27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

రాశిఫలాలు…27.04.25 నుండి 03.05.25 వరకు

ఈవారం పండగలు–పర్వదినాలు…

30, బుధవారం, అక్షయతృతీయ.

02, శుక్రవారం, శ్రీ శంకర జయంతి.

————————————-

మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

పట్టుదలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మీ సహనమే మీకు ఉపకరిస్తుంది.కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలదు.జ్ఞాతుల నుంచి భూలాభాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కాంట్రాక్టులు దక్కుతాయి.ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. రుణాలు కొంత తీరే మార్గం కలుగుతుంది. అప్రయత్నంగా కొంత సొమ్ము అందుతుంది.కుటుంబ వివాదాలు పరిష్కారమై అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోధం లభిస్తుంది. శుభకార్యాల నిర్వహణపై సందిగ్ధత తొలగుతుంది.ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. భాగస్వాములు మీకు మరింత చేయూతనందిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరుగుతాయి. విధులు ప్రశాంత వాతావరణంలో సాగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులు అనుకున్నది సాధించే దిశగా సాగుతారు. 01,02 తేదీల్లో మిత్రులతో  విభేదాలు. వృథా ఖర్చులు. ఒప్పందాలు వాయిదా. అంగారక స్తోత్రాలు పఠించండి.

వృషభం.. (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు.ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది.ఇంటి నిర్మాణయత్నాలు కొంత ఫలిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో పెద్దల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. అందరి ప్రేమానురాగాలు పొందుతారు. బంధువుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. ఆస్తులవిషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కొంత ఆలస్యంగా దక్కుతాయి. భాగస్వాముల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విశేష పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. 29,30 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

అనుకున్న కార్యాలు చక్కదిద్దుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. సొమ్ములకు లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆస్తుల విక్రయాలు సకాలంలో  పూర్తి చేసి మరింత డబ్బు సమకూర్చుకుంటారు. కుటుంబంలో అందరితోనూ సఖ్యంగా మెలుగుతారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సోదరులతో కీలక విషయాలు చర్చిస్తారు. కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కొత్త భాగస్వాములతో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన రీతిలో ఒత్తిడులు తొలగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. 02,03 తేదీల్లో కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. ధనవ్యయం.  సన్నిహితులతో వివాదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

కష్టమైన పనులు సైతం పట్టుదలతో పూర్తి చేస్తారు. మిత్రులు చేదోడుగా నిలుస్తారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లాభాలు.కుటుంబంలో సోదరులు, సోదరీల నుంచి మరింత ఆదరణ పొందుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగుతాయి. కొన్ని రుగ్మతలు చికాకు పరుస్తాయి. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాట పడతారు. విస్తరణ కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న పోస్టులు రాగలవు. అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. 30,01 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. వివాదాలకు దూరంగా ఉండండి. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా సాగుతారు. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటు ఉండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సొమ్ముకు లోటు ఉండదు. అవసరాలు పెరిగినా ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది. కుటుంబంలో సంతానపరంగా కొంతకాలంగా పడుతున్న సమస్యలు తీరతాయి. భార్యాభర్తల మధ్య సర్దుబాటు వైఖరి. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు కలుస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. 02,03 తేదీల్లో కీలక నిర్ణయాలలో మార్పులు. కుటుంబంలో ఒత్తిడులు. ఎంతకష్టించినా ఫలితం అంతగా ఉండదు. శివాష్టకం పఠించండి.

కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. దేవాలయ దర్శనాలు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత ప్రగతి సాధించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. రావలసిన డబ్బు అందే అవకాశాలు. సోదరుల నుంచి సొమ్ము అందవచ్చు. స్థిరాస్తుల్లో పెట్టుబడులకు సిద్ధపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య ఆత్మీయత పెరుగుతుంది. వేడుకలు నిర్వహణకు సమాయత్తమవుతారు. సంతానం రీత్యా శుభవర్తమానాలు అందుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి విముక్తి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. భాగస్వాములతో తగాదాలు తీరతాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో మీ పెత్తనం పెరుగుతుంది. విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు విజయాలు సిద్ధిస్తాయి. 27,28 తేదీల్లో సోదరులు, మిత్రులతో కలహాలు. మనశ్శాంతి లోపం. దూరప్రయాణాలు ఉంటాయి. శ్రీగాయత్రీ ధ్యానం చేయండి.

తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సహకరిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొన్ని దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. రావలసిన సొమ్ము అనుకున్న సమయానికి అందుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై బంధువులతో చర్చలు సాగిస్తారు. సోదరులు, సోదరీలతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు కాగలవు. కొద్దిపాటి రుగ్మతలు బాధించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మరింత పెట్టుబడులు రాగలవు. విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న హోదాలు రావచ్చు. అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. 30,01 తేదీల్లో మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీ హయగ్రీవస్తుతి మంచిది.

వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుకుంటారు. రుణబాధలు కాస్త తొలగుతాయి. కుటుంబంలో చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. కొంత అనారోగ్యం తప్పకపోవచ్చు. అయితే ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాల దిశగా సాగుతూ విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. కొత్త భాగస్వాములు జతకడతారు. ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరుగుతాయి. విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 02,03 తేదీల్లో కొన్ని నిర్ణయాలు వాయిదా. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య వ్యవహారాలను పట్టుదలతో సాఫీగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనయోగం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. రుణబాధలు తీరతాయి. రావలసిన బాకీలు సైతం అందుతాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య నెలకొంటుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్యసేవల నుంచి విముక్తి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. పెట్టుబడులు మరింత పెరుగుతాయి. విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో వి«ధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉన్నతాధికారులు మీ సేవలను గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. 28,29 తేదీల్లో ముఖ్య ఒప్పందాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక అశాంతి. మహాలక్ష్మీ ప్రార్ధన మంచిది.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సమాచారం అందుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సమాజ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. షేర్లలో ఇన్వెస్ట్మెంట్చేస్తారు. కుటుంబంలో అందరిలోనూ మీదే పైచేయిగా నిలుస్తుంది. బంధువుల రాకతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. ఇంటిలో వేడుకల నిర్వహణపై సోదరులతో చర్చిస్తారు. ఆరోగ్యం రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలోవిస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. అలాగే, అధికారుల అభినందనలు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశయాలు నెరవేరతాయి. 27,28 తేదీల్లో శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలలో నిరాశ. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి్ట విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థుల నుంచి అనుకూల సంకేతాలు రావచ్చు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యూహాల అమలులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. రుణాలు సైతం తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఎటువంటి బాధ్యతలైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు కలయికతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. పైస్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. 30,01 తేదీల్లో బంధువుల నుండి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృథా ఖర్చులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొని మనశ్శాంతి లోపిస్తుంది. శ్రమ తప్పితే ఫలితం కనిపించదు. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు. రావలసిన సొమ్ము అందక నిరాశ చెందడమే కాకుండా అప్పులు సైతం చేస్తారు. ఇతరత్రా పెట్టిన పెట్టుబడులు కూడా అందే అవకాశం కనిపించదు. బంధువులతో విభేదిస్తారు. ఓర్పుతో వ్యవహరించ డం మంచిది. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో కొంత అనుకూలించినా లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు శ్రమాధిక్యం. 28,29 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. గణేశాష్టకం పఠించండి.

–––––––––––––––––––––––––––

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com