మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. తమ కుటుంబానికి చిందిన గొడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుకు వ్యతిరేకంగా పేర్ని నాని మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. నాని పిటీషన్ పై విచారించిన కోర్టు జనవరి 6వ తేదీ వరకూ పేర్నొ నానిపై ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను సోమవారాని వాయిదా వేసింది. మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం అయ్యాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నానిని 6వ నిందితుడిగా చేర్చారు. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చెయ్యడం ఖామని ప్రచారం జరిగింది. ఈక్రమంలో అకస్మాత్తుగా పేర్నినాని తరపున న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ మూవ్ చేశారు. ఇదిలా ఉండగా అసలు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నామీద తప్పుడు కేసులు పెడుతోందని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. తనమీద కోపంతో తన భార్యను సైతం వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement with us -