జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. గురువారం ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వాళ్లందరితో కలిసి కొద్దిసేపు మౌనం పాటించారు. మరణించిన వాళ్ల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వంతో పాటు.. తాము కూడా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు.
- Advertisement with us -