27.8 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

అన్‌స్టాపబుల్ పంజాబ్

వార్ వన్‌ సైడ్‌ అన్నట్టుగా దూసుకుపోయింది పంజాబ్ కింగ్స్. మమ్మల్ని ఆపేది ఎవడ్రా అన్నట్టుగా లక్నోపై వీరవిహారం చేసింది. దీంతో 172 పరుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ 16.2 ఓవర్లలో చేజ్ చేసింది. దీంతో వరుసగా రెండో విక్టరీని తన అకౌంట్‌లో వేసుకుంది పంజాబ్.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చేసిందనే చెప్పాలి. మొదట బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన పంజాబ్.. అనంతరం విధ్వంసకరమైన బ్యాటింగ్‌ను లక్నోకు చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆయుష్‌ బదోని 41.. అబ్దుల్ సమద్ 27, పూరన్‌ 44, మార్‌క్రమ్ 28 పరుగులు చేయడంతో 171 పరుగులు చేసింది సూపర్ జెయింట్స్.

172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. మొదటి నుంచే అటాక్ చేయడం ప్రారంభించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ అయితే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇక అయ్యర్ నెహాల్ వధేరా కూడా ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. అయ్యర్ 52, వధేరా 43 పరుగులు చేయడంతో పంజాబ్ గెలుపు ఈజీ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో హైలేట్ ఏంటంటే రవి బిష్ణోయ్, ఆయుష్‌ బదోని పట్టిన స్టన్నింగ్ క్యాచ్. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్‌.. భారీ షాట్‌ ఆడగా బౌండరీ లైన్ వద్ద బదోని క్యాచ్‌ గాల్లోకి ఎగిరి క్యాచ్‌ పట్టాడు. కానీ బౌండరీ అవతల ల్యాండ్ అవుతానని తెలిసి వెంటనే గ్రౌండ్‌లోని బాల్‌ను విసిరేశాడు. ఆ బాల్‌ను బిష్ణోయ్‌ డైవ్‌ చేసి క్యాచ్‌ చేశాడు. ఈ ఐపీఎల్‌లో ఇదో బెస్ట్ క్యాచ్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com