దిగ్గజాలను తీసుకొచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనికి కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించినా.. చెన్నై భవితవ్యం మారలేదు. వరుస ఓటములతో ఇప్పుడు ఆఫిషియల్‌గా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఐదు ట్రోఫీలు సాధించిన ఈ టీమ్.. ఈ సీజన్‌లో మాత్రం అత్యంత దారుణమైన ఆట తీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. అంతేకాదు ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న తొలి టీమ్‌గా నిలిచింది CSK.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 190 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించినా.. కింగ్స్ 19.4 ఓవర్లలోనే ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించడమే కాదు.. ఓ సీజన్‌లో సొంత మైదానంలో ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన టీమ్‌గా కూడా నిలిచింది. ఈ సీజన్‌లో చెపాక్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన CSK.. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఓడింది. నిజం చెప్పాలంటే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలను ఇప్పటికే వదిలేసుకుంది. ముంబైతో మ్యాచ్ ఓడిన తర్వాత ధోనీ కూడా ఇదే మాట చెప్పాడు. వచ్చే సీజన్ కోసం మంచి టీమ్‌ను తయారు చేస్తామన్నారు ధోని.
చెన్నై ప్లే ఆఫ్స్ చేరాలంటే..
చెన్నై ప్లే ఆఫ్స చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. ఈ సీజన్‌లో CSK ప్లే ఆఫ్స్ చేరడానికి వంద శాతం అవకాశం లేదు. చెన్నైకి ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుక్కి నాలుగు మ్యాచ్ లు గెలిచినా చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్ళే చాన్స్ లేదు.