- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- పల్నాడు జిల్లా యల్లమందలో పర్యటన
- లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన సీఎం
రాష్ట్రంలో ఏ ఇంటిలో కష్టం వచ్చినా, ప్రాణ స్నేహితుడిలా వెళ్లి ఆదుకుంటానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో 5 కోట్ల మంది ప్రజల కళ్లల్లో ఆనందం చూడటమే తన జీవిత లక్ష్యమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం పల్నాడు జిల్లా యల్లమందలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. వారితో మాట్లాడారు. అలాగే లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికివెళ్లారు. కిచెన్ లోకి వెళ్లి స్వయంగా ఆయనే కాఫీ కలిపి, కుటుంబ సభ్యులకు ఇచ్చి తను తీసుకున్నారు. అలాగే మరో మహిళ శారమ్మ ఇంటికి వెళ్లి, పిల్లల్ని బాగా చదివించమని తెలిపారు. కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష రుణం ఇప్పించాలని సూచించారు.
అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ నాకెవరూ హై కమాండ్ లేరని అన్నారు. ప్రజలే నాకు హై కమాండ్ అని అన్నారు. గత ఐదేళ్లు ప్రజలెవరూ రోడ్ల మీదకు రాలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక నుంచి ఆ బాధలు మనకి లేవని అన్నారు. నేనేం చేసినా అందరికీ న్యాయం జరగాలన్నదే నా ఆలోచన అని అన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షను అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.
టెక్నాలజీ నాకు వెన్నతో పెట్టిన విద్యని తెలిపారు. ఫోన్లలో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్ల సహాయం కూడా తీసుకుంటున్నామని అన్నారు. లబ్ధిదారులు ఆఫీసుకు వచ్చారంటే, మీ చేతిలో మెమో ఉంటుందని తెలిపారు. 2024లో చంద్రబాబు పదేపదే చెప్పిన మాటేమిటంటే, ఆనాటి సీబీఎన్ ని చూస్తారని అనేవారు. అదే ఇప్పుడు చూస్తున్నామని సీనియర్లు కామెంట్లు చేస్తున్నారు.