24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

అమరావతి ఈసారైనా రూపు దాల్చుతుందా?

  • మే 2న మళ్లీ రాజధాని అభివృద్ధి పనుల ప్రారంభం
  • మోడీ చేతులు మీదుగా అట్టహాసంగా మొదలవనున్న పనులు
  • ఈసారి 60వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
  • ఐకానిక్ టవర్లు, అత్యాధునిక నిర్మాణాలు
  • డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు అన్నీ అండర్ గ్రౌండ్ కనెక్షన్లే
  • వాకింగ్, సైకిల్ ట్రాక్ ల నిర్మాణం
  • 9కీలక విభాగాలకు నవ నగరాల నిర్మాణం
  • 30 శాతం పచ్చదనంతో గ్రీన్, బ్లూసిటీ
  • అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం
  • దీని కోసం అదనంగా మరో 44 వేల ఎకరాల సమీకరణ
  • ఇన్నర్,ఔటర్ రింగు రోడ్లతో గ్రిడ్ వర్క్ విధానంలో అనుసంధానం
  • 2029కల్లా రాజధాని నిర్మాణం పూర్తి అని స్పష్టం
  • మూడేళ్ల కే మినిమం నిర్మాణాలు పూర్తవుతాయని ధీమా
  • గతంలో ఇంతకు మించి హామీలిచ్చిన ఇదే సర్కార్
  • మళ్లీ మరోసారి అదే కాంబినేషన్ లో పాలన
  • మరి ఈసారైనా నిర్మాణాలు పూర్తవుతాయా?
  • ఏపీ ప్రజల రాజధాని కల సంపూర్ణమవుతుందా?

అమరావతి నిర్మాణం పనులు మళ్లీ మొదలవబోతున్నాయి. లక్ష కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్న కూటమి ప్రభత్వం వచ్చేనెల రెండున ప్రధాని మోడీ చేతుల మీదుగా మళ్లీ పునః ప్రారంభం చేయిస్తోంది. ఈ దఫా దాదాపు 60 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల పనులను మోడీ ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అభివృద్ధికి చిరునామాగా  రాజధాని నిర్మాణం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈమేరకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కూడా ప్రధానికి చూపించారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే అక్షయ పాత్రలా అమరావతి ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు.మే రెండున ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి అమరావతి మాస్టర్ ప్లాన్ పర్యవరణం, పౌర జీవనం మధ్య సమతుల్యత పాటించేలా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దినట్లు కూటమ ప్రభుత్వం చెబుతోంది. అమరావతిని అత్యంత సౌకర్యవంతమైన నగరాల్లో ఒకటిఆ తీర్చి దిద్దుతూ, అత్యున్నత జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు,  ఆర్థిక సంపత్తితో అలరారేలా తాము నిర్మాణాలు చేస్తున్నామన్నారు.సుస్థిరత, రహదారుల అనుసంధానం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఆధునికతవారసత్వ పరిరక్షణ సామాజిక సమతుల్యత ఇలా అన్నీ కలిసి ఉండేలా ఈసారి నిర్మాణాలను డిజైన్ చేస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఐకానిక్ భవనాలు…

కూటమి ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి నవ నగరాలుగా రూపొందే అమరావతిలో విద్యవైద్యం, ప్రభుత్వ, క్రీడా, న్యాయ, ఆర్ధిక, పర్యాటక, మీడియా ఎలక్ట్రానిక్స్ విభాగాలకు వేటికి వాటికి వేర్వేరుగా నగరాలు ఉంటాయి. ఇన్నర్ రిగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, కోసం మలిదశ భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 44 వేల ఎకరాల భూ సేకరణ తొందరలోనే చేయనున్నారు.రాజధానిలో 30 శాతం పచ్చదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే నగరం గుండా పారే కృష్ణానది ప్రవాహానికి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు గ్రీన్, బ్లూ కాన్సేప్టులతో అమరావతి నిర్మాణం సాగనుంది.

అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్ లను నాలుగు జాతీయ రహదారులతో అనుసంధానిస్తారు. దీనికోసం గ్రిడ్ రోడ్‌ నెట్ వర్క్ పద్ధతిని అమలు చేస్తారు. తొలిసారిగా అమరావతిలో అన్ని రకాల కనెక్షన్లను, లైన్లనుఅండర్ గ్రౌండ్ లో నిర్మిస్తారు. డ్రైనేజీ,మంచినీరు, వరద నీరు,శుద్ధి చేసిన నీితోపాటు, కరెంటు, ఐసిటీ సరఫరా అంతా అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. ఇక 3300 కి.మీ. పొడవున సైక్లింగ్,వాకింగ్‌ ట్రాక్ లు ఏర్పాటు చేస్తారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ మోడల్ లో నిర్మిస్తారు. ఇక అసెంబ్లీ, సచివాలయం, హెచ్ ఓడీ ఆఫీసులు, హై కోర్టులు, అన్నీ ఐకానిక టవర్లుగా నిర్మస్తారు.

మౌలిక సదుపాయాల కల్పనకు 77 వేల కోట్లు ః అమరావతిలో మౌలిక వనరుల కల్పనకు 77వేల కోట్ల అంచనాతో ప్రణాళికలు రూపొందించగా, వీటిలో 49 వేల కోట్ల పనుల కోసం టెండర్లు పిలిచారు.ఐకానిక్ భవనాలతో పాటు నివా భవన సముదాయాల నిర్మాణానికి 12,700 కోట్లు, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ యుటిలిటీ కారిడార్లతో కూడిన రోడ్లు, వరద నిర్వహణ పనులు , ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం 16 వేల 200 కోట్లు ఖర్చు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. టెండర్లు పిలిచిన 49 వేల కోట్ల రూపాయల పనులకు 15 వేల కోట్లు కేంద్ర గ్యారంటీతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం ఇస్తున్నాయి. దీనికితోడు మరో 11 వేల కోట్ల రూపాయల హడ్కో రుణం సమకూరింది. వీటన్నింటికీ భూ కేటాయింపులు జరిపేయగా ఇంకా ప్రభుత్వం దగ్గర 4 వేల ఎకరాల మిగులు భూమి ఉంటుందని లెక్కలు గట్టారు.ఆమిగిలి భూమిని తనఖాకుపెట్టి తద్వారా వచ్చే సొమ్ముతో రాజధానిని పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ప్రధానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లో కూడా ఇదే చెప్పారు.

ఇప్పటికే 30వేల కోట్ల పెట్టుబడులను అమరావతి ఆకర్షించిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. పలు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అక్కడ ఏర్పాటవుతాయని, అలాగే హోటల్ రంగం విస్తరిస్తుందని, బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ, ఎస్ బీఐ, యూనియన్ బ్యాంక్, నాబార్డ్ కార్యాలయాల ఏర్పాటు జరుగుతుందని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటోంది.

వీటితో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కూడా ఏర్పాటవుతాయని సమాచారం.ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ కూడా అమరావతిలో ఏర్పాటు అవనుంది. వచ్చే మూడేళ్లలోనే రాజధాని అట్టహాసంా ప్రారంభత్సవం చేసుకుంటుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

గతంలో ఏంజరిగింది?

2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని కనీసం 30 శాతం కూడా పూర్తి చేయలేకపోయింది. నాసిరకం నిర్మాణాలు, అరకొర నిర్మాణాలతో రాజధానిని డెడ్ కేపిటల్ గా మార్చేసింది. ఐదేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క పక్కా నిర్మాణం కూడా లేదు. ఐకానిక్ టవర్లు, ప్రపంచంలోకే ఎత్తైన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల నిర్మాణాలని ఊదరగొట్టి చివరకు అరకొరగా, నాసిరకంగా రూపొందించారు.ఒక్క వర్షానికే కారిపోయేలా సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు వీగిపోయాయి. పోనీ అని అవీ పూర్తిగా నిర్మించలేదు.

రాజధాని నిర్మాణ మరో స్వాతంత్ర సమర ఉద్యమంతో పోల్చి రైతులను రెచ్చగొట్టి ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పంటలను నాశనం చేశారు. ఏ గ్యారంటీ, పరిహారం లేకుండానే రాజధాని రైతులు 34 ఎకరాల నిక్షేపంలాంటి పంటలను ప్రభుత్వానికి దారాదత్తం చేశారు. దిగుబడికొచ్చిన పంటలన్నీ ట్రాక్టర్లతో దున్నించి సర్వనాశనం చేశారు. కానీ రాజధాని మాత్రం కట్టలేదు. ప్రభుత్వాధికారుల కోసం అంటూ పిచ్చుక గూళ్లలాంటి భవనాలను కట్టారు. పోనీ అని వాటినైనా చెన్నైహైవేకు ఆనుకుని ఉన్న మంగళగిరి దగ్గర కట్టలేదు. ఇలా రాజధాని నిర్మాణాన్ని అడుగడుగునా నీరు కార్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పునర్నిర్మాణం పేరుతో మళ్లీ హడావుడి చేస్తోంది.ఈ సారైనా ఐదేళ్ల కాలంలో మెజారిటీ పనులు పూర్తి చేస్తారా? లేక గతంలో లాగే ఎటూ కాని నిర్మాణాలత కథ మొదటికి తెస్తారా అన్నది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.

రాజధాని నిర్మాణం నిధులు అసలు విభజన చట్టం ప్రకారం కేంద్రమే ఇవ్వాలి.కానీ గతంలో కేంద్రం విదిల్చినవి అరకొర నిధులే.. అప్పుడూ మోడీ యే శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో పనులు మొదలవుతున్నాయి. మరి ఈసారైనా ఏపీ ప్రజల కల నిజమవుతుందా? మరో ఐదేళ్ల తర్వాత సేమ్ పాత సీన్ రిపీట్ అవుతుందా? మోడీ, చంద్రబాబుల కూటమి సజావుగా ఐదేళ్లు పాలన చేసి ఆర్థిక సాయం ఇస్తేనే తెలుగు ప్రజల రాజధాని కల నెరవేరుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com