24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం మన అదృష్టం – పవన్ కళ్యాణ్

చంద్రబాబునాయుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రెండో కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్న పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, మూలాలను పెకిలించేసి భారీ అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. ప్రజలు మనపై బృహత్తర బాధ్యత పెట్టారు. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలం. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లే అన్నారు. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది.  నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారు . ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టమన్నారు. కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదు మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా అని ప్రశ్నించారు. పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలి. అందుకు ఐఏఎస్ లే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్లను పవన్ కళ్యాణ్ కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com