- మారుతి సుజుకి స్టాక్ క్లియరెన్స్ సేల్
- అందుబాటులో పలు రకాల మోడళ్లు
- వచ్చే ఏడాది భారీగా పెరగనున్న కార్ల ధరలు
ఇయర్ ఎండ్ మెమరీగా ఎవరైనా కారు కొనాలనుకుంటే ఇది రైట్ టైమ్. మారుతి సుజుకి 2024 ఏడాది చివర్లో స్టాక్ క్లియరెన్స్ సేల్ చేయాలనుకుంటోంది. జనవరి నుంచి కార్ల రేట్లను, మోడల్స్ ను పెంచాలనుకుంటున్న ఈ సంస్థ ఇప్పుడున్న స్టాక్ ను ప్రస్తుత ధరలకే ఇచ్చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త స్టాక్ తో పాటు, పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. కాబట్టి కారు కొనాలనుకునే మధ్య తరగతి వారు మారుతి కార్లను ట్రై చేయవచ్చు.కార్ల తయారీ,నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండడంతో వాటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు జనవరి నుంచి అన్ని రకాల మోడళ్లపై ధరలు పెంచాలని మారుతి సంస్థ నిర్ణయించింది. మోడల్‌ను బట్టి నాలుగు శాతం వరకు ధరలు పెంచనున్నట్టు తెలిపింది.
నిర్వహణ, తయారీ ఖర్చులు తగ్గించుకుని వినియోగదారులపై భారం పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పెరిగిన వ్యయాన్ని కొనుగోలుదారులపైకి మళ్లించక తప్పడం లేదని మారుతి సుజుకి తెలిపింది. మారుతి సుజుకి ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వేగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఆల్టో కే10, ఎస్-ప్రెసో మోడళ్లను విక్రయిస్తోంది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బ్రెజా, ఎకో, ఎర్టిగాతోపాటు ఎంపీవీ సెగ్మెంట్‌లో ఎరీనా ఉంది. నెక్సా అవుట్‌లెట్లలో ఇగ్నిస్, బాలెనో, ఫ్రోంక్స్, సియాజ్, ఎక్స్ఎల్6, జిమ్నీ, ఇన్విక్టోలు విక్రయిస్తోంది.
మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మరో కార్ల మేకర్ హ్యుందాయ్ కూడా పలు మోడళ్ల ధరలు పెంచింది. కొత్త ధరలు జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మోడళ్లను బట్టి కనీసం రూ. 25 వేలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, లగ్జరీ కార్ మేకర్లు అయిన ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటివి కూడా కార్ల ధరలను పెంచాయి.