వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం నాయకులు కాదని, కార్యకర్తలే అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాకం విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లుడుతూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదరుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు. అందరం కలసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాద్, కరణం ధర్మశ్రీతో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున హాజరయ్యరు.
- Advertisement with us -