25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

ఇంతమంది సీఎంలు ఉండగా.. ఎవరికీ ఛాన్స్‌ ఇవ్వరా? – మీరే ఎగరేసుకుపోతారా?

ఇంతమంది సీఎంలు ఉండగా.. ఎవరికీ ఛాన్స్‌ ఇవ్వరా? – మీరే ఎగరేసుకుపోతారా?

దేశంలోని ముఖ్యమంత్రుల జాబితాలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ టాప్‌ వన్‌లో నిలిచారు. ఒక జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు టాప్‌వన్‌లో ఉండగా.. మరో లిస్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టాప్‌ వన్‌ ప్లేస్‌లో నిలిచారు. యాదృచ్చికమే అయినా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా రెండు ప్రధాన అంశాల టేబుల్స్‌లో ఫస్ట్‌ ప్లేస్‌ను చెరొకరు ఆక్రమించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులుండగా.. మీ ఇద్దరే ఇలా రెండు టాప్‌ ప్లేస్‌లను ఎగరేసుకుపోతారా? అన్న సెటైరికల్‌ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి ఇద్దరిలో ఒకరేమో దేశంలోనే రిచెస్ట్‌ సీఎం జాబితాలో నెంబర్‌ వన్‌ పొజిషన్‌ ఆక్రమించగా.. మరొకరేమో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో నాయకులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ – ఏడీఆర్‌ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇదిప్పుడు దేశంలో సంచలనాత్మకంగా మారింది. ఆ నివేదిక ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి రూ.931 కోట్ల ఆస్తులున్నాయి. అప్పులు రూ.10కోట్లు ఉన్నాయి. ఇక, క్రిమినల్‌ కేసుల జాబితాలో ఫస్ట్‌ పొజిషన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిపై మొత్తం 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే తెలియని వారుండరు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా ఆయనకు పేరుంది. అలాంటి చంద్రబాబు భారతదేశంలోని అత్యధిక ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.931 కోట్లు కాగా.. చంద్రబాబు పేరిట రూ.36 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబునాయుడికి ఆస్తులే కాదు, రూ. 10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. చంద్రబాబు పేరిట మాత్రం కేవలం రూ.36 కోట్లు ఆస్తులుండగా, ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ. 895 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో హెరిటేజ్ ఫుడ్స్ లో షేర్లను కలిపారు.

సంపన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో ఉన్నారు. పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు కాగా, ఆయనకు భారీ స్థాయిలో రూ.180 కోట్ల అప్పులున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. సిద్ధరామయ్యకు రూ.23 కోట్ల అప్పులున్నాయి. 30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయం రూ.13 లక్షలు కాగా, అప్పులు 1.3 కోట్లు ఉన్నాయి.

ఇక, ఏడీఆర్‌ నివేదిక ప్రకారం మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసులు, అప్పుల వివరాలు చూస్తే.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ చివరిస్థానంలో నిలిచారు. రూ.15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశంలో పేద సీఎంగా నిలిచారు. జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ రూ.1.18 కోట్ల ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచారు.

దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సరాసరి ఆస్తి విలువ రూ.52.59 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఓవరాల్‌గా 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉంది. మొత్తం ముఖ్యమంత్రుల ఏడాది సగటు ఆదాయం రూ.13,64,310 గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే బిలియనర్లుగా ఉన్నారు. ముగ్గురు సీఎంల ఆస్తులు రూ.50 కోట్ల కన్నా ఎక్కువగా ఉండగా, 9 మంది సీఎంల ఆస్తులు విలువ రూ.11 నుంచి రూ.50 కోట్ల మధ్య ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఇద్దరు సీఎంలు 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు కాగా, 12 మంది ముఖ్యమంత్రుల వయసు 51 నుంచి 60 మధ్యలో ఉంది. 31 మంది సీఎంలలో 10 మంది ముఖ్యమంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేషన్. ఇద్దరు సీఎంలు డాక్టరేట్ పొందారు.

ఇకపోతే..ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. 13 మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులున్నాయి. అందులో 10 మంది సీఎంల మీద కిడ్నాప్, లంచం, హత్యాయత్నం లాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డి మీద 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 13 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక, దేశంలో కేవలం ఇద్దరు మహిళా సీఎంలు ఉన్నారు. ఢిల్లీలో అతిషి, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

ఇప్పుడీ ఆస్తులు, కేసుల చిట్టా రావడంతో నెట్టింట జనానికి పెద్ద పండుగలా మారింది. ఎవరి స్థాయిలో వారు కామెంట్లు పెడుతూ డిసెంబర్ 31ని ఎంజాయ్ చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com