- భారత ,అమెరికా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఘటన
- రిపోర్టర్ ప్రశ్న అర్ధం కాలేదంటూ దాటవేత
- మరో రకంగా అడగబోతే ఉచ్ఛారణ అర్ధం కావట్లేదన్న ట్రంప్
- ప్రశ్నను మధ్యలోనే కట్ చేసిన అధ్యక్షుడు
- ఉగ్రవాదం పై ప్రశ్నకూ అదే రకం స్పందన
- అన్నీ భారత్ మంచి కోరే చేస్తామని ప్రకటన
- గతంలోనూ ఓ రిపోర్టర్ ప్రశ్న తిరస్కరణ
ప్రపంచంలోని అందరికంటే అమెరికన్ల యాక్సెంట్ అర్దం చేసుకోవడం, పలకడం కూడా కొంత కష్టమే.. వీసా టెస్టుల్లో ఇలాంటి సందర్భాల్లోనే మన భారతీయులు తిరస్కణకు గురవుతుంటారు. అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడికి మీడియా భాష, ఉచ్ఛారణ అర్ధం కాలేదంటే నమ్మగలమా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి వింత వైఖరే ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్, మోడీ జాయింట్ గా అటెండ్ అయిన ప్రెస్ కాన్ఫరెన్సులో అందరి ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ట్రంప్ ఒకరిద్దరికి మాత్రం అదీ ఉగ్రవాదం, సంఘవిద్రోహక శక్తులు అన్న పై మాత్రం ప్రశ్న అర్ధం కాలేదంటూ జవాబు చెప్పకుండా మాట దాటేశారు.
అర్ధం కాలే…
మీడియాతో భేటీ సందర్భంగా ఓ జర్నలిస్టు అమెరికాలో భారత వ్యతిరేక గళాలను, లేదా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటారు అని ప్రశ్నించాడు. అయితే ఆ విలేకరి ప్రశ్న తనకు అర్ధం కానట్లు మొహం పెట్టారు ట్రంప్. అయితే ఆ రిపోర్టర్ మరో సారి తన ప్రశ్న వేయబోతే మీ భాష, ఉచ్ఛారణ అర్ధం చేసుకోవడం కష్టం గా ఉంది అంటూ ఆ ప్రశ్నను మధ్యలోనే దాటవేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు సహకారం అందిస్తారా? అని అడగగా దానికి కూడా అర్ధం కానట్టే మొహం పెట్టారు. గతంలో బైడెన్ యంత్రాంగం భారత దర్యాప్తు సంస్థలపై అనేక ఆరోపణలు చేసింది. దీనిపై ఇంటెలిజెన్స్ డైరక్టర్ తులసీ గబ్బార్డ్ తో చర్చిస్తారా అని మరోసారి అదే రిపోర్టర్ అడిగాడు. బైడన్ తో భారత్ ప్రభుత్వానికి మంచి సంబందాలు లేవు.. అందుకు చమురు, గ్యాస్ అమ్మేందుకు ఆయన నిరాకరించడమే కారణం అన్నారు. కరడు గట్టిన ఉగ్రవాది రాణాను బారత్ కు అప్పగిస్తున్నామని, చాలా క్రూరమైన మనిషిని మీకు అప్పగిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. భారత్ మంచి కోరి సాయం చేస్తాం అంటూ ముగించేశారు.
జర్నలిస్టుల ప్రశ్నలను మధ్యలోనే అర్ధం కాలేదని తిప్పి కొట్టడం ట్రంప్ కు కొత్తేం కాదు. గతవారం కూడా ఆప్ఘనిస్తాన్ కు చెందిన ఓ లేడీ రిపోర్టర్ తాలిబాన్ల విషయమై ప్రశ్నించినప్పుడు ..మీ గళం అద్భుతం..ఉచ్ఛారణ ఇంకా బాగుంది. కానీ మీరడిగే ప్రశ్న ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు అంటూ దాటేశారు.