34.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

భారత్ అంబులపొదిలో కీలక ఆయుధాలు ఇవే…

  • పాకిస్థాన్ ను బెంబేలెత్తిస్తున్న భారత ఆయుధ సంపత్తి
  • ఒక్క దెబ్బకే తోక ముడుస్తున్న దాయాది దేశం
  • ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఆయుధాలకు పదును
  • కాలంతో పాటు అప్ గ్రేడ్ చేసిన రక్షణ శాఖ
  • అత్యాధునిక ఆయుధాలు వేటికీ తీసిపోని పనితనం
  • ఆత్మనిర్భర్ భారత్ ఆశయంలో భాగంగా తయారీ
  • మేకిన్ ఇండియా ప్రాజెక్టులో తయారైన ఆయుధాలు
  • భారత సమర్ధతకు చేతులెత్తేసి, తోక ముడిచిన పాక్
  • గురువారం అర్ధరాత్రి విరుచుకు పడిన పాక్
  • క్షిపణులు, ద్రోన్లతో భారత నగరాలపై దాడులు
  • అన్ని దాడులను మార్గ మధ్యంలోనే నిలిపేసిన మన సైన్యం
  • అన్నింటినీ తుత్తునియలు చేసి నేల కూల్చిన వైనం

గురువారం రాత్రి.. భారత,పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారంటే అందుకు మన త్రివిధ దళాలు మనకిచ్చిన రక్షణని, దీనికి కారకుడైన ప్రధాని మోడీ సమర్ధనాయకత్వాన్నిప్రశంసించి తీరాలి.

దాయాది దేశం గురువారం రాత్రి మనదేశంపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. 15 నగరాలను టార్గెట్ గా చేసుకుని కురిపించిన క్షిపణులను పిట్టలను కాల్చినట్లు నిర్వీర్యం చేసి పారేశాయి మన ఆయుధాలు.. పాకిస్థాన్ కుటిల యత్నాన్ని తిప్పికొట్టిన అత్యాధునిక, అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు ఇవి.

నిజానికి ఇవన్నీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటివి.. కానీ వాటిని మనదేశం కాలనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకుంది. ఈ ఆయుధాలతోనే అటు సరిహద్దుల దగ్గర, గురువారం రాత్రి  జరిగిన దాడులను ఏకకాలంలో తిప్పికొట్టి పాకిస్థాన్ పై పైచేయి సాధించగలిగింది.

zsu 23-4 షిల్కా…

అత్యాధునికమైన , కచ్చితత్వంతో టార్గెట్ ను గురి చేసే ఈ గన్ అత్యంత విశ్వసనీయతతో అద్భుతంగా పని చేస్తుంది. ఇది శతృ దేశాలనుంచి వచ్చే ద్రోణ్లను పసిగట్టి నిర్వీర్యం చేసేస్తుంది.ఇది శత్రు దేశాల యుద్ధ క్షేత్రాలు, రేడియో యాంటెన్నాలను నాశనం చేస్తుంది. ఇది అతి తక్కువ ఎత్తులో ఎగిరే ఫిక్స్డ్ వింగ్, ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లను నేల కూల్చగల సత్తా కలిగినది.

ఆకాష్ మిస్సైల్…

ఇది పూర్తి దేశీయ పరిజ్ణానంతో రూపొందించిన క్షిపణి వ్యవస్థ.పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే దాడులను ఇది సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. దీనిని ఏదైనా ట్రక్కు లేదా వాహనాలపై నుంచి   ప్రయోగించవచ్చు. డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్రూయీజ్ క్షిపణులను ఇది కూల్చివేస్తుంది. మేకిన్ఇండియా ప్రాజెక్టులో భాగంగా రూపొందిన ఈ క్షిపణి పాక్ క్షిపణి దాడులను తిప్పికొట్టడానికి మనం రూపొందించుకున్న బ్రహ్మాస్త్రం.

ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ మిస్సైల్ పాకిస్థాన్ దాడులను సమర్దవంతంగా తిప్పికొట్టింది.సరిహద్దుల పరిరక్షణలో దీనిని మించిన బ్రహ్మాస్త్రం లేదు. ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక మైలు రాయిగా నిలిచింది. భారత పాకిస్థాన్ ఘర్షణల నేపధ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో దీనిని పెద్ద ఎత్తున మోహరించారు.వీటి సాయంతోనే మనదేశం పాకిస్థాన్ గురిపెట్టిన 50కి పైగా డ్రోన్లను కూల్చివేసింది.దీనిని ఆర్మీ, ఎయిర్ ఫోర్సు ఇతర కీలక విభాగాలు సరిహద్దుల రక్షణలో వినియోగిస్తున్నాయి.

ఎస్ 400…

ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ఒక బ్రహ్మాస్త్రం. ఇది సుదర్శన చక్ర గగనతల రక్షణ వ్యవస్థ..శతృ దేశాల క్షిపణులను దారిలోనే పసిగట్టి నిర్వీర్యం చేసేయగల శక్తి కలది.గురువారం రాత్రి జరిగిన యుద్ధంలో ఈ ఆయుధాలదే కీలక పాత్ర.. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి మరెన్నో ఆయుధాలకన్నా శక్తిమంతమైనది.2014లో మొదట చైనా ఈ మిస్సైళ్లను కొనుగోలు చేసింది. ఈ క్షిపణి వ్యవస్థలో మూడు విభాగాలుంటాయి. మిసైల్ లాంచర్లు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్ ను కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ లు, క్రూయీజ్ మిసైళ్లను సైతం ఛేదిస్తుంది. వేగంగా దూసుకొచ్చే మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను కూడా తుత్తునియలు చేస్తుంది. అన్ని అధునాతన యుద్ధ విమానాలను కూల్చేయగల సత్తా దీని సొంతం. ఈ రాడార్ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ రాడార్ నైనా కనుగొని నిర్వీర్యం చేసేస్తుంది.2018లో రష్యాతో కుదిరిన ఒప్పందంలో ఈ ఎస్ 400 వాయురక్షణ క్షిపణి వ్యవస్థలు కొనుగోలు చేసింది భారత్.పాక్ నుంచి దూసుకొచ్చిన ప్రతీ క్షిపణి, మోర్టార్, బాంబులు అన్నింటినీ ఇది గుర్తించి గాల్లోనే కూల్చేసింది.

ఐఎన్ ఎస్ విక్రాంత్…

అరేబియా సముద్ర తీరంలో ఉన్న మన ఆయుధ సంపత్తిలో కీలకమైన ఐఎన్ ఎస్ విక్రాంత్ మనపై దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్ ఆర్ధిక కేంద్రమైన కరాచీని టార్గెట్ చేసింది. పాక్ ఆర్ధిక నగరంగా చెప్పుకునే కరాచీ నగరాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. విక్రాంత్ దాడులకు కరాచీ నగరంతో పాటు కీలకమైన కరాచీ పోర్టు కూడా తీవ్రంగా ధ్వంసమైంది. మన రక్షణ వర్గాల కథనం ప్రకారం యుద్ధనౌక విక్రాంత్ నుంచి భారత్ ప్రయోగించిన క్షిపణులు ఇతర ఆయుధాల దెబ్బకు కరాచీ పోర్టు బాగా దెబ్బతిందని దట్టమైన పొగ కమ్మేసిందని తెలుస్తోంది. నష్టం ఎంత జరిగిందన్నది తెలియరాలేదు. భయపడిన స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కీలకమైన ఈ పోర్టులోనే పాక్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. విక్రాంత్ దెబ్బకు పాకిస్థాన్ నావికాదళ కార్యకలాపాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

ఇది పూర్తిగా దేశీయ నిర్మితమైన యుద్ధనౌక.రెండు ఫుట్ బాల్ గ్రౌండ్లంత విస్తీర్ణం కలిగిన ఈ నౌక సముద్ర ఉపరితలంనుంచి మిగ్ ఫైటర్ జెట్లనుక్షిపణులు, ప్రయోగించగలదు.దీనిలో కోచి నుంచి కాశీ వరకూ వినియోగించగలిగినపొడవైన కేబుల్స్ ఉన్నాయి. దీని నుంచి వెలువడే విద్యుత్ తో ఐదువేల ఇళ్లకు కరెంటు సప్లయ్ ఇవ్వవచ్చు.

దీనిపై 30 ఫిక్స్ డ్ వింగ్ విమానాలను లాండ్ చేసే సామర్ద్యం ఉంది. ఫైటర్ జెట్లు, అలాగే రొటరీ వింగ్ విమానాలను కూడా దీనిపై నుంచి ప్రయోగించవచ్చు.ఒకేసారి22 రాఫేల్ మిగ్ ఫైటర్లు, 4 కామోవ్ కె 31, 2 హెచ్ ఏ ఎల్ ధ్రువ్ హెలికాప్టర్లను ఈ యుద్ధనౌక క్యారీ చేయగలదు.

L 70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్…

ఇవి ఉపరితలంలో ఎదురయ్యే సవాళ్లను  మెరుపు వేగంతో తిప్పికొడతాయి. మానవ రహిత ఏరియల్ వాహనాలు, అలాగే అన్ మాన్డ్ కాంబాట్ ఎయిర్ వెహికల్స్ ను టార్గెట్ చేస్తాయి. హెలికాప్టర్లు, ఆధునిక విమానాలను కూడా కూల్చివేయగల సత్తా కలిగినవి.నిమిషానికి 240-330 రౌండ్లు కాల్చ గలదు. దీనినుంచి వెలువడే ఉష్ణోగ్రత, మంటలు బహుముఖ టార్గెట్లను ఏకకాలంలో ఛేదించగలవు. శతృరాడార్ల దృష్టికి చిక్కకుండా యుద్ధానికి ముందువరసలో నిలిచే ఈ ఆయుధాలు యాంటీ డ్రోన్ సామర్ధ్యం కలిగినవి. మన వాయుదళాల అమ్ములపొదిలో సగర్వంగా నిలిచిన ఈ ఆయుధాలే పాక్‌ ఎంతలా మనపై దాడి చేసినా అరివీర భయంకరంగా ఎదురు దాడి చేసి దాయాది దేశం పీచమణిచాయి.

ప్రస్తుత దాడులను  తిప్పికొడుతున్నవి పూర్తిగా దేశీయ నిర్మిత ఆయుధాలే.  మేకిన్ ఇండియాలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రూపొందిన ఈ అత్యాధునిక వాల్డ్ క్లాస్ ఆయుధాలే ఇప్పుడు పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com