- మైసమ్మ, కాముని చెరువులను సందర్శించిన హైడ్రా కమీషనర్
- పాతవాటి జోలికి పోమని స్పష్టం చేసిన రంగనాథ్
హైడ్రా ఏర్పడక ముందు ఉన్న కట్టడాల జోకి పోమని, హైడ్రా ఎర్పడిన తరువాత నిర్మించిన అక్రమ కట్టడాలంన్నింటినీ కూల్చివేస్తామని కమీషనర్ రంగనాథ్ స్పష్టం చేవారు. మంగళవారం హైడ్రా కమీషనర రంగనాథ్ మైసమ్మ చెరువు, కాముని చెరులను సందర్శించారు. ఆ రెండు చెరువులపై ఇటీవల జరిగిన ఆక్రమణలన్నింటినీ కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెరువు కట్టల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాసవీ సరోవర్ డెవలపర్లు తప్పనిసరిగా 17 మీట్లర్ల వెడల్పుతో నాలాను నిర్మిస్తే తప్ప నిర్మాణాలు కొనసాగించవద్దని కమిషనర్ ఆదేశించారు. కాముని చెరువు, మైసమ్మ చెరువల మధ్య నాలానే కీలకమైన లింక్ గా ఉంటుందన్నారు.
కాగా, సరస్సుల్లోని నీటి మట్టలను తొలగించేందుకు ఎర్త్ మూవర్లు, లారీలను మోహరించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సరస్సు కట్టలో కొంత భాగం తొలగిపోయింది. ఆక్రమణలో ఉన్న నీటి కుంటను తొలగించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే కట్టను పరిరక్షించేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.