23 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

నా ఫేవరెట్‌ మిస్‌ వరల్డ్‌ ఎవరంటే? – పొలిటెంట్‌ మీడియాతో సోనూసూద్‌

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ ఈవెంట్‌కు జ్యూరీ మెంబర్‌గా సోనూసూద్‌ పాల్గొంటున్నారు. మిస్‌ వరల్డ్‌ జడ్జిమెంట్‌లో భాగం కానున్న సోనూసూద్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా పొలిటెంట్‌ మీడియాకు స్పెషల్‌ ఇంటర్య్వ్యూ ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనడం తనకు గర్వంగా ఉందన్నారు. మిస్ వరల్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం తాను చాలా కష్టపడి సాధించానని, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని తెలిపారు.

హైదరాబాద్ తనకు ఎంతో ప్రత్యేకమని, తన సినీ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తాను చేసిన పెద్ద సినిమాలు కూడా ఇక్కడే షూటింగ్‌ జరిగాయని సోనూసూద్‌ వివరించారు. ఇప్పుడు మిస్ వరల్డ్ కూడా ఇక్కడ జరగడం గర్వంగా ఉందన్నారు.

మిస్‌వరల్డ్‌ అంటే.. కేవలం అందానికి మాత్రమే పరిమితం కాకుండా, ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే అర్థవంతమైన అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఫిలాంత్రోపిస్ట్‌గా తన ప్రయాణం ఎంతో విశేషమైందని, ముఖ్యంగా తెలంగాణలో కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను మద్దతు ఇస్తున్న గొప్ప ప్రయోజనాల్లో ఒకటి, బ్రెస్ట్ కాన్సర్ సర్జరీల మిషన్ అని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఏ మహిళ అయినా సరే, శస్త్రచికిత్స జరిగి, మరుసటి రోజు ఆమె ఇంటిలోనే బ్రేక్‌ఫాస్ట్ చేయగల స్థాయిలో తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉందన్నారు.

తాను ఈసారి మిస్‌ వరల్డ్‌కు జ్యూరీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్న సోను సూద్, ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని అని అన్నారు. కంటెస్టెంట్లెవరూ నిరాశ చెందకుండా, అందరూ తమ ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. స్టేజ్ పై ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం వారికి ఉండాలని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, కంటెస్టెంట్లను ఇంకా కలవలేదని, కానీ కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

తన తదుపరి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు వెల్లడించారు. స్క్రిప్ట్ పూర్తయిందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. తెలుగులో మరిన్ని ఆసక్తికరమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

తాను నటించిన ‘జోధా’ సినిమాలో సహనటి ఐశ్వర్యారాయ్‌ మిస్ వరల్డ్ తనకు ఫేవరెట్ అని అన్నారు. గతంలో ఎప్పుడూ మిస్ వరల్డ్ ఈవెంట్‌కు హాజరుకాలేదని, ఇది తన తొలి ప్రత్యక్ష అనుభవమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఓ కాల్ వచ్చిన వెంటనే తాను ఈ కార్యక్రమంలో భాగమయ్యానని చెప్పారు. తెలంగాణలో ఇది జరుగుతుండడం వల్ల తనకు మరింత కనెక్ట్‌ అయ్యిందన్నారు.

తెలుగు ప్రేక్షకుల కోసం తాను నటించిన అరుంధతి సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌.. “వదల బొమ్మాళీ!” అనే డైలాగ్‌ తనకు ఫేవరెట్‌ అన్నారు.

సోనూసూద్‌ ఫుల్‌ ఇంటర్వ్యూ ఈ కింది లింకులో చూడొచ్చు…

https://www.youtube.com/watch?v=UJJIavRxnOs

 

 

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com