ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో అనేక దేశాలపై టారిఫ్ కత్తి దూయనుంది అమెరికా. ఇప్పటికే అనేకసార్లు వార్నింగ్ ఇస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలతో ఓ ఆట ఆడుకుంటున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈరోజు ఏ దేశంపై ఎంత మేర టారిఫ్ వేయబోతున్నారో క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు అమెరికాను అనేక దేశాలు దోచుకున్నాయని.. ఇకపై ఈ ఆటలు కొనసాగవు అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రంప్. ఆయన అనౌన్స్ చేసే టారిఫ్‌లు తక్షణం అమల్లోకి రానున్నాయి. అంతేగాకుండా ఇవి శాశ్వతంగా అమల్లో ఉండనున్నాయి.
ట్రంప్ ఏ దేశంపై ఎంత టారిఫ్ విధిస్తారు? వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ట్రంప్ టారిఫ్ కత్తికి బలయ్యే దేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా, మెక్సికో, కెనడా ఉంటాయనేది తెలుస్తోంది. అయితే నిన్న వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ మాత్రం ఈయూ, జపాన్‌పై కూడా భారీగానే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పకనే చెప్పినట్టు కనిపించింది. టారిఫ్‌ల విషయంలో ఏ దేశానికి మినహాయింపులు ఉండవన్నది ట్రంప్ వ్యాఖ్యలు. మరి ఈ వ్యాఖ్యలు ఎంత మేరకు నిజమవుతాయో చూడాలి.
ట్రంప్ నిర్ణయాలపై ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా రియాక్టవుతాయన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరమే. ఎందుకంటే ట్రంప్ అనౌన్స్‌మెంట్ రాగానే ఘాటుగా స్పందించే దేశాలు రెండు. ఒకటి చైనా, రెండు కెనడా. ఇవి కూడా అమెరికాకు కౌంటర్‌గా భారీగానే టారిఫ్‌లు విధిస్తే మాత్రం ట్రేడ్ వార్ మొదలైనట్టే. ఈయూ కూడా అమెరికా నిర్ణయాలపై ఆచితూచి కాకుండా.. ఘాటుగానే స్పందిస్తుంది. తమ ప్రయోజనాలు తమకు ముఖ్యమని బహిరంగంగానే చెబుతోంది. మరి ఈయూ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇప్పటికే టారిఫ్‌ల బయంతో ప్రపంచ దేశాల్లో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పడుతున్నారు. మరి ట్రంప్ ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.