25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img
Home Blog Page 2

లిక్కర్‌ కేసు విషయంలో మంత్రులెవరు నోరు విప్పద్దు

  • స్వతంత్ర సంస్ధలు విచారణ చేస్తున్నాయి…
  • తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
  • ప్రధాని మోడీ పర్యటనపై దృష్టి పెట్టండి
  • యోగాడేలో 5లక్షల మంది పాల్గొనేలా ప్లాన్‌ చెయ్యండి

మద్యం కుంభకోణానికి సంబంధించి మంత్రలు ఎవరూ తొందరపడి బయట ఎటువంటి కామెంట్లు చేయద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ సచివాలంయలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అయ్యింది. ఈ సందర్భంగా చంద్రబాబు లిక్కర్‌ స్కామ్‌ కేసు, అరెస్టులపై క్యాబినేట్‌ లో సుదీర్ఘంగా చర్చించారు. లిక్కర్‌ విషయంలో మంత్రులు ఆచితూచి స్పందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన స్వతంత్ర సంస్ధలు లిక్కర్‌ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నాయని, విచారణ పారదర్శకంగా జరుగుతోందని చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఈ వ్యవహారంలో డీటైల్డ్‌ విచారణ జరుగుతోందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టబద్ద పాలన ఉంటుందని, తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్యాబినేట్‌ సమావేశంలో స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మంగళవారం జరిగిన క్యాబినేట్‌ సమావేశానికి డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా హాజరై లిక్కర్‌ స్కామ్‌ లో జరుగుతున్న విచారణ, అరెస్టులు, తదుపరి తీసుకోబోయే చర్యలను మంత్రులు అందరికీ వివరించారు. ఇక ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలని సీయం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. వచ్చే నెల రోజుల పాటు మంత్రులందరూ ప్రధాని పర్యటన సక్సెస్‌ చెయ్యడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూన్‌ 19, 20వ తేదీల్లో రెండు రోజుల పాటు యోగ రిహార్సిల్స్‌ ఉంటాయని తెలిపారు. జూన్‌ 21న విశాఖలో ప్రధాని పాల్గొనే వరల్డ్‌ యోగా డే కార్యక్రమానికి ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్లాన్‌ చేయాలన్నా్రు. త్వరలో సంక్షేమ పథకాల క్యాలండర్‌ విడుదల చేద్దామని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని వీటిపై మంత్రులు ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, కేంద్ర ప్రాజెక్టులు ఇలా అనేక మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని, వీటి ఫలితాలు త్వరలోనే వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినేట్‌ కు వివరించారు.

కేన్స్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వయ్యారాలు

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ సినీనటి, మోడల్. మోడలింగ్, సినిమాలు, మ్యూజిక్ అల్బమ్స్ తో తీరిక లేకుండా ఉండే ఈ సుందరాంగి ఫోటోలకు సోషల్ మీడియాలో భలే క్రేజ్ ఉంది. కేన్స్ లో సందడి చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 1985లో బహ్రేయిన్ లో జన్మించింది

తండ్రి శ్రీలంక జాతీయుడు కాగా తల్లి మలేషియా దేశస్థురాలు

సిడ్నీలో మాస్ కమ్యూనికేషన్ చేసిన ఈ వయ్యారి భామ… మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది

2009లో భారతదేశంలో అల్లాద్దీన్ ఫాంటసీ డ్రామా చేసిన జాక్వెలిన్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది.

2011లో మర్డర్2 ద్వారా మొదటి సక్సెస్ అందుకున్న ఈ భామకు ఆ సినిమాతో గ్లామరస్ పాత్రలే అధికంగా వచ్చాయి.

హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలతో పాపులర్ హీరోయిన్ గా మారింది.

సెక్సీ గాల్ జాక్వెలిన్ 2020లో చేసిన జెండాఫూల్ మ్యూజిక్ అల్బమ్ భారతదేశంలో అత్యధిక మంది యూట్యూబ్ లో వీక్షించిన పాటగా నిలిచింది.

2021లో మనీ లాండరింగ్ కేసుతో సినిమాల కన్నా ఎక్కువ పాపులారిటీ వచ్చింది

ప్రస్తుతం హౌస్ ఫుల్ 5, వెల్ కమ్ టు ద జంగల్ సినిమాల చిత్రీకరణలో ఈ సుందరి బిజీగా ఉంది

courtesy : instagram

తెలుగులో ఇరగదీసిన మిస్‌ జర్మనీ సిల్వీ

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా.. తెలంగాణకు వచ్చిన మిస్ వరల్డ్ జర్మనీ ప్రతినిధి సిల్వీ తెలుగులో ఇరగదీశారు. తనకు తెలుగుభాషపై ఉన్న అభిమానం, భారత సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. భాస్కరా న్యూస్ కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూను తెలుగుతోనే ప్రారంభించారు. “నమస్కారం”, “ఎలానారూ” వంటి తెలుగు మాటలు పలకడం‌తో పాటు, అల్లు అర్జున్ నటించిన “బుట్ట బొమ్మ” పాటను కూడా గుర్తు చేస్తూ పొలిటెంట్‌ మీడియా ప్రతినిధినే ఆశ్చర్యపోయేలా చేశారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15 భాషలు నేర్చుకున్నానని, భారతీయ భాషలంటే తనకెంతో ఇష్టమని, అందులో తెలుగు కూడా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. భారత సంస్కృతి, ఆహారం, సినిమాలు అన్నీ కూడా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపిక పదుకొణే వంటి నటుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇంతకు ముందు ఢిల్లీ, తాజ్‌మహల్, రాజస్థాన్, ముంబయి వంటి ప్రాంతాలను సందర్శించానని, బాలీవుడ్‌లో ఒక సంవత్సరం పనిచేయాలన్న కోరిక తనకు ఉందని అన్నారు. ఉర్దూ, హిందీ భాషలపైనా తన మక్కువను తెలియజేశారు. “భారత్ చాలా అందమైన దేశం” అంటూ మిస్‌ జర్మనీ సిల్వీ ప్రశంసించారు.

హైదరాబాద్‌లో మరో ఫైర్‌ యాక్సిడెంట్‌ – బోయగూడలో భవనంలో మంటలుమంటలు

గతంలో ఎన్నడూ లేని విధంగా చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌ హౌజ్‌లో అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మరణించిన ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అయితే, ఆ ప్రమాదం ఇంకా మదిలో మెదులుతుండగానే.. హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో, నగర వాసులు భయాందోళనకు గురయ్యారు.

ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలోని బోయగూడలో ఉన్న రెండంతస్తుల భవనంలో మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.బోయగూడలోని ఒక రెండంతస్తుల భవనం రెండో అంతస్తులో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు, చుట్టుపక్కల వారు భయంతో వెంటనే బయటకు పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఛత్రినాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము నడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇంజనీరింగ్‌ ఫీజును బీట్‌ చేస్తున్న ఎల్‌కేజీ ఫీజులు

నేటి టెక్నాలజీ యుగంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు మోయలేని భారంగా మారుతున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివించాలంటేనే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు రూ.40 వేల నుంచి మొదలవుతున్నాయి. కానీ, అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో చదివించాలంటే మాత్రం ప్రీ ప్రైమరీకే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఎల్‌కేజీకి డొనేషన్‌ రూపంలో లక్ష రూపాయలు, వార్షిక ఫీజు రూ.1.6లక్షలు వసూలు చేస్తున్నారు. ఇక, మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో చూస్తే.. ఎల్‌కేజీ స్టూడెంట్‌ ఫీజే రూ.4 లక్షలుగా ఉంది. ఫస్ట్‌క్లాస్‌ ఫీజు రూ.6లక్షలు వసూలు చేస్తున్నారు.

హిమాయత్‌నగర్‌లోని మరో స్కూల్‌ చూస్తే.. డొనేషన్‌ రూ.60వేల నుంచి మొదలవుతుంది. వార్షిక ఫీజులు చూస్తే.. రూ.1.5లక్షల నుంచి మొదలవుతున్నాయి. వార్షిక ట్యూషన్‌ ఫీజులకు తోడు.. అడ్మిషన్‌ ఫీజు, స్పెషల్‌ ఫీజు, స్పోర్ట్స్‌ ఫీజు, కంప్యూటర్‌ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్‌ ఫీజు, ల్యాబ్‌ ఫీజుల పేరుతో అదనంగా వసూలు చేస్ఉతున్నాయి. డొనేషన్‌ వసూలు చేయకూడదని నిబంధనలు ఉన్నా.. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయ. ఇక, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా వాళ్లకు వరంగా మారుతోంది.

ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఫీజుల వసూలు, క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల అర్హతల వంటి వాటాఇపై సరైన నియంత్రణ లేకుండా పోతోంది. ఫలితంగా ప్రతియేటా 20 నుంచి 50శాతం వరకు ఫీజులు పెంచుతున్నారు. చిన్న స్కూల్స్‌ అయినా సరే.. కార్పొరేట్‌ పాఠశాలలను చూసి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక, ఐఐటీ ఒలంపియాడ్‌, టెక్నో, కాన్సెప్ట్‌ వంటి తోకలు పెట్టుకొని నడిపిస్తున్న స్కూళ్లు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాలలకు ఇలాంటి పేర్లు తగిలించ వద్దని ఉన్నా.. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం పిల్లల తల్లిదండ్రుల పాలిట శాపంగా మారతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేల ప్రైవేట్ స్కూల్స్‌ ఉండగా.. 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫీజుల నియంత్రణ కోసం విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు గడిచిన పలు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 2017లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణపై నివేదిక సమర్పించినప్పటికీ, అప్పటి ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది.

తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. కొన్ని సంఘాల ప్రతినిధులు ఏటా 15 శాతం వరకు ఫీజు పెంపు అనుమతించాలన్నదే తమ అభిప్రాయమని తెలిపారు. దానికంటే ఎక్కువ పెంచితే ఫీజు రెగ్యులేటరీ కమిటీకి రిపోర్ట్ చేయాలనిచెప్పారు. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, చిన్న స్కూళ్లను మాత్రం ఇబ్బందులకు గురిచేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుందని స్కూల్ యాజమాన్యాలు వెల్లడించాయి.

ముంబైలో ఇద్దరు మృతి… కరోనాతో చనిపోయారంటూ ప్రచారం

ముంబైలో కరోనా భయం అలుముకుంది. ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే, వాళ్లు కరోనాతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మళ్లీ కొవిడ్‌ వ్యాపిస్తోందంటూ ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రచారం ప్రజల్లో భయాలు రెచ్చగొడుతుండటంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ – బీఎంసీ రెస్పాండ్‌ అయ్యింది. ప్రజలెవరూ భయపడొద్దని, కరోనా మరణాలంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేల్చి చెప్పింది.

ముంబైలోని సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. అయితే, వాళ్లిద్దరి మరణాలకు కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. హైపోకాల్సెమిక్ మూర్ఛలతో పాటు నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య కారణాలతోనే వారు మరణించారని అధికారులు వెల్లడించారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ముంబైలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచించింది.

కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నగరంలో కొవిడ్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని, మే నెల నుంచి కొద్దిగా పెరుగుదల కనిపించిందని తెలిపారు. అయినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 20 ఐసీయూ పడకలు, పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం 20 పడకలు, 60 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

కీరవాణికి వీరమల్లు సన్మానం

మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది.


ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి.

తెలుగు కథలను ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు… చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే… కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు.

మాజీ ఐఏఎస్‌ నుంచి మూడున్నర కోట్లు కొట్టేసిన సైబర్‌ క్రిమినల్స్‌

సైబర్ మోసాలపై ఎంతగా చైతన్యం కలిగిస్తున్నా, ఏ స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ప్రజల్లో అప్రమత్తత చాలా మందిలో కనిపించడం లేదు. నిత్యం కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్లు ఇప్పుడు కేవలం అమాయకులు, నిరక్షరాస్యులనే కాదు.. ఉన్నత విద్యావంతులు, ప్రముఖుల్నీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదులో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఓ మాజీ ఐఏఎస్ అధికారి సైబర్ నేరగాడి మాయలో పడి ఏకంగా రూ.3.37 కోట్లు నష్ట పోయారు.

72 ఏళ్ల వయసున్న ఈ మాజీ అధికారి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. ప్రస్తుతం సోమాజీగూడలో నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెల్‌ఫోన్‌కు ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ పేరిట ఓ లింక్ వచ్చింది. ఆయనకు షేర్ మార్కెట్ మీద ఆసక్తి ఉండటంతో ఆ లింక్ ఓపెన్ చేసి, అక్కడ ఉన్న సమాచారాన్ని ఫాలో అయ్యారు. దీంతో ఒక వ్యక్తి, తాను ప్రముఖ కంపెనీకి చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ని అని పరిచయం చేసుకున్నాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ట్రేడింగ్ చేసి, మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే 120% నుంచి 160% వరకు లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఈ మాటలతో ఆకర్షితుడైన ఆ మాజీ అధికారి, రోజు మూడుసార్లు వచ్చే వాట్సప్ వీడియో కాల్స్‌లో స్టాక్ మార్కెట్ విషయాల్లో సలహాలు తీసుకుంటూ, మాయగాడిని నమ్మడం మొదలుపెట్టారు. నమ్మకాన్ని పెంపొందించేందుకు మొదట్లో అతను రూ.5,000 నుంచి రూ.10,000 వరకూ బోనస్‌లుగా పంపిస్తూ మరింత నమ్మకం కలిగించాడు.

ఆ తరువాత అసలు దందాకు తెరలేపాడు. మార్చి 30 నుంచి మే 13 వరకూ ఏకంగా రూ.3.37 కోట్లను విడతలవారీగా పలుచోట్ల ఖాతాల్లో జమ చేయించాడు. ఆ మొత్తం పెట్టుబడికి వర్చువల్ అకౌంట్‌లో రూ.22.35 కోట్లు లాభమొచ్చిందని చూపించాడు. లాభాలు వచ్చాయని భావించిన మాజీ అధికారి వాటిని విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో, తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్‌ – భారం మోయలేకపోతున్న పేరెంట్స్‌

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయాలన్న డిమాండ్ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఎప్ సెట్‌ ర్యాంకులు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి, కాలేజీలు ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముందస్తుగా సీటు రిజర్వు పేరుతో మొత్తం ఫీజులో 30 నుంచి 50 శాతం డబ్బు తీసుకుంటూ, తరువాత నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత మిగతా మొత్తం వసూలు చేసే ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రభుత్వం బీ–కేటగిరి సీట్లు భర్తీ చేస్తే, పేరెంట్స్‌ ముందుగా చెల్లించిన డబ్బులు తిరిగి రావడం కష్టమేనన్న భయం ఉంది. ఈ కారణంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా నిబంధనల్ని విస్మరించి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సీట్లు కేటాయిస్తున్న ప్రైవేట్‌ కాలేజీల వ్యవహారాన్ని ఆపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వ అనుమతిలేక అడుగులు వెనక్కి వేస్తున్నారని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న 157 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో దాదాపు లక్ష సీట్లు ఉండగా, వాటిలో 70 శాతం సీట్లు ఎప్‌సెట్‌ ర్యాంకుల ద్వారా నింపుతారు. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటాకింద, అందులో కొంత ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు. ఎప్‌సెట్‌ ద్వారా భర్తీ చేసే సీట్లకు నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌ జరుగుతుంటే, మేనేజ్‌మెంట్ కోటాలో మాత్రం కాలేజీలకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వ్యవహారం సాగుతోంది.

బీ కేటగిరి సీట్లను కూడా ఎప్‌సెట్‌, జేఈఈ ర్యాంకులు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలన్న నిబంధనలు ఉన్నా, వాటిని పాటిస్తున్న కాలేజీలు చాలా తక్కువ. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ వంటి బ్రాంచ్‌లకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పేరెంట్స్‌ కొన్నేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని ప్రభుత్వమే నిర్వహించాలని స్టూడెంట్ యూనియన్లు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది హయ్యర్‌ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌ ఈ విషయంలో ముందడుగు వేసి, బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమన్న లేఖను ప్రభుత్వానికి ఇచ్చినా, ప్రభుత్వం స్పందించలేదని చెబుతున్నారు.

ఈ ఏడాది బీటెక్ ఫీజుల్లో మార్పులు కూడా రానున్న నేపథ్యంలో, ఇప్పటికైనా అడ్మిషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో నింపితే, అక్రమ దందాలకు చెక్ పడుతుందన్న నమ్మకంతో పేరెంట్స్‌ ఎదురు చూస్తున్నారు.

వాట్సప్‌లో ఇమేజ్‌ వచ్చిందా? జాగ్రత్త!

ఇప్పుడు మొబైల్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సప్‌ కచ్చితంగా ఉంటోంది. విద్యార్థుల నుంచి మొదలుకొని ఉద్యోగులు, వ్యాపారులు, మహిళల దాకా చాటింగ్, సమాచారం షేర్‌ చేసుకునేందుకు వాట్సప్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కుటుంబం, మిత్రులు, సహచరులు అందరూ కనెక్ట్ అయ్యే వేదికగా మారిన ఈ యాప్‌లో ఇప్పుడు కొత్త రకం మోసాల బూచి బయలుదేరింది.

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త టెక్నిక్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో తాజాగా బయటపడ్డ మోసం అందరినీ భయపెడుతోంది. అయితే, దీని గురించి అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాట్పప్‌లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఒక ఫోటో వస్తోంది. ఇది సాధారణ ఇమేజ్‌లా కనిపించినా, బైనరీ కోడ్‌తో తయారుచేస్తున్నారు. ఈ ఇమేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే మాల్వేర్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంది. ఆ మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ కాగానే.. వాట్సప్‌ యూజర్‌ అకౌంట్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి డేటా నేరుగా సైబర్‌ క్రిమినల్స్‌కు చేరిపోతుంది. కాబట్టి గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఇమేజ్ మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దని, వెంటనే డిలీట్‌ చేయాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే ఏపీకే ఫైల్‌ల రూపంలో వచ్చే మెసేజ్‌లు కూడా అకౌంట్లను ఖాళీ చేసే ప్రమాదం ఉంటుందని, మొబైల్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యే అవకాశమూ ఉంటుందని అలర్ట్‌ చేస్తున్నారు. దీంతో, ఓటీపీ వంటి సెన్సిటివ్ సమాచారం కూడా హ్యాక్ చేయబడే ప్రమాదం ఉందంటున్నారు.

వాట్సప్ యూజర్ల సేఫ్టీ సెక్యూరిటీ కోసం పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా, అవగాహన లేకుండా ఉన్నవారు మాత్రం మోసపోతూనే ఉన్నారు. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చిన లింకులు, వీడియోలు, ఫోటోలను తక్షణమే ఓపెన్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు తెలిసిన గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్‌లు ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటిని అవగాహన లేకుండా ఓపెన్ చేస్తే ప్రమాదం తప్పదంటున్నారు.

ఈ నేపథ్యంలో వాట్సప్‌ను సురక్షితంగా ఉపయోగించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రెస్పాండ్‌ కావొద్దని చెబుతున్నారు. గ్రూపుల్లో వచ్చే సస్పెక్టెడ్‌ కంటెంట్‌ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే, మన మొబైల్‌లోని ఇన్ఫర్మేషన్‌ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com