37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

అధ్యక్షుడా అయితే ఏంటి? ట్రంప్‌కు షాకిచ్చిన కోర్టు

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చింది న్యూయార్క్ కోర్టు. హష్‌ మనీ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టేసేందుకు న్యూయార్క్‌ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్‌హట్టన్‌ జడ్జి జువాన్‌ మర్చన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్‌కు రక్షణ ఉండదని తేల్చి చెప్పింది. దీంతో కాబోయే అధ్యక్షుడికి షాక్ తగిలినట్టైంది.

ఇంతకి కేసు ఏంటంటే…

పోర్న్ స్టార్ స్టార్టీ డేనియల్స్‌ సంచలనల ఆరోపణలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో శృంగారం చేశారన్నారు. ఈ విషయాన్ని బయటపెట్టకూడదంటూ తనను బెదిరించారన్నారు. అంతేగాకుండా 2016 ఎన్నికలకు ముందు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్‌ చెప్పారు. ఆ తరువాత ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనని ప్రకటించారు. ట్రంప్ మాజీ లాయర్‌ మైఖేల్ కోహెల్ 1,30,000 డాలర్లు డేనియల్స్‌కు ముట్టజెప్పారని, తరువాత ఆ మొత్తాన్ని కోహెన్‌కు ట్రంప్ అందజేశారన్నారు. దీంతో ట్రంప్‌పై విచారణ ప్రారంభమైంది. నాలుగేళ్ల పాటు కొనసాగిన ఈ విచారణలో ట్రంప్‌ దోషిగా కూడా తేలారు. అయితే శిక్ష మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

నెక్ట్స్‌ ఏం జరగబోతుంది..?

నిజానికి ఇప్పటికే శిక్ష ఖరారు కావాల్సి ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో తన అమ్ములపొదిలోని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చూశారు. క్రిమినల్‌ విచారణ ఎదుర్కోకుండా అధ్యక్షులకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కోర్టును ఆశ్రయించారు ట్రంప్. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. కానీ రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. మరి నెక్ట్స్‌ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. శిక్ష ఎప్పుడు వేస్తుంది? ఎంతకాలం వేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com