36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

రేవంత్ నిర్ణయం గేమ్ ఛేంజర్ కానుందా?

  • భారీ బడ్జెట్ , పాన్ ఇండియా మూవీలేమవుతాయ్?
  • సంక్రాంతి సెంటిమెంట్ హిట్టా? ఫట్టా?

పుష్ప 2 సినిమా థియేటర్ ఘటన పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఆమె బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండటం, అనంతర పరిణామాల నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పెద్దలకు సంక్లిష్ట పరిస్థితిని తెచ్చి పెట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాన్ ఇండియా మూవీస్ పై ప్రధానంగా పడబోతోంది.

గేమ్ ఛేంజర్ ఏం కానుంది?

ముఖ్యంగా మెగా ఫ్యామిలీకే చెందిన రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ జనవరి12న విశ్వ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుకలు కూడా అమెరికాలోని డల్లాస్ లో అట్ట హాసంగా జరిగాయి. వాస్తవానికి క్రిస్మస్ పండగకే ఈ మూవీ రిలీజ్ కావాలి.కానీ పుష్ప 2 రిలీజ్ ఉండటంతో క్లాష్ కాకూడదనే, వసూళ్లు తగ్గరాదన్న ఉద్దేశంతోనే దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు మరి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.. ఈ మూవీ ఈవెంట్ కే డల్లాస్ లో రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు.తమిళనాడులో ఈ మూవీ తమిళ్ రైట్స్ రూ.15 కోట్లకు అమ్ముడుపోయి సంచలనం స్రుష్టించింది. భారీ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్న ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు శంకర్ డైరక్షన్ చేశారు. రంగస్థలం తర్వాత సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న రాం చరణ్ కు గేం ఛేంజర్ పాన్ ఇండియా మూవీతో కొత్త లక్ కలిసొస్తుందన్న అంచనాలున్నాయి.ఓ ఫైటింగ్ స్పిరిట్ తో తనకున్న అధికారాలతో పోరాడి, వ్యవస్థలో మార్పు కోసం తపించే ఓ సిన్సియర్ అధికారిగా రాం చరణ్ గేమ్ ఛేంజర్ లో కనిపించబోతున్నారు.

దిల్ రాజుకి సంకట స్థితి?

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీకి నిర్మాత దిల్ రాజు కావడంతో ఆయన కూడా ఒక సెంటర్ పాయింట్ గా మారారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా ఎన్నకున్నారు.తాజా నిర్ణయంతో గేమ్ ఛేంజర్ కు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆయనంటున్నారు. ఇప్పుడాయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారా? మధ్యే మార్గం ఏదైనా వెతుకుతారా అన్నది చూడాలి. సాధారణంగా దిల్ రాజు నిర్మాతగా తీసారంటే అంచనాలు తప్పవు. ఆ మూవీ హిట్ అవుతుందనే టాక్ ఉంది. మంచి నిర్మాతగా ఆయనకు పేరుంది. సాధారణంగా భారీ బడ్జెట్ మూవీస్ కు లక్కీ డైరక్టర్ గా భావించే శంకర్ ఈ మూవీకి డైరక్షన్ చేయడం వల్లకూడా చాలా మందికి దీనిపై అంచనాలు పెరిగాయి. గతంలో ఆయన నిర్మించిన రోబో లాంటి మూవీస్ సూపర్ హిట్ అయినా.. ఆయన లాస్ట్ మూవీ భారతీయుడు సీక్వెల్ దారుణంగా దెబ్బ తింది. ఈసారైనా హిట్ టాక్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆయనకున్నారు. ఇలా గేమ్ ఛేంజర్ అనుకోకుండానే అందరికీ టార్గెట్ గా మారింది.

అందరిదీ సంక్రాంతి సెంటిమెంటే..

ఇదే కాదు.. ఈ జనవరికి సంక్రాంతి బరిలో కొన్ని ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. సాధారణంగా చాలా మంది హీరోలకి సంక్రాంతి లక్కీ టైమ్.. ముఖ్యంగా నాగార్జున, హీరో వెంకటేశ్ లాంటి వారు మరికొందరు తమ చిత్రాలను సంక్రాంతికే రిలీజ్ చేస్తుంటారు. పిక్చర్ సూపర్ హిట్ కాకపోయినా, ప్రేక్షకులకు శెలవు దినాలు కాబట్టి తొలినాళ్లలోనే సినిమాకు కలెక్షన్లు వస్తాయని, గౌరవప్రదమైన టాక్ తో బయట పడచ్చనేది కొందరు హీరోల ఉద్దేశం. విక్టరీ వెంకటేష్ నటుడుగా అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈ జనవరిలోనే విడుదల కాబోతోంది. గతంలో సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదే కాదు పాన్ వాల్డ్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ మూవీ రాజా సాబ్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల అవుతుందన్న అంచనాలున్నాయి. బాలయ్య బాబు నటిస్తున్న డాకు మహరాజ్ కూడా జనవరి 12నే రిలీజ్ కానుంది. అఖండ తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకున్న బాలయ్య కి ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.గతంలో అఖండ అద్భుత విజయంతో దూకుడు మీదున్న బాలక్రిష్ణ మూవీకి సుమారు రూ.150 కోట్లు బడ్జెట్ ఖర్చయ్యిందని టాక్. చేస్తారన్నది చూడాలి.

వందకోట్ల క్లబ్ క్రేజ్

ఉత్తరాదిన ఉన్న ఈ వంద కోట్ల క్లబ్ క్రేజ్ దక్షిణాది ఇండస్ట్రీకి కూడా పాకింది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో రాజమౌళి స్రుష్టించిన ఈ ట్రెండ్ ఇప్పుడు సినీ హీరోలు, నిర్మాతల పాలిట ఓ గేమ్ ఛేంజర్ టాస్క్ లా మారింది. పుష్ప 2 మూవీ కలెక్షన్లు రెండో వారానికి తగ్గిపోగా, తొలివారంలో మాత్రం భారీ కలెక్షన్లతో సునాయాసంగా వంద కోట్ల క్లబ్ టాస్క్ ను దాటేసింది. కేవలం పుష్ప 2 రిలీజ్ కారణంగానే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను సంక్రాంతికి వాయిదా వేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com