35.2 C
Hyderabad
Thursday, May 21, 2026

Live Video

spot_img
Home Blog Page 466

ఢిల్లీలో తెలంగాణ అగ్రనేతలు

తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి.ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం ఢిల్లీ వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంతరెడ్డిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి సోమవారమే ఢిల్లీ చేరుకున్న కేటీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహరలాల్ ఖట్టర్ ని కలసి అమృత్ పథకంలో భారీ స్కాం జరిగిందని రేవంతరెడ్డిపై ఫిర్యాదు చేసారు.తన బావమరిది సృజనరెడ్డికి వందల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చారని తెలంగాణ సీఎం పై కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేసారు. మరోపక్క ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సైతం మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అధిష్టానంతో చర్చించడానికి తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్లడంతో టీ కాంగ్రెస్ నేతల్లో అలజడి నెలకొంది. పనిలోపనిగా మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉండటంతో ఆశావహులు అందరూ ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ అగ్రనేతలు ఇద్దరు ఢిల్లీలో ఉండగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా హస్తిన చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏసీబీ విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనపై రాజకీయవర్గల్లో ఉత్కంఠ నెలకొంది.

నేను ఢిల్లీ వస్తే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ భయపడుతోంది

తాను ఢిల్లీ వస్తే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉలిక్కి పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వస్తే తమకేం పని అని సాక్షాత్తూ మంత్రులే ప్రశ్నించడమేంటన్నారు. అసలు వాళ్లకు భయమెందుకు అవుతోందని సందేహం వ్యక్తం చేశారు. హస్తినకు వచ్చి జాతీయ మీడియా ముందు, జాతీయ పార్టీల ముందు కాంగ్రెస్‌ పార్టీ అవినీతిని ఎండగడతామన్నారు. మంత్రి పొంగులేటి తాలూకు కంపెనీ పొందిన అవినీతి టెండర్ల పైనా ఢిల్లీకి వచ్చి భరతం పడతామన్నారు. స్వయంగా క్యాబినెట్లో కూర్చొని తమ సొంత కంపెనీకి టెండర్లు ఇచ్చిన పొంగులేటి పదవి కూడా కచ్చితంగా పోతుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు.

ఇక, తెలంగాణలో జరిగిన అమృత్‌ టెండర్ల స్కాం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై స్పందించాలని కోరారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల కుటుంబ సభ్యులకు టెండర్లు ఇచ్చారన్నారు. అమృత్ టెండర్లపై సోమవారం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యాక సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని కట్టర్‌ బదులిచ్చారన్నారు. తెలంగాణలో అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లోల తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

వికారాబాద్‌ జిల్లా లగచర్ల అంశంపైనా కేటీఆర్‌ స్పందించారు. బెదిరింపులతో, అరెస్టులతో రైతులను భయపెట్టలేరని కేటీఆర్‌ హెచ్చరించారు. ఫార్మా కోసం లాఠీ చార్జీలు చేసి ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి కొడంగల్ ప్రజలను జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్వించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డగోలు విధానాలపై, ధన దాహంపై కొడంగల్ ప్రజలు చేసిన తిరుగుబాటు చూశామన్న కేటీఆర్‌.. పోలీస్ రక్షణ లేకుండా ముఖ్యమంత్రి సొంత ఇలాకా కొడంగల్ పోయే పరిస్ధితి లేదన్నారు. కలెక్టర్ ను కొట్టేపరిస్ధితి తెలంగాణలో, ఏపీలో ఎప్పుడు జరగలేదని, ఒకవైపు కలెక్టర్ తనపై దాడి జరగలేదంటూ స్వయంగా చెబుతున్నప్పుడు కేసులెందుకో, అరెస్టులెందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతర్గత కలహాలకు మోదీ, అమిత్‌షా కుట్ర : సీపీఐ నారాయణ

అంతర్గత కలహాలు సృష్టించడానికి మహారాష్ట్రలో బిజెపి పావులు కదుపుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో మోది అమిత్ షా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ గెలిస్తే జమిలి ఎన్నికలకు వెళ్లాలని మోదీ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. అయితే, జమిలి ఎన్నికలు ఫెడరల్‌ వ్యవస్థకు విరుద్ధమన్నారు. మహారాష్ట్రలో కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తున్నాని, జార్ఖండ్‌లో మాత్రం ఒంటరిగా బరిలో ఉన్నామన్నారు. హైదరాబాద్‌ ముఖ్దుంభవన్‌లో మీడియాతో నారాయణ మాట్లాడారు. తెలంగాణలో కులగణన అవసరమే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఆర్థిక రాజకీయ సమానత్వం కలిగే రీతిలో కులగణన ఉండాలని సూచించారు. ఈ సర్వేలో 75 ప్రశ్నలు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏం తలపెట్టినా లోపాలు వెతుకుతూ రాజకీయం చేస్తూ కులగణను ముందుకు సాగనివ్వడం లేదన్నారు నారాయణ. కొల్లేరు సరస్సును ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిన వ్యక్తి

కరోనా తర్వాత గుండె పోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు బారిన పడుతున్నారు. ఐదేళ్ల పిల్లలు మొదలకుకొని వృద్ధుల వరకు హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో 40,50 సంవత్సరాల పైబడిన వారికే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొన్ని నెలల క్రితం పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థిని గుండె నొప్పి చనిపోయింది. గత సంవత్సరం హైదరాబాద్ లో ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ మృతి చెందాడు.

గతేడాది ఓ వ్యక్తి పెళ్లికి ముందు నిర్వహించే హాల్ది కార్యక్రమంలో పాల్గొన్నాడు. పెళ్లి కుమారుడికి పసుపు పెడుతూనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండె పోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగింది. స్థానిక టెంపుల్ బస్ స్టాప్ దగ్గర హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఓ యువకుడు దేవుడి దర్శనం కోసం గుడి వచ్చిన కన్నుమూశాడు.

తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చింది: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ సంచలనం

KCR: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలల పూర్తయిందని.. ఇప్పుడు ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలుసొచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు.

అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలని అన్నారు. ప్రజలు బాధ్యత ఇస్తే.. అంతే బరువుతో సేవ చేయాలన్నారు కేసీఆర్. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా కేసీఆర్ సమక్షంలో సినీ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మాకు మాటలు రావనుకుంటున్నారా..? ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతాం అని కేసీఆర్ అన్నారు. రౌడీ పంచాయతీలు చేయడం తమకు కూడా తెలుసని చెప్పారు. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యత అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com