సరాల జైలు శిక్ష ముగిసిన వెంటనే పిటిషనర్ భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారిస్తోంది.

పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు మాట్లాడుతూ.. తను శ్రీలంక తమిళుడనని, వీసాపై ఇక్కడికి వచ్చాడని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. పిటిషనర్ దాదాపు మూడు సంవత్సరాలుగా ఎటువంటి బహిష్కరణ ప్రక్రియ లేకుండా నిర్బంధంలో ఉన్నారని ఆయన తెలిపారు.”ఇక్కడ స్థిరపడటానికి మీకు ఏ హక్కు ఉంది?” అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. పిటిషనర్ ఒక శరణార్థి అని, అతని భార్య, పిల్లలు భారతదేశంలో స్థిరపడ్డారని న్యాయవాది పునరుద్ఘాటించారు.

ఆర్టికల్ 21 ఉల్లంఘన జరగలేదని జస్టిస్ దత్తా అన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో స్థిరపడే ప్రాథమిక హక్కు పౌరులకు మాత్రమే అందుబాటులో ఉందని జస్టిస్ దత్తా తెలిపారు. పిటిషనర్ తన దేశంలో ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటున్నాడని న్యాయవాది చెప్పినప్పుడు, జస్టిస్ దత్తా స్పందిస్తూ “వేరే దేశానికి వెళ్లిపో” అన్నారు. ఇటీవల, రోహింగ్యా శరణార్థుల బహిష్కరణలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2015లో పిటిషనర్‌ను, మరో ఇద్దరితో పాటు, LTTE కార్యకర్త అనే అనుమానంతో Q బ్రాంచ్ అరెస్టు చేసింది. 2018లో, UAPA సెక్షన్ 10 కింద నేరానికి ట్రయల్ కోర్టు పిటిషనర్‌ను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2022లో, మద్రాస్ హైకోర్టు అతని శిక్షను 7 సంవత్సరాలకు తగ్గించింది.. తన శిక్ష తర్వాత వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని.. అతను భారతదేశం విడిచి వెళ్లే వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది.

2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్‌టిటిఇ మాజీ సభ్యుడిగా పోరాడినందున, తనను శ్రీలంకలో బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారని పిటిషనర్ అన్నారు. అందువల్ల, తనను అక్కడికి తిరిగి పంపితే, అరెస్టు చేసి హింసిస్తారన్నారు. తన భార్య అనేక వ్యాధులతో బాధపడుతోందని, తన కుమారుడు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నాడని కూడా ఆయన అన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు ఆర్‌.సుధాకరన్‌, ఎస్‌.ప్రబు రామసుబ్రమణియన్‌, ఏఎస్‌ఏఓఆర్‌ వైరవన్‌ వాదించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com