29.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

పోసాని అక్రమ అరెస్ట్ ను ఖండించిన వైఎస్.జగన్

  • పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన జగన్
  • అండగా ఉంటామని ధైర్యం చెప్పిన వైయస్ జగన్

సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం జగన్‌ ఫోన్ లో పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అడ్వకేట్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డితో పాటు మరి కొందరు లాయర్లను పార్టీ నేతలను పోసాని దగ్గరకి పంపానాని పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని పోసాని సతీమణికి జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని ఆమెకు తెలిపారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పోసాని భార్య చెప్పారు జగన్మోహన్‌రెడ్డి.

అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై ఆయన సతీమణి కుసుమలత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు పోసానిని తీసుకువెళ్ళిపోయారని కుసుమలత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నాకు నోటీసులు ఇస్తే తీసుకోనని చెప్పానని, ఉదయం తీసుకు వెళ్ళవచ్చు కదా, ఇంత రాత్రి ఎందుకు తీసుకు వెళుతున్నారని వచ్చిన పోలీసులను ప్రశ్నించానని దానికి వారు సమాధానం కూడా చెప్పలేదని ఆమో ఆరోపించారు. ఎక్కడకి తీసుకు వెళుతున్నరని అడిగితే ఏదో పోలీస్‌ స్టేషన్‌ పేరు చెప్పి హడావుడిగా తీసుకు వెళ్లిపోయారని పోసాని భార్య కుసుమలత తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com