దుబాయ్ వేదికగా ఉండటం భారత్‌కు అడ్వాంటేజ్.. ఇది చాలా మంది ఇతర దేశ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు చేస్తున్న ఆరోపణలు. కానీ అసలు నిజం వేరే అంటున్నారు కొందరు ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే భారత్‌కు ఎన్ని సానుకూల అంశాలు ఉన్నాయో.. కివీస్‌కు కూడా అన్నే సానుకూల అంశాలున్నాయనేది ఇప్పుడు తెరపైకి వచ్చిన విషయం.
దుబాయ్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 44 పరుగుల తేడాతో భారత్‌పై ఓడింది. ఈ ఓటమితో చాలా పాఠాలనే నేర్చుకుంది ఆ టీమ్. ఇది ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు చాలా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. దుబాయ్ పిచ్‌లపై భారీ స్కోర్ చేయడం చాలా కష్టమైన పనే అనేది రెండు టీమ్స్‌కు తెలిసిందే.
ఇక టీమ్ పరంగా చూసుకున్న కివీస్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు సమానంగా ఉన్నారు. మ్యాట్ హెన్రీ, విలియమ్ పేస్ అటాక్‌ను లీడ్ చేస్తున్నారు. హెన్రీ ఇప్పటికే టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇక శాంట్నర్ తన స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌లో కీలక వికెట్లు తీస్తూ పోతున్నాడు. ఇక బ్రాస్‌వెల్ కూడా కివీస్ గెలుపులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక గ్లెన్ ఫిలిప్స్ కూడా తన బౌలింగ్, వికెట్లు తీయడం చూస్తే పార్ట్ టైమ్ బౌలర్‌గా ఏ మాత్రం కనిపించడం లేదు. ఇక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లను రచిన్ రవీంద్ర కూడా ఇబ్బందులు పెడుతున్నాడు. వరుణ్, కుల్దీప్ కేవలం బౌలింగ్ మాత్రమే వేయగలరు. అదే ఫిలిప్స్, రచిన్ మెయిన్ బ్యాటర్లు కాగా.. బౌలింగ్ కూడా వేస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటిని చూస్తే ఇండియా కంటే ఎక్కువ సానుకూల అంశాలు కివీస్‌కే ఉన్నట్టు కనిపిస్తోంది.
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.. పేస్ దళం యాక్టివ్‌గా ఉంది.. స్పిన్నర్లు మ్యాచ్‌లను తిప్పేస్తున్నారు.. ఇవన్నీ కాకుండా దుబాయ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. కానీ విమర్శలు మాత్రం కేవలం భారత్‌పైనే చేస్తున్నారు.