27.3 C
Hyderabad
Monday, September 21, 2026

Live Video

spot_img

దుబాయ్‌లో కోహ్లీ కష్టాలు..

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే టీమిండియా దుబాయ్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే ఇటీవల బీసీసీఐ తీసుకొచ్చిన 10 రూల్స్‌ను అమలు చేశారు. అంటే కుటుంబాన్ని తీసుకువెళ్లొద్దు.. సొంత చెఫ్‌ ఉండకూడదు.. లగేజీ విషయంలో నియమాలు.. ఇలా మొత్తం 10 రూల్స్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే ఈ రూల్స్‌కు తొలి బాధితుడిగా మారింది విరాట్ కోహ్లీనే అని తెలుస్తోంది. దుబాయ్‌కు వెళ్లిన కోహ్లీకి ఇప్పుడు తిండి కష్టాలు మొదలయ్యాయి.

విరాట్‌ కోహ్లీ డైట్ విషయంలో చాలా పక్కగా ఉంటాడు. ఇప్పటి వరకు మ్యాచ్ ఎక్కడ జరిగిన అతనితో పాటు వ్యక్తిగత చెఫ్‌ ఉండేవాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో అక్కడి తిండి తినలేక ఇబ్బందుల పడుతున్నాడు. అయితే తన ఫుడ్‌ను ఇప్పుడు బయటి నుంచి ఆర్డర్‌ పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా చెఫ్‌ లేకపోవడంతో లోకల్‌ టీమ్‌ మేనేజర్‌కు చెప్పి తనకు కావాల్సిన వాటిని తెప్పించుకున్నాడు కోహ్లీ. డబ్బులు మాత్రం పూర్తిగా కోహ్లీనే చెల్లించాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన సీన్స్ దుబాయ్‌ స్టేడియంలో కనిపించాయి. కోహ్లీకి ఫుడ్ ఆర్డర్ రావడం.. అందులో ఒక ప్యాకెట్‌ను అతను గ్రౌండ్‌లో తినడం.. మరో ప్యాకెట్‌ను తర్వాత తినేందుకు దాచుకోవడం.. ఈ సీన్స్ అన్ని వీడియోలో రికార్డ్ అయ్యాయి.

బీసీసీఐ ఈ టూర్ విషయంలో ఇంత కఠినంగా రూల్స్ పాటించేందుకు కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.రీసెంట్‌గా జరిగిన సిరీస్‌లో ఓ కీలక ఆటగాడు బీసీసీఐ రూల్స్‌ను బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. లగేజీ విషయంలో రూల్స్‌ను బ్రేక్ చేశాడని సమాచారం. దీంతో ఈసారి ప్లేయర్స్‌కు ఎలాంటి చాన్స్ ఇవ్వడం లేదు బీసీసీఐ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com