ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని.. ఇంకా కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ ల్రైబరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రాజకీయ పార్టీలకు వివరించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తృణముల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బందోపాద్యాయ, డీఎంకె తరపున టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆయనే ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.
జైహింద్ వందేమాతరం సార్ ఆపరేషన్ సింధుర్ లో మా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు పదిమంది భారతదేశ కోసం చవడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం సార్