37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

కాకినాడ షిప్ పై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం

కాకినాడలో నిలిపివేసిన స్టెల్లా షిప్‌పై మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో పట్టుకున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే అవకాశం ఉంది. ఇటీవల షిప్‌లో సేకరించిన 26 బియ్యం శాంపిల్ ఫలితాలను కలెక్టర్ వెల్లడించనున్నారు.

కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు నూక బియ్యం ఎగుమతులు ఆగిపోవడంపై కేంద్రప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తనిఖీల పేరుతో అధికారులు బియ్యం ఎగుమతులకు ఆటంకం కల్పించడంపై కలెక్టర్‌కు కేంద్రం లేఖ రాసింది. ఏపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే విషయంపై చర్చానీయాశంగా మారింది.

కాకినాడ్ షిప్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు అత్యుత్సాహం ప్రదర్శించారని అమరావతి, ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి పెద్దలు, జిల్లా నేతల మధ్య ఉన్న వైరుధ్యాలతో మొదలైన అంతర్గత కలహాలు షిప్ ను ఆపేసే వరకు వెళ్లాయని అంటున్నారు.

ఇలాంటి వ్యవహారాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు మొట్టికాయలు వేసినట్టు విశ్వసనీయ సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com