కెనడా.. ప్రస్తుతం పాకిస్థాన్‌ను బీట్ చేసేలా భారత్‌ను టార్గెట్ చేస్తున్న దేశం. అక్కడి అధికార పార్టీ మళ్లీ గెలిచేందుకు చేయాల్సిన స్టంట్స్ అన్ని చేస్తోంది. దీనికి భారత్‌ను పావుగా వాడుకుంటోంది. అక్కడి ఖలిస్థాన్ ఉగ్రవాదులను పోరాట యోధులుగా చూస్తూ భారత్‌పై అర్థంలేని ఆరోపణలు చేస్తూ.. ప్రపంచ దేశాల్లో భారత్ పరువును తీయాలని పదే పదే చూస్తోంది. ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వాన్ని లాగిన అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. తాజాగా కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని మరోసారి ఆరోపించింది. దీంతో భారత్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది.
కెనడా ఎన్నికల్లో విదేశాల జోక్యం ఉందని మొదట ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. రీసెంట్‌గా ఈ కమిషన్ తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించింది. ఇందులో భారత్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మూడు రాజకీయ పార్టీలకు భారత ప్రభుత్వ ప్రతినిధులు రహస్యంగా ఆర్థికసాయం అందించారు అని నివేదికలో రాశారు అధికారులు. అయితే 2021 ఎన్నికలకు సంబంధించినది అని ఆ రిపోర్ట్‌లో తెలిపారు.
అయితే ఈ రిపోర్ట్ వచ్చిన టైమింగ్‌ను చూస్తే అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. 2021లో ఎన్నికల్లో జరిగిన విషయాలను.. మళ్లీ 2025 ఎన్నికలకు ముందు బయటపెట్టడం ఏంటో? అనేది ఫస్ట్ డౌట్. ఇన్నాళ్లు ఈ విషయాలు తెలియలేదా? లేక ఓడిపోతామన్న భయంతో ప్రజల్లో సానుభూతి పొందాలని ఈ విధంగా చేస్తున్నారా? అనేది సెకండ్ డౌట్.
ఏదేమైనా ఈ రిపోర్ట్ బయటికి రాగానే అక్కడి మీడియా భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించింది. దీంతో ఇక భారత విదేశాంగశాఖ రంగంలోకి దిగక తప్పలేదు. తాము ఏ విదేశీ ప్రభుత్వ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. ఇది ముమ్మాటికి నిరాధార ఆరోపణలే అని తేల్చి చెప్పింది. అంతేకాదు అసలు కెనడానే తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని.. భారత్‌లో అలజడి సృష్టించే వారికి ఆశ్రయం ఇస్తోందని చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.