30.5 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

మాకెందుకొచ్చిన గొడవ… మేం కల్పించుకోం…

  • భారత పాక్ యుద్ధంపై అమెరికా తాజా ప్రకటన
  • ఇద్దరూ వెనక్కు తగ్గాలి… జే.డి. వాన్స్
  • ఖండాంతర యుద్ధాలపై మా జోక్యం తగదు
  • ఎవరికీ ఆపేయమని చెప్పలేని స్థితి మాది
  • ఉద్రిక్తతలు తగ్గుతాయనే భావిస్తున్నామనన వాన్స్
  • పాకిస్థాన్ తాజా దాడితో బోర్డు తిప్పేసిన అమెరికా
  • గతంలో యుద్ధం అంటూ వస్తే భారత్ పక్షమేనన్న పెద్దన్న
  • ఇప్పుడు మాట మార్చేసిన అగ్రరాజ్యం
  • అమెరికా వ్యాఖ్య వెనుక వ్యూహముందా?

తగిలించి తగువు చూసే అమెరికా తన వైఖరిని మార్చుకుంది. భారత, పాకిస్థాన్ మధ్య యుద్ధంపై తాము స్పందించేది లేదని తాజాగా ప్రకటించింది.జమ్మూకశ్మీర్, పఠాన్ కోట్,గుజరాత్ మిలటరీ స్థావరాలపై దాడులకు పాకిస్థాన్ ప్రయత్నించిన వైనంపై అమెరికా ఉపాధ్యక్షుడు జే.డి. వాన్స్ ఈ విధంగా స్పందించారు. భారత్ పై జరిగిన దాడికి ఆ దేశాన్ని తగ్గి ఉండమని చెప్పలేమని, అలాగే పాకిస్థాన్ ను కూడా తలొగ్గమని చెప్పలేమని ఆయనన్నారు. అయితే రెండు దేశాలు ఉద్రిక్త పరిస్థితులను చల్లారేందుకు దోహద పడాలని మాత్రమే తమ దేశం చెబుతుందన్నారు. అంతేతప్ప యుద్ధం విషయంలో తమ జోక్యం ఉండదని అన్నారు.ప్రస్తుత సంకట స్థితిని దౌత్య మార్గాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.ప్రంపంచ దేశాల మధ్య ఖండాంతర యుద్ధాలపైనా తమ జోక్యం ఉండబోదని ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

ఇది మరింత ముదిరి అణు యుద్ధానికి దారి తీయరాదన్నదే తమ అభిమతమని వాన్స్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఆ ప్రమాదం లేదని తాము భావిస్తున్నామని అమెరికా ప్రకటించింది. పాకిస్థాన్ మన కీలకనగరాలను టార్గెట్ చేసి దాడి చేస్తోందన్న సమాచారాన్ని మన వాయురక్షణ వ్యవస్థ సిగ్నల్స్ ద్వారా ముందే కనిపెట్టి ఆ దాడులను నిర్వీర్యం చేసింది.

ప్లేటు తిప్పేసిన ట్రంప్‌…

గతంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తనకు రెండు దేశాలు సమానమే అయినా.. యుద్ధం అంటూ వస్తే తమ మద్దతు భారత్ కేనని, పాకిస్థాన్ ను తాము సమర్ధించబోమని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన మాట మార్చారు. భారత్ పై పాకిస్థాన్ ఎదురుదాడికి విఫలయత్నం చేసిన ఉదంతం తర్వాత  ట్రంప్ మాట మారింది.

టిట్ ఫర్ టాట్ ధోరణి వద్దు..

రెండు దేశాలు ఈ టిట్ ఫర్ టాట్‌ పంథా మానుకోవాలని హితవు చెప్పారు. ఉద్రిక్తతలు సద్దుమణగడానికి తన సహాయం అవసరమైతే చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికాకు రెండు దేశాలూ సమానమేనని, ఇద్దరు దేశాధినేతలను తాను ఎరుగుదుననీ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com