25.6 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

హైదరాబాద్‌ లో అడుగంటిన భూగర్భ జలాలు

విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకే గ్రేటర్ లో భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి ప్రమాదకర స్థాయిలో నీటి నిల్వలు పడిపోతాయని భూగర్భశాఖ అధికారుల అంచనా. వచ్చే నెలలో ఎండలు మరింత ముదిరే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది జనవరితో పోలిస్తే.. ఈ ఏడాది జనవరిలో చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటినట్లు గుర్తించారు. కూకట్‌పల్లి ప్రాంతంలో అత్యధికంగా 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు కూకట్‌పల్లి జోన్‌లో భారీ భవనాల నిర్మాణంతో నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మే చివరినాటికి ఇక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని భూగర్భజల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో విశ్లేషించగా.. 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. 2024 జనవరి కంటే జలాలు అడుగంటిపోగా 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు. 2024 డిసెంబరు, ఈ ఏడాది జనవరి చివరి నాటికి హైదరాబాద్ నగరంలో 0.58 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గినట్లు గుర్తించారు.
మరోవైపు ఎర్రగడ్డ, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంబీపూర్, చెంగిచెర్ల, చాంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్‌పేట, గుండ్ల పోచంపల్లి, ఉప్పల్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో 10 మీటర్లు కంటే ఎక్కువ లోతున భూగర్భ జలాలు పడిపోయినట్లు తెలిపారు. ప్రతీ వేసవిలో బోర్లు ఎండిపోతుండటం వల్ల నీటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని నగర ప్రజలు వాపోతున్నారు.

మోతాదుకు మించి బోర్లు వేయటం ద్వారా నీటిలో నాణ్యత తగ్గుతుందని జియాలిజిస్టులు అంటున్నారు. అలాంటి నీటిని వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com