ఫిబ్రవరి నాలుగొవ తేదీన విచారణకు హాజరుకావాలని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు బుధవారం మళ్ళీఒకసారి నోటీసులు జారీ చేశారు. చంద్రబాబునాయుడు, నారాలోకేష్, పవన్‌కళ్యాణ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ సామాజిక మాధ్యంలో పోస్ట్ చేశారని గత నవంబర్ మాసంలో రామ్‌గోపాల్‌వర్మపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో టీడీపీ నేతలు కేసులు నమోదు చేశారు. టీడీపీ నాయకులు పెట్టిన కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అదే నవంబర్ నెలలో విచారణకు హాజరుకావాలని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులతో పాటు ఒంగోలు పోలీసులు కూడా రామ్‌గోపాల్‌వర్మకి నోటీలు ఇచ్చారు. మొదటి సారి ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులు రెండో సారి రామ్‌గోపాల్‌వర్మ వాట్స్‌యాప్‌కి మెసేజ్ రూపంలో నోటీలు ఇచ్చారు. అయితే ఈ రెండు సార్లు కూడా రామ్‌గోపాల్‌వర్మ విచారణకు హాజరుకాలేదు. తనకు ముందుగా నిర్ణయించుకున్న షూటింగ్‌లు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆతరువాత తనపై రాష్ట్రంలో అనేక చోట్ల సబంధం లేని వ్యక్తులు కేసులు పెట్టడంపై వర్మ కోర్టును కూడా ఆశ్రయించారు. తాజాగా రెండు నెలల తరువాత ఒంగోలు పోలీసులు ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు హజరు కవాలని మరోసారి ఆర్జీవీకి నోటీసులు వాట్సప్ ద్వారా పంపించారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బుధవారం రామ్‌గోపాల్‌వర్మ వాట్స్‌యాప్‌కి నోటీసులు మెసేజ్ చేశారు. ఇటీవల మూడు రోజుల క్రితం పోలీసులు ఎలక్ట్రానిక్ పద్దతుల్లో నోటీసులు ఇస్తే చెల్లవని రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసుల తాజా వాట్స్‌యాప్ నోటీసులపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
- Advertisement with us -