చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడిపై దాడిని ఖండించిన మంత్రి శ్రీధర్‌బాబు
రామరాజ్యం పేరుతో చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు నిర్వహాకులు అయిన రంగరాజన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. ఇలాంటి చర్యలు చాలా హేయమైనవని, రామరాజ్యం పేరు చెప్పి రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. రాముఇ పేరును బద్నామ్ చేస్తూ అరాచక, అనాగరిక కార్యకలాపాలకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటు రామరాజ్యం అని చెప్పడం క్షమించరాని నేరమని అంతే కాకుండా ఇది రామ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే చర్య అని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్న ఆరాచక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తెలిపారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం