-
దాడి చేసే తీరు, టార్గెట్, టైమింగ్..ఛాయిస్ మీదే
-
త్రివిధ దళాలకు ప్రధాని పూర్తి స్వేచ్ఛ
-
ప్రధాని ఇంట రాజ్ నాథ్, దోవల్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ భేటీ
-
మోడీతో రెండో రోజూ కీలక సమావేశం
-
సమావేశంలో దోవల్, రాజ్ నాథ్, సీసీఎస్ కమిటీ
-
పాకిస్థాన్ పై యాక్షన్ ప్లాన్ పై తర్జన భర్జనలు
-
దౌత్యపరంగా ఇప్పటికే దాయాదికి షాక్ ఇచ్చిన భారత్
-
యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువ అంటున్న నిపుణులు
-
భారత్ రియాక్షన్ తో పాక్ లో వణుకు
-
ఆస్పత్రిలో చేరిన పాక్ ప్రధాని షెహబాజ్
పాకిస్థాన్ కి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి టార్గెట్ ను,టైమింగ్ ను,దాడికి ఎంచుకున్న పద్దతిపైనా పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధాని త్రివిధ దళాలకు ఆదేశాలిచ్చారు. ఏం చేస్తారో మీ ఇష్టం.. పాకిస్థాన్ కి తగిన బుద్ధి చెప్పండి అంటూ భద్రతా బలగాలకు ప్రధాని కీలక సూచనలు చేశారు. హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ త్రివిధ దళాదిపతులకు ఉత్తర్వులందించారు. రెండు రోజులుగా ప్రధాని త్రివిధ దళాధిపతులతో, రక్షణ మంత్రితో, రక్షణ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ తో
విడతల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. ఎప్పటిప్పుడు సరిహద్దుల దగ్గరి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. గత వారంలో కేబినెట్ సబ్ కమిటీ ప్రధానితో సమావేశమవడం ఇది రెండో సారి.ఎంతో అత్యవసరమైతే తప్ప ఇలాంటి సమావేశాలు జరగవు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈభేటీల్లో పాల్గొంటున్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేంద్ర రవాణా మంత్రి, ఆరోగ్య శాఖా మంత్రి, వ్యవసాయ మంత్రి, రైల్వే మంత్రి కూడా ఈ భేటీలో పాల్గొనడం విశేషం.
పెహల్గాం దాడికి నిరసనగా పాకిస్థాన్ దేశీయుల వీసాలు రద్దు చేసి స్వదేశం పంపేయడం, కేవలం పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులను మాత్రమే అదీ దీర్ఘకాలిక వీసాలపై ఉన్న వారిని మాత్రమే అనుమతించడం, అట్టారీ-వాఘా బోర్డర్ మూసేయడం లాంటి నిర్ణయాలు భారత్ తీసుకుంది. అంతేకాదు ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఇద్దరి ఇళ్లు పేల్చేసింది. ఉగ్రవాదుల ఈ దాడి వెనక పాకిస్థాన్ ప్రోద్బలం ఉందన్న ఆధారాలను ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఉంచింది భారత్.
ఆస్పత్రిలో చేరిన పాక్ ప్రధాని..
మరోవైపు పాకిస్థాన్ కి భారత్ గర్జించకముందే యుద్ధభయం పట్టుకున్నట్లుంది. ముందు రెచ్చగొట్టి, కవ్వించిన పాకిస్థాన్ తీరా మన దేశం యుద్ధానికి, ప్రతీకార చర్యలకు సిద్ధపడుతుంటే మాత్రం వణికి పోతోంది. దేశ అంతర్గత పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని అస్వస్థత పాలై రావల్పిండిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ వార్తను థృవీకరిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఒక లేఖ విడుదల చేసింది. అయితే ఆయనకున్న అనారోగ్యం ఏమిటన్నది మాత్రం స్పష్టం చేయలేదు. సోమవారం రాత్రే షేహబాజ్ ఆస్పత్రిలో చేరినా పాకిస్థాన్ మాత్రం మీడియాకు ఈ వార్తలు రిలీజ్ చేయలేదు. అయితే షెహబాజ్ అనారోగ్యం వివరాలను మాత్రం పాక్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. యుద్ధం నేపధ్యంలో మరోవైపు సరిహద్దుల్లో ఉన్న వారు కూడా బంకర్లలోకి షిఫ్టవుతున్నారు. సింధు జలాలను పంజాబ్ కు తరలిస్తుండటంపై ఇప్పటికే అక్కడ సింధు రాష్ట్ర ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు