అంతర్జాతీయ వేదికల్లో పనికట్టుకొని మరీ కశ్మీర్‌పై తప్పుడు ప్రచారం చేసే పాకిస్తాన్ కు భారత్ ఈసారి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈసారి ఓ కొత్త ప్రశ్న వేసింది. కశ్మీర్ గురించి పక్కన పెట్టి.. మీరు ఆక్రమించుకున్న కశ్మీర్‌ను ఎప్పుడు ఖాళీ చేస్తారని ప్రశ్నించింది.
యూనైటెడ్ నేషన్స్‌లో జమ్ము కశ్మీర్ అంశాన్ని లెవనెత్తారు పాక్ ప్రతినిధి య్యద్ తారిఖ్. దీంతో భారత్ ఫుల్ ఫైర్ అయ్యింది. భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగమైన జమ్ము కశ్మీర్ విషయంలో పాక్ పదే పదే ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు భారత ప్రతినిధి హరీష్. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజమైపోదన్నారు. పాక్ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని వెంటనే ఖాళీ చేయాల్సిందే అన్నారు.
నిజానికి ఈ మధ్యే కశ్మీర్ గురించి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఉగ్రదాడులు తగ్గాయన్నారు. 2004-2014 మధ్య 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగగా… 2014 -2024 మధ్య ఆ సంఖ్య 2,242కి తగ్గిందన్నారు అమిత్ షా. కశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయని.. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా అణచివేశామన్నారు అమిత్ షా. ఈ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ వేదికలపై మరోసారి తన గొంతును పెంచింది పాకిస్థాన్.