34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

విఘ్నేష్‌ ఎవరీ కుర్రాడు? ముంబైకి ఎలా చిక్కాడు?

విఘ్నేష్‌ పుతూర్.. చెన్నైకి చెమటలు పట్టించిన ఈ కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్. ఐపీఎల్ పుణ్యమా అని దేశంలోని యంగ్ టాలెంట్‌కు గుర్తింపు దక్కుతుంది. అందులోనూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయితే దేశానికి అనేక అణిముత్యాలను అందించింది. జస్‌ప్రీత్ బుమ్రా, హర్దీక్ పాండ్యా, తిలక్ వర్మ.. ఇలా అనేక మంది ఇక్కడి నుంచే దేశానికి వెళ్లారు. ఇప్పుడీ లిస్ట్‌లో విఘ్నేష్‌ పుతూర్ కూడా చెరతాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే గండ బేరుండాలుగా తలపించే సూపర్ కింగ్స్ ప్లేయర్స్‌ ముగ్గురు ప్లేయర్స్‌ను తన తొలి మ్యాచ్‌లోనే ఔట్ చేశాడు విఘ్నేష్.

నిజానికి విఘ్నేష్‌ ఈ మ్యాచ్‌కంటే ముందు ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. అతను ఆడింది కేవలం కేరళ క్రికెట్ టీల్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే. కానీ అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన ముంబై.. రూ.30 లక్షలకు దక్కించుకుంది. SA20 టోర్నీలో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌ టీమ్‌తో నెట్‌ బౌలర్‌గా వెళ్లాడు విఘ్నష్‌. అక్కడే రషీద్ ఖాన్, మలింగ లాంటి స్టార్ల సహచర్యం అతడి లైఫ్‌ను మార్చేసింది. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్న రోహిత్, సూర్య, తిలక్ అతడితో అంత ఈజీ కాదని తేల్చారట. అందుకే ఫస్ట్ మ్యాచ్‌లోనే అతడికి ఛాన్స్ ఇచ్చింది ఎంఐ. ఆ చాన్స్‌ను పక్కగా ఉపయోగించుకున్నాడు విఘ్నేష్‌. 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన ఈ ప్లేయర్ ఓ మధ్య తరగతికి చెందినవాడనే చెప్పాలి. కేరళలోని మలప్పురానికి చెందిన విఘ్నేష్‌తండ్రి సునీల్ కుమార్ ఓ ఆటో డ్రైవర్. తల్లి బిందూ ఓ సాధారణ గృహిణి. అయినా కానీ విఘ్నేష్‌ క్రికెట్ జర్నీకి వాళ్లు అడ్డు చెప్పకుండా అండగా నిలిచారు. కేరళ క్రికెట్ లీగ్ ఆడుతున్నప్పుడే MI స్కౌటింగ్ టీమ్‌ అతడిపై ఫోకస్ చేసింది. అతడిని చూస్తే కుల్దీప్ యాదవ్‌ను చూసినట్టే ఉందని క్రికెట్ పండితులు చెప్తున్నారు. అతడికి చాలా ఫ్యూచర్ ఉందంటున్నారు. మరి తొలి మ్యాచ్‌లోనే సంచలనాలు సృష్టించిన విఘ్నేష్‌ అదే జర్నీని కంటిన్యూ చేస్తాడా? లేదా? అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com