29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

అన్‌స్టాపబుల్ బుమ్రా… మరో ఐసీసీ అవార్డ్

భారత్‌ స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రిత్‌ బుమ్రా మరో ఐసీసీ అవార్డును దక్కించుకున్నాడు. ఐసీసీ మెన్స్‌ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2024 సంవత్సరానికిగాను ఈ అవార్డ్ దక్కించుకున్నాడు. ఇప్పటికే బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న బుమ్రా.. ఈ అవార్డు కూడా సొంతం చేసుకోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. బెస్ట్ మెన్స్ క్రికెట్ అవార్డు కోసం బుమ్రాతో పాటు ట్రావిస్ హెడ్, జో రూట్, హ్యారి బ్రూక్‌ను పోటీ పడ్డారు. కానీ అవార్డు మాత్రం బుమ్రాకే దక్కింది. ఇప్పటి వరకు కేవలం నలుగురు ఇండియన్స్‌కు మాత్రమే ఈ అవార్డు దక్కింది. ఇప్పుడు వారి సరసన చేరాడు బుమ్రా.

2004లో రాహుల్ ద్రావిడ్, 2010లో సచిన్ టెండూల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్వి్, 2017, 2018లో విరాట్ కోహ్లీ ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు వారి పక్కన చేరాడు బుమ్రా. ఈ అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు బుమ్రా. 2024 నా జీవితంలో గుర్తుండిపోతుందని చెబుతున్నాడు.

గతేడాది 13 టెస్టులు ఆడిన బుమ్రా.. ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. అందులో ఐదు సార్లు ఐదు వికెట్లు తీశాడు బుమ్రా. ప్రస్తుతం టెస్ట్‌ బౌలింగ్ ర్యాంకుల్లోనూ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు బుమ్రా.

బుమ్రాకు ఇప్పటికే బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును కట్టబెట్టింది. దీంతో బుమ్రా ఖ్యాతి మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ అవార్డులతో పాటు మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు బుమ్రా. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారత్ పేసర్ కూడా బుమ్రా కావడం విశేషం. 2024లో బౌలింగ్ కేటగిరిలో చూస్తే బుమ్రా నామ సంవత్సరం అని చెప్పొచ్చు. తన నిప్పుల్లాంటి బంతులను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి టీమ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com