రాష్ట్ర ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే ప్రాధాన్యతగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
కాటారం మండల పరిధిలోని ధన్వాడ సబ్ స్టేషన్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు 33/11కెవి ఉప విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం
కాటారంలోని శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాటారం గ్రామ పంచాయతి కార్యాలయంలో రూ.50 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి భవనం, కాటారం మండలానికి సంబంధించిన కోటి రూపాయలతో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.14 లక్షలతో కాటారంలో చిల్డ్రన్స్ పార్క్, రూ.2 కోట్లతో పిడబ్ల్యు రోడ్డు దామరకుంట నుండి మానేరు వరకు బీటీ రోడ్, రూ.3 కోట్లతో ఒడిపిలవంచ నుండి గూడూరు జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు, రూ.3 కోట్ల,95 లక్షలతో పిడబ్ల్యు రోడ్డు నుండి ధన్వాడ బూడిద పల్లి వరకు బీటీ రోడ్డు, రూ.2 కోట్లతో గుండ్రాతిపల్లి నుండి ఊట్లపల్లి పోచమ్మ దేవాలయం వరకు బీటీ రోడ్డు, రూ.1.9 కోట్లతో కాటారం మండలంలోని గ్రామాలలో అంతర్గత సిసి రోడ్డు, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు.. 2005 మహిళా సంఘాలకు 3,12,64,235 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పంపిణీ చేశారు.
అంతకుముందు కాటారం, మహాముత్తారం, మలహర్ రావు, మహాదేవ్ పూర్ మండలాలకు వైకుంఠ రధాలకు అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి ప్రారంభోత్సవం చేసి నాలుగు మండలాలకు అందచేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఎస్ ఆర్ నిధులు రూ.20 లక్షలతో అందించిన అంబులెన్స్ పలిమెల మండలానికి మంత్రి మీదుగా ప్రారంభోత్సవం చేసి అందచేశారు.
మాజీ సభాపతి శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని బిఎల్ఎం గార్డెన్స్ లో నిర్వహించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, మలహర్ రావు, పలిమెల మండల కు సంబంధించి 243 మంది లబ్ధిదారులకు కోటి 90 లక్షల విలువ వేసి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.