34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

కేంద్ర బడ్జెట్‌లో ఏవి చౌక? ఏవి కాస్ట్ లీ?

తగ్గేవి :

– మొబైల్స్,మొబైల్‌ ఫోన్ బ్యాటరీల ధరలు తగ్గుతాయి
– వస్త్రాలు, ఎలక్ట్రికల్‌ వాహనాలు చౌక
– మోటార్ సైకిళ్ల ధరలు స్వల్పంగా తగ్గుతాయ్
– సముద్ర ఉత్పత్తులు, చెప్పుల ధరల తగ్గింపు
– హ్యాండీ క్రాఫ్ట్స్ ఉత్పతుల రేట్లు తగ్గింపు
– క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు

పెరిగేవి:

– ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు
– రెడిమేడ్ గార్మంట్స్

ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ మొత్తం గా చూస్తే మధ్యతరగతి, పేదలు, యువతని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్‌ గా కనిపిస్తోంది. ఈ సారి బడ్జెట్‌ లో ఎగుమతులు, సేవల రంగంలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం ఉందో ఇప్పుడు చూద్దాం..కొన్ని కీలక రంగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్ల మొబైళ్లు కారు చౌక కానున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు ప్రియం కానున్నాయి. రెడిమేడ్ గార్మెంట్స్ ధరలు కూడా పెరుగుతాయి. ఎలక్ట్రికల్‌ వాహనాల ధరలు తగ్గుతాయి.

సేవల రంగం విస్తరణ :

ఆరోగ్య రంగానికి మెరుగైన ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాదు.. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి నివారణకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్లు బడ్జెట్‌ కేటాయింపులను చూస్తే అర్ధమవుతుంది. క్యాన్సర్ వ్యాధి నివారణకు దేశవ్యాప్తంగా జిల్లాకో ఆస్పత్రిని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే క్యాన్సర్ మందులు, ఇతర అరుదైన వ్యాధులకు చెందిన 36 లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్ ధరలను తగ్గించారు.వాటిని బేసిక్ కస్టమ్ప్ డ్యూటీ నుంచి మినహాయించారు.

కీలక ముడి ఖనిజాల రేట్లు తగ్గింపు :

ఎలక్ట్రికల్‌ గూడ్స్ తయారీలో వినియోగించే లీథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, కోబాల్డ్ స్క్రాప్ లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల ఎలక్ట్రికల్ వాహనాల ధరలు తగ్గుతాయి.

ఎల్ ఈడీ, ఎల్సీడీ టీవీలు,మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ల్యాప్ టాప్ ల ధరలు తగ్గుతాయి. హెడ్‌ సెట్లు, మైక్రోఫోన్‌లు, రిసీర్లు, యూఎస్‌ బి కేబుళ్ల తయారీకి వినియోగించే ముడి వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తీసేశారు. దీనివల్ల లోకల్‌ గూడ్స్ తయారీ పెరుగుతుంది.

1600 సిసి ఇంజన్ కెపాసిటీ కల మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పది శాతం తగ్గించారు. కాబట్టి ఆ మేరకు ధరలు స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంది.అలాగే బైక్స్ పై గతంలో ఉన్న 50 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఇప్పుడు 30 శాతానికి కుదించారు.

అలాగే కొన్ని వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. భారీ స్క్రీన్ల తయారీకి వినియోగించే ముడి ఖనీజం పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పదినుంచి 20 శాతానికి పెంచారు.

ఇక రెడిమేడ్ గార్మెంట్ల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని స్వల్పంగా పెంచడంతో దుస్తుల ధరలు కొద్దిగా పెరిగే అవకాశముంది.

పరిశోధనలు, అభివృద్ధిరంగంపైనా, MSME లపైనా,మూల ధన వస్తువులపై ఫోకస్ పెట్టడం ద్వారా దీర్ఘకాలిక పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com