సాధారణంగా మన దగ్గర పెద్దల సమక్షంలో వివాహాలు జరిగినప్పుడు వధువరులు ఒకే కులం అంతగా కాకపోతో ఒకే మతం వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. కానీ ఫరే ఛేంజ్ పులివెందుల్లో జరిగిన ఒక వివాహ వేడుక అందర్నీ ఆకట్టుకుంది. ఇక్కడ వధువు హిందూ, వరుడు ముస్లీం. ఇరువైపుల పెద్దలు అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వధూవరులను ఆశీర్వదించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఇంతకీ ఆయన క్రీస్టియన్ మత సాంప్రదాయాన్ని ఆచరిస్తారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్.. ఇవాళ ఓ మతాంతర వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పులివెందులలోని విజయగార్డెన్స్‌లో సంగీత, అహ్మద్ దంపతులు ఒక్కటయ్యారు. మతాలు వేరైనా ఇరువైపుల పెద్దలు దగ్గరుండి హిందూ సంప్రదాయ పద్ధతిలో వాళ్ల పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తోపాటు.. ఆయన సతీమణి భారతి కూడా ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.