38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మాజీ ప్రధాని పివీకి బీఆర్ఎస్ ఘన నివాళి

ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని గుర్తు చేశారు

భారతరత్న, మాజీ ప్రధాని పీవీ పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద కెటిఆర్, పివి కుమార్తె వాణి దేవి ఇతర నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావుని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందన్నారు.

పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టింది.. పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని కెటిఆర్ వివరించారు.

పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపిందని, పీవీ నరసింహారావు కుమార్తెని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com