బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా – డబ్ల్యూజేఐ రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది డైరీని రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సమాచార, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో జర్నలిస్టు సంఘం డబ్ల్యూజేఐ రూపొందించిన ఉగాది డైరీని ఆవిష్కరించారు.
డబ్ల్యూ జే ఐ ప్రతినిధులు మంత్రులను కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టిన మరియు చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి మంత్రులకు వివరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మంత్రులు సహకరించాలని కోరారు. పాత్రికేయులకు మంత్రులు.. ఉగాది విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాత్రికేయులతో కలిసి నడుస్తామని మంత్రులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో.. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి నరేంద్ర భండారి, సీనియర్ ఉపాధ్యక్షుడు సంజయ్ సక్సేనా, వారి సందేశాల్లో, సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ జర్నలిస్టులతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఉగాది పంచాంగం / దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శి క్రాంతి ముదిరాజ్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.