- 25 లక్షల తక్షణ సహాయం
- నేనూ నా టీమ్ పిల్లలకు తోడుగా ఉంటాం
సంధ్యా ధియేటర్ లో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చెందటం నన్ను తీవ్రంగా కలచివేసిందని హీరో అల్లు అర్జున్ బాధను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని తెలిసిన వెంటనే నేను చాలా షాక్ కు గురయ్యానన్నారు. మేడు సినిమాలు తీసేదే జనాలు వచ్చి ఆ మూడు గంటలూ ఎంజాయ్ చేసి వెళాతారని అటువంటిది ఇలాంటి విషాదకర సంఘటన జరగడం చాలా బాధాకరమని అర్జున్ అన్నారు. ఇప్పుడు మేడు ఏం చేసినా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మాత్ర పూడ్చలేమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలబడతానని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా నేను 25 లక్షల రూపాయలు తక్షణ సహాయం అందిస్తానని తెలిపారు. అలాగే వైద్య ఖర్చులు కూడా భరిస్తామని హామీ