28.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img
Home Blog Page 465

మళ్లీ.. ఓవర్ టు ఢిల్లీ.

హస్తిన గుప్పెట్లోకి వెళ్తోన్న తెలుగు నేతలు..అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ కేంద్రానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల ఫిర్యాదు.ఫార్మూలా రేసింగ్ స్కాంకు.. అమృత్ ఎపిసోడుతో చెక్ చెప్పే వ్యూహంలో కేటీఆర్.డ్రగ్స్ కంటైనర్ పై పవన్ విమర్శలను తిప్పికొట్టేలా అమిత్ షాకు బొత్స లేఖ.తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు మళ్లీ ఢిల్లీ చుట్టూ తిరిగే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ పెద్దలపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరిపై అమిత్ షాకు కంప్లైంట్ లెటర్ రాశారు బొత్స. ఇదిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఫార్మూల-10 రేసింగ్ విషయంలో కేటీఆర్ ను చెరసాలకు పంపేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో సడెనుగా కేటీఆర్ ఢిల్లీ బాట పట్టారు. అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని.. అవినీతికి పాల్పడిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. అమృత్ స్కీంలో స్కాంపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు కేటీఆర్. నన్ను అరెస్ట్ చేస్తే.. నీ మీద కేసులు వేయిస్తా.. నేను ఢిల్లీ పెద్దలకి దగ్గర అని చెప్పుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.మరోవైపు విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ వ్యవహరం తేల్చాల్సిందిగా ఇటీవలే పవన్ ట్వీట్ చేశారు. దీని వెనుక వైసీపీ ఉందనే అర్థం వచ్చే రీతిలో విమర్శలు గుప్పించారు పవన్. ఆ డ్రగ్స్ కంటైనర్ వెనుక బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇందులో నిజానిజాలను వెలికి తీయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం ద్వారా పవన్ను.. తద్వారా కూటమిని కార్నర్ చేసేలా బొత్స లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్కుగా మారింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతోందనే చెప్పాలి. దీంతో వెళ్లాలి ఢిల్లీ.. మళ్లీ మళ్లీ. అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.

ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్‌ లేఖ

విభజన సమస్యలపై చర్చించడానికి తమ సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈనెల ఆరవ తేదీన చర్చించుకోవడానికి ప్రజా భవన్‌కి రావాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును ఆ లేఖలో ఆహ్వానించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుందామని సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పది సంవత్సరాల దాటిన ఇంకా విభజన సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని తక్షణం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు లేఖకు జవాబుగా సీఎం రేవంత్ రెడ్డి ఆరవ తేదీన ప్రజాభవన్లో చర్చలకు ఆహ్వానిస్తూ ప్రత్యుత్తరం రాశారు.

రేవంత్‌ పంతానికి పోవొద్దు : డికె అరుణ సలహా

లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పంతానికి పోవద్దని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హితవు పలికారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఈరోజు మీడియా సమావేశం పెట్టిన డీకే అరుణ ప్రజలను మనం గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఏ స్థాయిలో ఉన్నా  మీ నియోజకవర్గ ప్రజలని గ్రామ ప్రజలని ఇబ్బంది పెట్టద్దని డీకే అరుణ కోరారు. సీఎం రేవంత్ సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. దాడులు ముమ్మాటికీ తప్పేనని కానీ ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని డీకే అరుణ చెప్పారు. ఫార్మా కంపెనీ ఏర్పాటును లగచర్లలోనే కాకుండా పక్కనే మరో 5 గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని ఆమె తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తాను రేపు లగచర్లలో పర్యటిస్తారని ప్రయాణించారు. సమన్వయంతో వ్యవహరించి సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని లగచర్ల ప్రజలకు చెప్తానని డీకే అరుణ చెప్పారు.

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

తెలంగాణలో విద్యుత్‌ విభాగం ప్రగతిపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. విద్యుత్‌ శాఖలో తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న మార్పులు, భవిష్యత్‌ పరిణామాల గురించి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల & కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్య మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ ఫరూఖి, ఈ సమావేశానికి హాజరయ్యారు.

అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యుత్ సంబంధిత అంశాలపై చర్చించారు.

 

 

జపాన్‌లో తెలంగాణ బృందం పర్యటన

జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో లోని మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర శాసన బృందంతో పాటు సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా నివాళులర్పించారు. ఆస్ట్రేలియా లోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం స్టడీ టూర్ లలో భాగంగా తెలంగాణ శాసన బృందం న్యూజిలాండ్‌లో పర్యటించి అనంతరం జపాన్ చేరుకుంది.

తెలంగాణ నటులకు ప్రోత్సాహం : కోమటిరెడ్డి

టికెట్ల ధరల పెంచమంటూ సినిమా నిర్మాతలు కలవాలనుకుంటే వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వబోమని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారానికి కోమటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చి పది నెలలే అయిందని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని ఈ కాలంలో కళాకారులు అందరికీ సేవ చేసుకుంటామని తెలిపారు. సినీ పరిశ్రమంలో కుటుంబంలో ఆరుగురు హీరోలు ఉన్నారు ఆ బ్రాండ్ మీద వాళ్ల సినిమాలు నడుస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళందర్నీ కూడా సపోర్ట్ చేయాలన్నారు. తెలంగాణ హీరో హీరోయిన్స్ నటీనటులను ప్రోత్సహించాలని కోరారు.

కూటమిది గ్రాఫిక్స్‌ బడ్జెట్‌ : కురసాల కన్నబాబు

పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాఫిక్స్ బడ్జెట్లో ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు అలవికాని అంకెలతో బడ్జెట్ నింపేశారని విమర్శించారు. చంద్రబాబు సిక్సర్ కొడితే లబ్ధిదారులు డెకౌట్ అయిన విధంగా బడ్జెట్ ఉంది అన్నారు. కేవలం అంకెల గారిని తప్పితే ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలు చేయడం సాధ్యం కాదని కన్నబాబు అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ గాని మరి ఇతర సంక్షేమ పథకాలకు గాని ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవని కన్నబాబు ఎత్తి చూపారు. బడ్జెట్పై అమరావతి ఊపిరి పీల్చుకొని పత్రిక రాసింది గాని ఆంధ్రప్రదేశ్ ఉరు పీల్చుకొని రాలేకపోయారని ఇంతకన్నా దిగజారుడు విషయం ఉండదని కన్నబాబు మండిపడ్డారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని అన్నారు.

జగన్‌ను కలిసిన ఇంటూరి రవికిరణ్‌ సతీమణి

సోషల్ మీడియా ఆక్టివిస్ట్ అయిన తన భర్త ఇంటూరి రవికిరణ్ ని పోలీసులు రాజకీయ కారణాలతోనే వేధిస్తున్నారని అతని భార్య ఇంటూరి సుజనా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అపార్టీ అధినేత వైస్ జగన్మోహనరెడ్డిని కలిసి తన భర్త ఇంటూరి రవికిరణ్ పై పలు స్టేషన్లలో కేసులు పెట్టి వేదిస్తున్న తీరును ఆమె జగన్మోహనరెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా సుజన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తన భర్తపై తొమ్మిది అక్రమ కేసులు పెట్టారని, బలవంతంగా స్టేట్మెంట్లపై సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన భర్త అరెస్ట్ పై తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసారు.

ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలి :చంద్రబాబు

శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులుగా హుందాగా ఉండాలని, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు..కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై అధ్యయనం చేయడం వల్ల అవగాహన కలుగుతుందన్నారు. పని చేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. ప్రజలకు ఎమ్మెల్యేలు జవాబుదారీగా పనిచేయాలన్నారు.ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని వాటిని తీర్చాలన్నారు. నిరంతరం ప్రజలు మనల్ని గమనిస్తూనే ఉంటారన్న విషయం మర్చిపోవద్దని, బూతులు మాట్లాడితే ప్రజలు అంగీకరించబోరన్నారు. బడ్జెట్‌ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వం తెచ్చే పాలసీలు, బిల్లులపై అధ్యయనం చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్

సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ బి.అనురాధ ప్రకటన విడుదల చేశారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా.. ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపైనా నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నామన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అయితే, సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com