34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ట్రంప్ ముందే మస్క్, రూబియో డైలాగ్ వార్..

అమెరికా అధ్యక్ష భవనం ఇప్పుడు డైలాగ్ వార్స్‌ కు కేరాఫ్‌గా నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డైలాగ్ వార్ సీన్ మర్చిపోకముందే అధ్యక్ష భవనంలో మరోసారి డైలాగ్ వార్ జరిగింది. అయితే ఈసారి ట్రంప్ ముందే మాటల యుద్ధం చేసుకున్నారు ఎలాన్ మస్క్ ఇంకా ఆ దేశ విదేశాంగమంత్రి మార్కో రూబియో.

ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాల కోత కంటిన్యూగా జరుగుతోంది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ట్రంప్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని కీలక వ్యక్తులు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే డోజ్ సలహాదారు మస్క్ రూబియోను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తాను పనిచేయని వారిని గుర్తించి ఇంటికి పంపిస్తున్నానని.. కానీ రూబియో మాత్రం ఎవ్వరిని తొలగించలేదని మస్క్ అన్నాడు. దీంతో రూబియో కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మనం అధికారం చేపట్టగానే 1500 మంది ముందస్తు పదవి విరమణ తీసుకున్నారని.. వారిని ఉద్యోగంలోకి తీసుకొని మళ్లీ తొలిగించాలా? అంటూ సెటైర్ వేశారట రూబియో. నువ్వు టీవీలో మంచివాడిలాగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నావంటూ మస్క్ వెంటనే అనడంతో.. అప్పటి వరకు వింటూ ఉన్న ట్రంప్ వారిద్దరిని సముదాయించారట. డోజ్ కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే అని.. రూబియో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారని ట్రంప్ అతడిని వెనకేసుకొచ్చారు.

ఈ భేటీ అనంతరం ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. వారిద్దరు చక్కగా కలిసిపోయారని.. నేను అక్కడే ఉన్నాను.. వారిద్ధరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com