32.8 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

యూఏఈ జైళ్ళ నుంచి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జైళ్ళలో మగ్గుతున్న 500 మంది భారతీయ ఖైదీలను విడుదల చెయ్యడానికి ఆ దేశాధ్యక్షుడు అనుమతించారు. రంజాన్‌ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జావేద్‌ అల్‌ నాహ్యాన్‌ తమ దేశ జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించడం వల్ల ఎమిరేట్స్‌ జైళ్ళలో ఉన్న 1295 మంది ఖైదీలను విడదల చేయడంతో పాటు 1518 మందికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించారు. రంజాన్‌ సందర్భంగా యూఏఈ జైళ్ళ నుంచి విడుదలైన 1295 మంది ఖైదీల్లో 500 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. ఈద్ కోసం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈద్ దృష్ట్యా, యుఎఇ జైళ్లలో ఉన్న ఖైదీలకు జీవితాన్ని గడపడానికి రెండవ అవకాశం ఇస్తోంది. దీనిని ఫిబ్రవరి చివరిలో ప్రకటించారు. ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించిన వారిలో 500 మంది భారతీయ ఖైదీలు ఉండగా.. వారి కుటుం బాల్లో ఆనందం నిండు కుంది…   యుఎఇ ఆదేశాన్ని అను సరించి, ఈ సంవత్సరం ఈ భారతీయులు తమ కుటుంబాలతో ఈద్ జరుపుకోగలుగుతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com