31.7 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img
Home Blog Page 222

స్టాక్ మార్కెట్ అనిశ్చితితో బంగారం ధరల రికార్డ్

ఈ మధ్యకాలంలో, బంగారం ధరలు తరచూ కొత్త రికార్డ్‌ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత గోల్డ్‌ రికార్డ్ రన్‌ మరింత వేగం అందుకుంది. పసిడి రేటు గత 40 రోజుల్లో 10 సార్లు కొత్త గరిష్టాలను తాకింది. తన రికార్డ్‌లు తానే బద్ధలు కొట్టుకుంటూ పరుగులు తీసింది. ఈ రికార్డ్‌ మారథాన్‌ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ది మింట్ రిపోర్ట్‌ ప్రకారం, 2025 ప్రారంభం నుంచి బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు, పసిడి ప్రకాశం 10 సార్లు కొత్త ఆల్-టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2,943 డాలర్ల దగ్గర ఉంది. భారత మార్కెట్‌లో కూడా బంగారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 87,930 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. గోల్డ్‌ రేటు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 11 శాతం పైగా పెరుగుదలను చూసింది.మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధర ఈ పెరుగుదల మరింత కొనసాగవచ్చు & గ్లోబల్‌ మార్కెట్‌లో ధర ఔన్సుకు $3,000 కు చేరుకునే అవకాశం ఉంది. ఈ పెరుగుదల వెనుక చాలా కీలక కారణాలు ఉన్నాయి. వాటిలో, ప్రధానమైనవి – మార్కెట్ అస్థిరత, ద్రవ్యోల్బణం భయం, వాణిజ్య యుద్ధం, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు.

డొనాల్డ్ ట్రంప్ విధానాలే ప్రధాన కారణం :

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, ఆర్థిక నిర్ణయాల కారణంగా మార్కెట్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం పెరుగుదల కలిసి బంగారం మంటకు ఆజ్యంగా మారాయి, ధరలు పెంచుతున్నాయి. నిజానికి, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఆర్థిక విధానాలు బంగారం ధరలను ఎగదోయడానికి సాయపడ్డాయి. ట్రంప్‌, కార్పొరేట్ పన్నులలో కోతను ప్రతిపాదించారు. ఇది, అమెరికా రుణాన్ని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.భారత్‌, చైనా సహా ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్‌ బెదిరించారు. ఇది, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది. డొనాల్డ్‌ ట్రంప్, అమెరికాలో ఆదాయ పన్నును తొలగించడం & పాత పన్ను నిర్మాణాన్ని తిరిగి ప్రవేశపెట్టడం గురించి మాట్లాడారు. ఇదే జరిగితే గోల్డ్ రేట్లు ఇంకా బలపడే అవకాశం ఉంది.

భారీగా బంగారం కొంటున్న కేంద్ర బ్యాంక్‌లు :

ఇది కాకుండా, భారతదేశం, ఆసియా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలులో ముందంజలో ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్‌ ప్రకారం, గత ఏడాది, కేంద్ర బ్యాంకులు వరుసగా మూడో ఏడాది కూడా 1,000 టన్నులకు పైగా పసిడి కొన్నాయి. 2024లో, భారతదేశం 73 టన్నుల బంగారం కొనుగోలు చేసింది, దీంతో దేశంలో మొత్తం బంగారు నిల్వలు 876 టన్నులకు చేరుకున్నాయి. ఇది కాకుండా, చైనా గత మూడు సంవత్సరాలలో 331 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది, తన మొత్తం నిల్వలను 2,279 టన్నులకు చేర్చింది.

స్టాక్ మార్కెట్ క్రాష్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాలు చవిచూశాయి. దలాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ 5 రోజుల్లో తన మెరుపును పూర్తిగా కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 3 శాతానికి పైగా క్షీణించాయి. మంగళవారం రెండు సూచీలు ఒకటిన్నర శాతం క్షీణతను చవి చూశాయి. మంగళవారం మార్కెట్ ముగిసేలోపు పెట్టుబడిదారులు రూ.10 లక్షల కోట్లు, ఫిబ్రవరి 4 నుండి రూ.17.76 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్టాక్ మార్కెట్లో ఈ క్షీణత జనవరిలో కంటే ఎక్కువగా కనిపించింది. ఫిబ్రవరి నెలలో సగం కూడా గడిచిపోలేదు. ఇప్పటికే 2,400 పాయింట్లకు పైగా క్షీణత కనిపించింది.ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే స్టాక్ మార్కెట్లో ఈ క్షీణత ఎందుకు కనిపిస్తోంది? కాబట్టి దీనికి సమాధానం ట్రంప్ బెదిరింపులే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్రంప్ మొత్తం ప్రపంచానికి సుంకాల భయాన్ని చూపించి భయపెడుతున్నారు. దీని ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం కూడా దీనికి అతీతం కాదు. ట్రంప్ ఇటీవల స్టీల్, అల్యూమినియంపై 25 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్ వేగంగా క్రిందికి కదులుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టాక్ మార్కెట్ నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య సమావేశంపై కన్నేసి ఉంచుతుంది. దానిలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి? ఆ తరువాత, స్టాక్ మార్కెట్ కదలికలో కొంత మార్పు సాధ్యమే అనిపిస్తుంది..!మంగళవారం స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కీలక సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్‌లో 1,281.21 పాయింట్లు పడిపోయి, ఒక రోజు కనిష్ట స్థాయి 76,030.59 పాయింట్లకు చేరుకుంది. కాగా, ఒక రోజు ముందు సెన్సెక్స్ 77,311.80 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం, అంటే మధ్యాహ్నం 2.15 గంటలకు, 1,116 పాయింట్ల క్షీణతతో 76,195.89 వద్ద ట్రేడవుతోంది.ప్రత్యేకత ఏమిటంటే ఫిబ్రవరి 4 నుండి స్టాక్ మార్కెట్ నిరంతర క్షీణతను చూస్తోంది. ఈ కాలంలో సెన్సెక్స్ 3.25 శాతం క్షీణతను చూసింది. మనం డేటాను పరిశీలిస్తే, ఫిబ్రవరి 4న సెన్సెక్స్ ముగిసిన తర్వాత, అది 78,583.81 పాయింట్ల వద్ద కనిపించింది. అప్పటి నుండి, ఇది 2,553.22 పాయింట్ల క్షీణతను చూసింది.

నిఫ్టీ కూడా క్రాష్..!

మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక నిఫ్టీ కూడా నష్టాల్లో కూరుకుపోతోంది. ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ 394.95 పాయింట్లు తగ్గి 22,986.65 పాయింట్లకు చేరుకుంది. కాగా, ఒక రోజు ముందు నిఫ్టీ 23,381.60 పాయింట్ల వద్ద ముగిసింది. మధ్యాహ్నం 2:15 గంటలకు నిఫ్టీ 362 పాయింట్ల లాభంతో 23,019.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో నిఫ్టీ మరింత క్షీణించవచ్చు.నిఫ్టీలో ఈ క్షీణత 5 రోజులుగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 4 నుండి, నిఫ్టీ నిరంతరం నేల చూపులు చూస్తోంది. ఈ కాలంలో నిఫ్టీ 3.17 శాతం పడిపోయింది. నిఫ్టీ డేటాను పరిశీలిస్తే, ఫిబ్రవరి 4న అది 23,739.25 పాయింట్ల వద్ద ముగిసింది. దీని అర్థం నిఫ్టీ 752.6 పాయింట్లు క్షీణించింది. ఇది మరింత కొనసాగే అవకాశం ఉంది.

పెట్టుబడిదారులకు భారీ నష్టం :

స్టాక్ మార్కెట్ పతనం కారణంగా, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. పెట్టుబడిదారుల నష్టం బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ పెరుగుదల లేదా తగ్గుదలపై ఆధారపడి ఉంటుంది. ఒక రోజు ముందు, బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ. 4,17,82,573.79 కోట్లుగా ఉంది. ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ.407 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. అంటే ప్రస్తుత ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు రూ.10 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఫిబ్రవరి 4 తర్వాత కాలం గురించి మాట్లాడుకుంటే, పెట్టుబడిదారులు 5 ట్రేడింగ్ సెషన్లలో ఇంకా పెద్ద నష్టాలను చవిచూశారు. బిఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ.4,25,50,826.11 కోట్లుగా ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.17.76 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి – ఈసీకి సర్పంచుల సంఘం వినతి

తాజా మాజీ సర్పంచ్‌ల సంఘం నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడిచినా.. ఇన్నాళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంపై సర్పంచ్‌ల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు క్లిష్టమైన పరీక్షల సమయమని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మి నారాయణ రెడ్డి అన్నారు. సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, తాజా మాజీ సర్పంచులతో కలిసి హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్లైన పదవ తరగత, అలాగే, ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణతో విద్యార్థులు విద్యాభ్యాసంపై ఏకాగ్రత కోల్పోతారని, తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున పరీక్షలు ముగిసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు. అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి, వాటి తాలూకు బిల్లులు అందక సర్పంచులు ఆర్థికంగా కుదేలైపోయారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతూ వినతి పత్రం అందించారు.

పంజాబ్‌ సీఎంను మార్చేస్తారంటూ రూమర్లు

  • కొట్టి పారేసిన ఆప్‌
  • కేజ్రీతో పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యేల భేటి
  • పార్టీని ముందుకు నడిపించే అంశంపై చర్చ
  • ఫిరాయింపులు అభూతకల్పనలేనన్న ఆప్‌
  • హామీలన్నీ అమలు చేస్తామని భరోసా…
  • తన పదవికి ఢొకా లేదన్న భగవంత్‌ మాన్

పంజాబ్‌ కు ఆప్‌ కొత్త సీఎంని నియమిస్తుందా? ప్రస్తుతమున్న భగవంత్‌ మాన్‌ ను తప్పించే అవకాశాలున్నాయా? నిజా నిజాలేమిటో తెలీదు కానీ… బీజేపి, కాంగ్రెస్ పార్టీల ఊహల తో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలను ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ మీట్ అవడం ఈ ఊహాగానాలకు తెర తీసింది. నిప్పు లేనిదే పొగరాదని, పంజాబ్‌ సీఎం పగ్గాలు కేజ్రీవాల్‌ తీసుకోవాలనుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపి ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి ఢిల్లీలో ఆప్‌ ను నట్టేట ముంచేసిన కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్‌ పై పడ్డారని భగవంత్ మాన్ ను తప్పించి ఆ అఅధికారం తాను తీసుకుంటారని వ్యాఖ్యానించాయి. ఆప్‌ ఎమ్మెల్యేలందరితోనూ అందుకే కేజ్రీవాల్‌ భేటీ అయ్యారని బీజేపి థియరీ తీసింది.

ఫిరాయింపులంటూ వార్తలు…

అసలే కీచులాడుకుంటున్న కాంగ్రెస్ కు ఆప్‌ భేటీలు మరింత కలిసొచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ బాజ్వా అయితే ఏకంగా 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ప్రకటించాడు. ఇంకేముంది ఆప్‌ చీలబోతోందన్న రూమర్లూ పుట్టేశాయి. ఈ వార్తలపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ను కదిపితే ఆయన పెద్ద నవ్వు నవ్వారు. బాజ్వా ఈ వ్యాఖ్యలను మూడేళ్ల నుంచి చేస్తున్నారు. పోయి ఢిల్లీలో కాంగ్రెస్ ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిచిందో ముందు లెక్కేసుకోమని కౌంటర్ వేశారు. మీరు ఆప్‌ ను వదిలి వెళుతున్నారా అని భగవంత్‌ మాన్‌ ను అడిగినప్పుడు నేనెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మా కష్టంతోనే ఆప్‌ నిర్మాణం సాధ్యపడింది. అలా పార్టీలు మారే కల్చర్ వాళ్లదే… వాళ్ల సీనియర్ నేత ఒకరు ఢిల్లీలో డప్పులు మోగించి మరీ సంబర పడుతున్నారు… కాంగ్రెస్ జీరో సీట్లు సాధించినందుకా ఆ సంబరాలు? అని భగవంత్‌మాన్ అడిగారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో ఆప్‌కు 93 సీట్లు కాంగ్రెస్ కు 16 సీట్లు ఉన్నాయి.

భేటీ అందుకేనా?

పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ ఢిల్లీ ఎన్నికల్లో వారు కష్టపడినందుకు కృతజ్ఞతలు చెప్పడానికేనని మాన్ అన్నారు. ఢిల్లీ ఓటమి పార్టీకి నిరాశను కలిగించేదే ఇప్పుడిక పంజాబ్ పై దృష్టి పెట్టబోతున్నాం. పంజాబ్‌ను మోడల్‌ స్టేట్‌ గా తీర్చి దిద్దుతాం అని మాన్ అన్నారు. మహిళలకు వెయ్యి రూపాయల నగదు త్వరలోనే అందిస్తామని అన్నారు. పంజాబ్‌లో పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కేజ్రీవాల్ సమావేశంలో ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారని లూథియానా సెంట్రల్ ఎమ్మెల్యే తెలిపారు. ఆప్‌ నుంచి కాంగ్రెస్ కి ఫిరాయింపులు ఉండబోతున్నాయన్న కథనాలపై… వారికున్న 17 మంది తమ పార్టీలోకి వచ్చేస్తారేమో… ముందు జాగ్రత్త పడమనండి అంటూ కౌంటర్ వేశారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫిబ్రవరి 21న విడుదల

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఒరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుద‌ల చేస్తున్నారు. కోస్తాంధ్రలో పూర్వీ పిక్చ‌ర్స్ రిలీజ్ చేస్తున్నారు.

యూత్‌కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

ఈ చిత్రంలో కె. యస్. రవికుమార్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మిస్కిన్‌ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎమ్. వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

మినీ మేడారం జాతరకు సర్వం సిద్దం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గిరిజన వేడుక.. మేడారం మినీ జాతరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు మినీ మేడారం జాతర నిర్వహించనున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల మినీ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం మినీ మేడారం జాతర విజయవంతం చేయడానికి ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికతో అన్ని శాఖల అధికారులు, పూజారులు సమన్వయంతో ముమ్మరంగా పనులు చేపట్టి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ చెప్పారు. గురువారం తాడ్వాయి మండలంలోని మేడారంలో పలు శాఖల అధికారులతో కలిసి వైద్య శిబిరం, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించిన అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని డిపిఓను ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాటు చేయడమే కాకుండా మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చే సందర్శకులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని ఆయన సూచించారు.

భూముల కబ్జాపై మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ అధికారుల సర్వే

మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే నంబర్ 641, 642, 643, 644, 641/AA లో మొత్తం 7 ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించాడన్న ఆరోపణలపై న్యాయస్థానం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. బహదూర్ పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి, పిట్ల సత్తెమ్మ తమ భూమిని మల్లారెడ్డి అక్రమంగా కబ్జా చేశాడని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు వంశ పారపర్యంగా వస్తున్న భూమిని.. చామకూర మల్లారెడ్డి అధికారం అడ్డు పెట్టుకొని కబ్జా చేశాడని, తమకు న్యాయం కావాలని 2014 నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు. పిటిషన్‌ దారుల వాదనలు విన్న కోర్టు మల్లారెడ్డి యూనివర్సిటీలో భూములను సర్వే చేయాలని, అక్కడ స్థలం కబ్జాకు గురైందా, లేదా పరిశీలించి సర్వే రిపోర్ట్‌ అందించాలని ఈనెల 2వ తేదీన న్యాయస్థానం ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో మల్లారెడ్డి యూనివర్సిటీకి చేరుకున్న మేడ్చల్ మండల రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించారు. సర్వే రిపోర్టును అడ్వకేట్ కమిషనర్ అందజేస్తామని తెలిపారు. అయితే, కోర్టు ఆదేశాలతో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మొదట కళాశాల లోనికి అనుమతించకుండా సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్ళి సర్వే పూర్తి చేయించారు.

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోకి టీటీడీ – ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌చ్చే అవ‌స‌రం లేకుండా, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ కూడా వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. ఈ దిశ‌గా అన్ని శాఖ‌లు త‌మ బ్యాక్ ఎండ్ మెకానిజం స‌మ‌ర్థ‌వంతంగా ఉండేలా చూసుకోవాల‌న్నారు. మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై ఇచ్చిన ప్ర‌జెంటేష‌న్‌పైన సీఎం మాట్లాడుతూ అధికారులకు ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు చేశారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో ప్ర‌స్తుతం ఇస్తున్న సేవ‌ల సంఖ్య పెంచాల‌న్నారు. ప్ర‌స్తుతం 161 సేవ‌లిస్తున్నామ‌ని, రాబోయే 45 రోజుల్లో 500 సేవ‌లు క‌ల్పించే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని, అలాగే రాబోయే మూడు లేదా ఆరు నెల‌ల్లో ప్ర‌భుత్వానికి సంబంధించిన అన్ని సేవ‌లు కూడా వాట్సాప్‌లోనే ప్ర‌జ‌లు పొందేలా యంత్రాంగం స‌న్న‌దం కావాల‌న్నారు. దీన్ని ఏ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకెళ్లాలంటే ప్ర‌భుత్వం నుంచి ఏదైనా ఒక బిల్లు రాలేదంటే ప్ర‌జ‌లు దాన్ని స్కాన్ చేసి లేదా దాని వివ‌రాల‌ను వాట్సాప్‌లో పొందుప‌రిస్తే దాన్ని ప‌రిశీలించి మ‌నం క్లియ‌ర్ చేసేంత స్థాయికి తీసుకెళ్లాల‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ఏ ప‌ని కావాల‌న్నా కార్యాల‌యాల చుట్టూ రోజుల త‌ర‌బ‌డి తిరిగే ప‌ద్ద‌తికి స్వ‌ప్తి ప‌లికి, అస‌లు వాళ్లు ఏ కార్యాల‌యానికి రావాల్సిన అవ‌స‌ర‌మే లేకుండా కేవ‌లం వాళ్ల చేతిలోని సెల్‌ఫోన్ ద్వారానే వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కావాల్సిన సేవ‌లు పొందేలా చేయ‌డ‌మే త‌మ ఆశ‌య‌మ‌న్నారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం స‌న్న‌ద్ధ‌మ‌వ్వాల‌ని సూచించారు. రాబోయే రోజుల్లో ప్ర‌యాణికులు ఆర్టీసీ బ‌స్సు జీపీఎస్ ట్రాకింగ్ కూడా త‌మ వాట్సాప్‌లోనే చూసుకునే స‌దుపాయం క‌ల్పించాల‌న్నారు.

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోకి టీటీడీ

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోకి టీటీడీ సేవ‌ల‌ను కూడా తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. ఇవే కాకుండా అవ‌స‌ర‌మైతే కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పౌరులు పొందే స‌దుపాయం క‌ల్పిస్తామ‌న్నారు. సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందే స‌దుపాయం క‌ల్పించే అంశం కూడా ప‌రిశీలించాల‌న్నారు. కేవ‌లం ఇవే కాకుండా ప్ర‌భుత్వం ప‌నితీరుపై ప్ర‌జాభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారానే సేక‌రించాల‌న్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను మ‌నం విస్తృతంగా అమ‌లు చేస్తున్న ఈ త‌రుణంలో కొంత‌మంది కావాల‌ని విమ‌ర్శ‌లు చేసేవారుంటార‌ని, ఎక్క‌డా ఎలాంటి లోపాల‌కు తావివ్వ‌కుండా ప్ర‌తి శాఖ కూడా సైబ‌ర్ సెక్యూరిటీ ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. ఐటీ శాఖ దీనిపైన ప్ర‌త్యేకంగా ప‌నిచేయాల‌న్నారు. వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్‌, లేదా పౌరుల ఆధార్ అథంటికేష‌న్ కోరే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు.

వాట్సాప్‌కు అనూహ్య స్పంద‌న‌

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న క‌నిపిస్తోంది. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి కేవ‌లం వారం రోజుల్లోపే 2,64,555 లావాదేవీలు జ‌రిగాయి. ఇందులో 41 శాతం (1,10,761) ఆర్థిక లావాదేవీలు, 43.1 శాతం (1,14,119) సమాచారం కొర‌కు ఉప‌యోగించారు. ఈ వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్ర‌భుత్వ విభాగాలు, ఆయా సంస్థ‌లు రూ.54.73 ల‌క్ష‌లు వ‌సూలు అయ్యాయి. అత్య‌ధికంగా విద్యాశాఖ‌లో 82,938 ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయి. వాట్సాప్‌లో 85 శాతం ట్రాన్సాక్ష‌న్స్ విజ‌య‌వంతంగా పూర్తి అయ్యాయి. 35 శాతం స‌ర్వ‌ర్ స్పీడు స‌మ‌స్య కార‌ణంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆయా శాఖ‌లు త‌మ స‌ర్వ‌ర్ స్పీడు పెంచుకోవాల‌ని ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ కోరారు.

మారని అధిష్టానం తీరు… ఛరిష్మాటిక్ లీడర్లకు పొగ

  • దశాబ్దాలుగా అదే తీరు..
  • రాష్ట్రాలకు రాష్ట్రాలే చేజారినా అదే దుస్థితి
  • అన్నింటిలోనూ అధిష్టానమే ఫైనల్‌
  • కీలక నిర్ణయాలపై ఎడ తెగని తాత్సారం
  • అసమ్మతులను పెంచి పోషించే ధోరణి
  • పార్టీ చేజార్చుకున్న నేతలెందరో..
  • తెలంగాణలోనూ అంతే..

కాంగ్రెస్ పార్టీ తీరే అంత.. తాను ఎదగదు.. ఎదిగే నేతలకు స్వేచ్ఛ ఇచ్చి పార్టీ బలోపేతానికి దోహదపడదు. 125 ఏళ్ల నుంచి నేటి వరకూ రొటీన్ పాలిటిక్స్ నడపడమే. గ్రూపు తగాదాలను ప్రోత్సహించడం, కుమ్ములాటలను ఎంకరేజ్ చేయడమే. ఎక్కడైనా పార్టీ చాలా కాలం తర్వాత అధికారం దక్కించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని  పదిలం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీయే కనిపించదు. అందుకే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ పార్టీకి బలమైన బేస్ లేదు. కాంగ్రెస్ పార్టీని ఆరాధించే సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన సామాన్య ప్రజలు, కార్యకర్తలు ఆ పార్టీ బలపడాలని అధికారంలోకి రావాలని కలలు కంటుంటారు. కానీ అధిష్టానం మాత్రం అందుకు భిన్నమైన రాజకీయాలు ప్రోత్సహిస్తూ వస్తుంది. అలా భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నప్రతీసారి పార్టీకి తీవ్రమైన నష్టం జరిగినా అదే ధోరణి. ఎందుకిలా అనాల్సి వస్తోందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారిపోయిన సమర్ధవంతమైన నేతల చిట్టా పరిశీలిస్తే అదే తేలుతుంది. సాధారణంగా కాస్త చరిష్మా కలిగిన నేతలకు పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపించే సమర్ధతలుంటాయి. అదేటైమ్ లో అసమ్మతి గళాలూ తక్కువేం కాదు. ఆ నాయకుడితో పడని వారు ఢిల్లీ వెళ్లి చేసే ఫిర్యాదులనూ సరి సమానంగా పోత్సహిస్తుంటుంది అధిష్టానం. అధిష్టానం పరిశీలకులను పంపడం సమస్యను సర్దుబాటు చేయాలని చూడటమే తప్ప పార్టీకి సమస్యాత్మకంగా మారిన వారిపై కఠిన చర్యలు ఉండవు. అలాగని స్వతంత్ర్యంగా బలమైన నేతగా ఎదిగిన వారికి నాయకత్వ బాధ్యతలు స్వేచ్ఛను కట్టబెట్టి పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉంచుకునే ఓపిక, నేర్పు కూడా లేవు. కలేజా ఉన్న నేతలు ఎదిగితే పార్టీది ఆత్మరక్షణ విధానమే..

యువనేతలను చేజార్చుకున్న కాంగ్రెస్

ఇందుకు నిదర్శనం.. మన తెలుగు రాష్ట్రాలే.. ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్.. వైఎస్‌ హయాంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ బలపడేందుకు ప్రయత్నించే పనులు చేయలేదు. వైఎస్ ఎదుర్కొన్న నిత్య అసమ్మతే అందుకు ఉదాహరణ. వైఎస్ అనంతరం చరిష్మా కలిగిన యువనేత జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ అంతే. ఓదార్పు యాత్రకు అనుమతులివ్వకుండా ఆయన్ను కట్టడి చేసే ప్రయత్నం చేసి ఆపై ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మోపి ఆయనపై కక్ష తీర్చుకున్నాననుకుంది. కానీ జనంలోకి వచ్చి కేసులపై ఒంటరి పోరాటం చేస్తూ వేరే పార్టీ పెట్టి ఏపీ కి సీఎం కాగలిగారు జగన్. అస్సోంలో హేమంత్‌ బిశ్వ శర్మ కూడా అంతే..ఓ వైపు పార్టీ ధోరణులు నచ్చక, ఇండైరెక్టుగా రాహుల్ పొమ్మని చెప్పేయడంతో  ఆయన బీజేపి పంచన చేరాల్సి వచ్చింది.

ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా అంతే. ప్రముఖ కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్ లో కాస్త అగ్రెసివ్‌ గా అడుగులేస్తూ పుష్కలమైన నాయకత్వ సమర్ధతలున్న నేత.. ఆయన ఎదుగుదలను ప్రోత్సహించకుండా ఆయనకి ప్రత్యామ్నాయంగా కమల్‌నాథ్‌ ను కాంగ్రెస్ ప్రోత్సహించడం, సింధియా స్పీడుకు బ్రేకులు వేయడంతో ఆయన బీజేపిలో చేరి ఏకంగా కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన బలమైన నాయకుడు జితేంద్రప్రసాద్‌. రాజీవ్‌గాంధీ, పీవీ.నరసింహారావులు ప్రధానులుగా ఉన్నప్పుడు వారికి సలహాదారుగా చెయ్యడమే కాకుండా మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఆయన కుమారుడు జితిన్‌ ప్రసాద్‌ కు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి అనుకున్న స్ధాయిలో మదద్దతు దొరకకపోవడంతో ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు. ఇక రాజస్థాన్ లోనూ అంతే.. సీనియర్ నేత రాజేష్‌ పైలట్‌ రాజీవ్‌ గాంధీకి సన్నిహితుడు. ఆయన కుమారుడు సచిన్ పైలట్‌ కాంగ్రెస్ లో రాజకీయం నేర్చుకున్నవాడే.. రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాలని ఆశించిన వ్యక్తి.. కష్టపడి పార్టీని గెలిపిస్తే యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా వృద్ధుడైన అశోక్ గెహ్లాట్‌  కు బాధ్యతలు కట్టబెట్టడం తనను ప్రోత్సహించకపోవడంతో ఆయన ఢీలా పడే పరిస్ధితి వచ్చింది. ఇలా యువ నేతలందరినీ పొమ్మనకుండానే పొగ పెట్టి చేజార్చుకుంది కాంగ్రెస్. నిజానికి వారికి నాయకత్వ పగ్గాలు అప్పగించి ఉంటే పార్టీ పరిస్థితి మరోలా ఉండేది.

తెలంగాణలోనూ అదే తంతు…

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పరిస్థితి.. దశాబ్దం తర్వాత పార్టీని అధికారంలోకి తేవడానికి రేవంత్‌ కష్టపడిన మాట వాస్తవం. గెలిచాక రేవంత్‌ కు సమస్త బాధ్యతలూ అప్పగించినట్లు పైకి చెబుతూనే వెనక నుంచి ఆయనను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలులేకుండా బ్రేకులేస్తోంది అధిష్టానం. పార్టీ అధికారం చేపట్టి ఏడాది దాటిపోయినా.. ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు జరపడానకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా నాన్పుడు ధోరణే అవలంబిస్తోంది అధిష్టానం. అటు పీసీసీ విస్తరణకు కమిటీ వేయడం లేదు. అలాగే మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలపడం లేదు. పార్టీని, కేబినెట్‌ ను విస్తరించి పదవులు ఇవ్వడం అసమ్మతి స్వరాల కట్టడికి ఒక మార్గం. కాగా అధిష్టానం మాత్రం ఈ రెండూ తాను చేయదు, చేయనివ్వదు. సీఎం గా అనేక డిమాండ్లకు, ప్రకటించిన హామీలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రేవంత్‌ ది. చివరకు అధిష్టానం ఆమోదించిన హామీల అమలుకూ పెద్దల పర్మిషన్ తప్పని పరిస్థితి. ఈ తాత్సారం వల్ల పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడే అవకాశం ఉంది. పదేపదే అవే తప్పులు చేస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలనే చే జార్చుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం తీరు మారెదెప్పుడు?

సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం

సోఫా రిపేర్లు చేసే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి మల్ రెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి సోనియా రెగ్జీన్, సోఫా ఫర్నీచర్ రిపేరు దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం వేళ షాపులో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు షాపు మొత్తం వ్యాపించాయి.

దాదాపు 15 నిమిషాల పాటు మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక సేవలు అందించారు. ప్రమాదం జరిగిన దుకాణానికి పక్కనే ప్రైవేటు స్కూల్ కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే యజమాన్యం అప్రమత్తమై పిల్లలను స్కూలు నుంచి బయటకు తరలించారు.

మరోవైపు.. అగ్ని ప్రమాదానికి యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. స్థానికంగా ఈసంఘటన భయాందోళను కలిగించింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com