ఇంగ్లండ్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్‌తో ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమైంది టీమ్ ఇండియా. ఇప్పటికే ప్లేయర్సంతా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు. ప్రస్తుతం సమరానికి సన్నద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్నట్టు బయటికి వచ్చిన సమాచారం ఫ్యాన్స్‌ను కాస్త కలవర పెడుతోంది. నిజానికి వీరు టీమ్ ఇండియా ప్లేయర్స్ గురించి మాటల యుద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది.
శ్రేయస్ గురించి చర్చ
శ్రేయస్ అయ్యర్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. బ్యాట్‌తో రాణించడంతో అతడిని పక్కన పెట్టలేని పరిస్థితి. దీంతో శ్రేయస్ కోసం గంభీర్ పట్టుపడుతున్నాడు. అదే సమయంలో పంత్ కోసం అగార్కర్ వాదిస్తున్నాడు. కానీ అగార్కర్ మాటలను పట్టించుకోకుండా శ్రేయస్‌ను కంటిన్యూ చేశాడు గంభీర్. అందుకే పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
ఛాంపియన్స్ ట్రోఫి టీమ్‌లో వికెట్ కీపర్‌గా ఫస్ట్ చాయిస్ పంత్‌దే అని అగార్కర్ తెలిపాడు. కానీ రాహులే ఫస్ట్ చాయిస్ అని గంభీర్ చెబుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదని తేలిపోయింది. అయ్యర్‌తో పాటు రాహుల్ బాగా ఆడుతున్నాడని, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం వీలుకాదని గంభీర్ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక గంభీర్ హయాంలో బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారిపోయింది. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ కావాలనుకున్నప్పుడు అక్షర్ పటేల్‌ను ముందు పంపిస్తున్నారు. దీంతో పంత్ అవసరం ఎక్కువగా రావడం లేదు. దీనికి తోడు అక్షర్ కూడా పరుగులు బాగానే రాబడుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో వరుసగా 52, 41 పరుగులు చేశాడు. అంతకుముందు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.