34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

టీ20 సిరీస్ లో ఖాతా ఓపెన్ చేసిన ఇంగ్లాండ్..

అంతా ఆదిల్, పాండ్యా వల్లే..

టీమిండియా హ్యాట్రిక్ విక్టరీ ఆశలు గల్లంతయ్యాయి. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ సేన ఓడింది. దీంతో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే టీమిండియా ఓటమికి కారణం ఇంగ్లీష్‌ టీమ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అని చెప్పాలి.

నిజానికి ఆదిల్ పెద్దగా ఏం వికెట్లు తీయలేదు. కానీ కీలక సమయంలో చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. ఆదిల్ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక అత్యంత కీలకమైన తిలక్ వర్మ్ వికెట్ తీశాడు. దీంతో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అయితే 172 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. నిజానికి 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. దీంతో మరికాసేపట్లో మ్యాచ్ ముగిసిపోతుందనుకున్న సమయంలో లివింగ్ స్టోన్ ఊచకోత ప్రారంభించాడు. 24 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్స్‌లు.. ఒక ఫోర్ ఉంది. దీంతో టీమ్ స్కోర్ 170 వరకు వెళ్లింది.

ఇక మన బ్యాట్స్‌మెన్ కీలక సమయంలో వికెట్లు సమర్పించుకుంటూ వెళ్లారు. శాంసన్, అభిషేక్, తిలక్ వర్మ పరుగులు రాబట్టడంలో ఫెయిలయ్యారు. ఇక హార్ధిక్ పాండ్యా 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా అతడిపై విమర్శలు మొదలయ్యాయి. అతని ఆట టీ20 ఫార్మాట్‌కు సరిపోయేలా లేదని కొందరు మాజీ క్రికెటర్లు విమర్శించారు. 40 పరుగులు చేసేందుకు 35 బంతులు తీసుకోవడం దారుణమన్నారు. అతడి వల్ల మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగిందంటూ విమర్శించారు.

మొత్తానికి టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో లీడ్‌ ఉంది టీమిండియా. నెక్ట్స్‌ మ్యాచ్లో గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకుంటాం. ఓడితే మాత్రం ఆఖరిపోరు మరింత ఉత్కంఠగా మారుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com