24.5 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

ఫ్రీ బస్సుకు కొర్రీలు

కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఇచ్చిన మాటను తప్పనుందా..? తెలంగాణలో ఈ పథకం కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడాన్ని చూసి, మెల్లగా ఈ పథకానికి పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనమండలిలో ప్రసంగం అనుమానాల్ని బలపరుస్తోంది. మండలిలో ఆమె మాట్లాడుతూ ‘ఉచిత బస్సు పథకం ఏ జిల్లాకు సంబంధించిన మహిళలు, ఆ జిల్లాలో పర్యటించడానికి మాత్రమే. ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పర్యటించడానికి కాదు, అలా మేము ఎప్పుడూ చెప్పలేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఒక చోట నుండి మరో చోటకు ఎక్కడికి వెళ్లినా ఉచితమే.

ఏపిలో పథకం ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారు అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పథకంపై ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉండబోతుందో మంత్రి వ్యాఖ్యలతో అర్థం అవుతుంది. సూపర్ 6 లో ప్రస్తుతం సామజిక పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ పథకాలు అమలు అయ్యాయి. మిగిలిన పథకాలలో అత్యంత కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి మే నెల నుండి ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే అసెంబ్లీలో పలుమార్లు కూటమి నేతలు ప్రకటించారు. ఉచిత బస్సు పథకంపై ఇచ్చిన మాట మీద నిలబడుతారా లేదా అనేది చూడాలి. ఆరు నెలలుగా జనాలు కూడా ఈ పథకాల గురించి అడగలేదు.

కొత్త ప్రభుత్వం కదా, కాస్త సర్దుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఆరు నెలల తర్వాత ఈ పథకాలు గురించి అడగడం మొదలు పెట్టారు. జనాల్లో నెగెటివిటీ పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మీద జనాలు ఒత్తిడి చేయడం లేదు…  ‘తల్లికి వందనం’ పథకంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలకు ఈ పధకాన్ని ప్రారంభించాడు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు దాటి 9 వ నెలలోకి అడుగుపెడుతున్నా అతీగతి లేదు.

బడ్జెట్ లో ఈ పధకానికి 9 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. మే నెలలో ఒక కుటుంబంలో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంత మందికి 15 వేల రూపాయిలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తే కూటమికి తిరుగు ఉండదు. చేయకపోతే మాత్రం ఘోరమైన నెగటివిటీని ఎదుర్కోవల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన నెగటివిటీ ఉందని రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అందరికీ అర్థమైంది, కూటమి ప్రభుత్వం ఆ స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com